సీఎం కేసీఆర్ శనివారం వరంగల్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే.. సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి వరంగల్‌కు రోడ్డు మార్గాన బయలు దేరారు. అయితే.. సీఎం కేసీఆర్ కాన్వాయ్ జనగాం జిల్లా, పెంబర్తి కళాతోరణం చేరుకోగానే.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్థానిక నేతలు సీఎం కేసీఆర్‌కు శాలువ కప్పి స్వాగతం పలికారు. అయితే.. అనంతరం సీఎం కేసీఆర్ కాన్వాయ్ కదులుతుండగా.. మహిళా కానిస్టేబుల్ కాన్వాయ్‌లోని ఓ కారులో ఎక్కుతుండగా జారిపడిపోయింది. అయినప్పటికీ.. కాన్వాయ్ ఆపకుండా వెళ్లిపోయింది. దీంతో ఆ మహిళా కానిస్టేబుల్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
ఆమెను పోలీసులు ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. సీఎం కేసీఆర్ నేడు హన్మకొండ జిల్లాలోని దామెర క్రాస్‌రోడ్, జాతీయ రహదారి-163లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రతిమ రిలీఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ప్రతిమ మెడికల్ కళాశాల, ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే ఆయన వరంగల్ పర్యటనకు వెళ్లారు.