CM KCR Speech at Warangal Prathima Hospital Opening
సీఎం కేసీఆర్ నేడు హన్మకొండ జిల్లాలోని దామెర క్రాస్‌రోడ్, జాతీయ రహదారి-163లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రతిమ రిలీఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ప్రతిమ మెడికల్ కళాశాల, ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొంత కాలంగా వైద్య సేవకు విస్తారరించాలని ప్రతిమ వైద్య కాలేజీ యజమానులు అభినందనలు తెలిపారు. కేసీఆర్ ఉద్యమం ప్రారభించిన సమయంలో పుట్టిన వాళ్ళు ఇప్పుడు వైద్య విద్యార్థులు ఉన్నారని, తెలంగాణ ఉద్యమం రాష్ట్రాన్ని సాధించామన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో ముందుందని, కేంద్ర మంత్రులు ఇక్కడ తిట్టిపోతారు ఢిల్లీకి వెళ్లి అక్కడ అవార్డు ప్రకటిస్తారన్నారు. రాజకీయం కోసం చేసే విమర్శలను పట్టించుకోవద్దన్న సీఎం కేసీఆర్.. అన్ని రంగాళ్ల వలే వైద్య రంగంలో అభివృద్ధి చెందమన్నారు. కేంద్రం సహకరించకపోయిన 33 జిల్లాలో మెడికల్ కాలేజీలు తెచ్చుకోవచ్చని, అన్ని మెడికల్ కాలేజీలు వస్తే రానున్న రోజుల్లో వేల మెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయన్నారు. పీజీ సీట్లు పెరుగుతున్నాయని, ఉక్రెయిన్ లాంటి ప్రాంతలకు వెళ్లాల్సిన అవసరం ఇక ఉండదన్నారు.
ఉన్న రాష్ట్రాన్ని పోగొట్టుకుంటే ఎంతా నష్టం పోవాల్సి వచ్చిందో అందరికి తెలిసిందేనని, మన అస్తిత్వం కోసం కోట్లాది తెచ్చుకుని రాష్ట్రం లో అభివృద్ధి జరుగుతుందని, ప్రపంచానికి అన్నపూర్ణ లాగా భారత దేశం ఉందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవసాయ భూములు భారతదేశం లో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ‘ ఇన్ని వనరులు ఉన్న భారత దేశం వంచిచపడుతుబంది.. పిజ్జా.. బర్గర్‌లు తినే పరిస్థితులు ఉన్నాయి. మెడికల్ విద్యతోపాటు సామాజిక విద్యపైన కూడా దృష్టి ఉంచుకోవాలి. సిరిసిల్ల, ములుగులో పైలెట్ పాజెక్టుగా హెల్త్ ప్రొఫైల్ చేస్తున్నాం. ఇది 119 నియోజకవర్గంలో అందుబాటులో వస్తుంది.. ములుగు డయాలసిస్ సెంటర్ కూడా ప్రారంభిస్తాం. వరంగల్‌లో మెడికల్ సిటీ నిర్మాణం జరుగుతుంది.. ఇది పూర్తి అవుతే హైదరాబాద్ వాళ్ళు వరంగల్ కి వచ్చి చికిత్స తీసుకునే పరిస్థితి వస్తుంది.’ అని ఆయన అన్నారు. అయితే.. జై తెలంగాణ జై భారత్ నినాదం చేశారు సీఎం కేసీఆర్.