శీతాలకాలం వచ్చిందంటే చాలు గొంతునొప్పి, జలుబు, జ్వరం, దగ్గు, పెద్దవాళ్లకు కీళ్లనొప్పులు ఇలా వస్తూనే ఉంటాయి. ఈ సమయంలో వంటింటి చిట్కాల మనకు మేలు చేస్తాయి. వంటింట్లో ఉపయోగపడే ఉచితాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలంలో చిన్నపిల్లలకు ఛాతీలో కఫం పేరుకుపోవడం సహజం. చెంచాడు వాముని కడాయిలో వేసి దోరగా వేయించండి. వాటిని ఒక పలుచటి వస్త్రంలో మూటకట్టి, పిల్లల ఛాతీపై మృదువుగా కాపడం పెడితే ఆయాసం తగ్గి, ఊపిరిని తేలికగా తీసుకోగలుగుతారు. గ్లాస్ పాలను మరిగించి అర చెంచా మిరియాల పొడి, కొంచెం బెల్లం కలిపి రెండు పూటలా తీసుకోవాలి. ఇలా చేస్తే జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు. మరిగించిన కప్పు నీటిలో చెంచా మిరియాల పొడి వేసి కషాయంలా కాయాలి.
దీనికి ఉప్పు కలిపి బాగా గార్లిక్ చేస్తుంటే టాన్సిల్స్‌కు దూరంగా ఉండవచ్చు. గొంతు నొప్పి కూడా తగ్గుతుంది. కడాయిలో అర చెంచా నెయ్యి వేసి వేడి అయ్యాక సొంటి కొమ్ము ను వేయించి చల్ల చాలి. తర్వాత సొంటినే పొడి చేసుకోవాలి. పొడిని అన్నంలో నెయ్యి తో పాటు కలిపి మొదటి ముద్దగా నిత్యం తీసుకోవాలి. సొంటి, జీర్ణశక్తిని మెరుగు పరుస్తుంది. చలికాలంలో కీళ్లనొప్పులు ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు సొండి కొమ్మును అరగదీసి గంధాన్ని కొద్దిగా వెచ్చ పెట్టి కీళ్లపై పలుచని పొరల లేపనం వేసుకోవాలి. ఇలా చేస్తే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కప్పు నీటిని మరిగించి అందులో చెంచాడు మెంతులు వేసి టీ ఇలా కాచుకోవాలి. జ్వరం వచ్చినప్పుడు రోజులో మూడు లేదా నాలుగు సార్లు దీని తాగితే వైరస్ వల్ల శరీరంలో చేరిన మలినాలు బయటకు పోతాయి. జ్వరం త్వరగా తగ్గుముఖం పడుతుంది.