యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల్లలో తన కూతురును ప్రేమ వివాహం చేసుకున్నాడని అబ్బాయి ఇంటిని తగలబెట్టారు అమ్మాయి తరఫు బంధువులు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. తన కొడుకు ప్రేమ వివాహం చేసుకున్న విషయాలు తెలిసి…. అమ్మాయి తరఫు బంధువులు దాడికి పాల్పడే అవకాశం ఉంటుందని భావించిన అబ్బాయి తల్లిదండ్రులు ఇంటిని విడిచి వెళ్లిపోగా.. ఈ తెల్లవారుజామున అమ్మాయి తరఫు బంధువులు అబ్బాయి ఇంటిని తగలబెట్టారు.
ఈ ఘటనలో ఇల్లు ఇంటిలో వస్తువులు పాక్షికంగా దగ్ధం అయ్యాయి. నిన్న ప్రేమ వివాహం చేసుకున్న జంట ఊరు విడిచి వెళ్ళిపోయింది. వీరిద్దరి పెళ్లి అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో పాటు ఇద్దరూ కులాంతర వివాహం చేసుకోవడమే ఈ ఘటనకు కారణంగా తెలుస్తుంది.