యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సలార్. హోంబాలే ఫిలిమ్స్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెస్ట్ తో పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ నటిస్తోంది. ఎప్పుడో పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రంపై ప్రేక్షకులను భారీ అంచనాలు పెట్టుకున్నారు. కెజిఎఫ్ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన ప్రశాంత్ […]
విశ్వనటుడు కమల్ హాసన్ రెండో కూతురు అక్షర హాసన్ నటిస్తున్న తాజా చిత్రం ‘అచ్చం మడం నాణం పయిర్పు’. రాజా రామూర్తి దర్శకత్వంలోతెరకెక్కిన ఈ సినిమా మార్చి 25న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. ఇక దీంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన అక్షర హాసన్ ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకొంది. ” ఈ చిత్రంలో నేను ఒక టీనేజ్ అమ్మాయిలా కనిపిస్తాను. సాంప్రదాయ కుటుంబంలో పుట్టి, సామజిక విలువలు కాపాడడానికి తనలో ఉన్న […]
మలయాళ చిత్రం ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ ‘గాడ్ ఫాదర్’ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. మెగాస్టార్ చిరంజీవి, స్టార్ హీరోయిన్ నయనతారతో పాటు ఇందులో బాలీవుడ్ బాద్ షా సల్మాన్ ఖాన్ సైతం జత కట్టడంతో ఈ ప్రాజెక్ట్ మరో లెవెల్ కు చేరుకుంది. తాజాగా ముంబైలో జరిగిన షెడ్యూల్ లో సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు. చిరంజీవి, సల్మాన్ ఖాన్ పై కీలక సన్నివేశాలను దర్శకుడు మోహన్ రాజా చిత్రీకరించిన తర్వాత చిరు హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆ […]
తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్’. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ స్వరూప్ ఆర్.ఎస్.జె. దర్శకుడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఎన్ ఎం పాషా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా, ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. యు/ఎ సర్టిఫికెట్ పొందింది. ఇదిలా ఉంటే ‘ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ […]
కోలీవుడ్ హీరోయిన్ మీరా మిథున్ మరోసారి వార్తల్లో నిలిచింది. అమ్మడికి వివాదాలేమి కొత్తకాదు.. సోషల్ మీడియాలో ఏది అనిపిస్తే అది మాట్లాడి వివాదాలను కొనితెచ్చుకొనే ఈ భామపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. తమిళ్ లో కొన్ని సినిమాల్లో నటించిన మీరా.. తనకు అవకాశాలు రాకుండా కొంతమంది అడ్డుకుంటున్నారని, అందులో షెడ్యూల్ కులస్థులు కూడా ఉన్నారని, వారిని వెంటనే సినీ ఇండస్ట్రీ నుంచి తప్పించాలంటూ వారిని, వారి కులాన్ని కించపరుస్తూ గతంలో వివాదస్పద వ్యాఖ్యలు చేయడం సంచలనంగా […]
జనం కళ్ళింతలు చేసుకొని అమితాసక్తితో ఎదురుచూస్తోన్న ‘ట్రిపుల్ ఆర్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న విడుదలవుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రన్నింగ్ లో ఉన్న అన్ని థియేటర్లలోనూ ‘ఆర్.ఆర్.ఆర్.’ విడుదలవుతోంది. ముఖ్యంగా తెలుగు సినిమాకు గుండెకాయలాంటి ఆంధ్రప్రదేశ్ లో అయితే ప్రతి ఊరిలో అన్ని సినిమా హాళ్ళలోనూ ‘ట్రిపుల్ ఆర్’ సందడి చేయబోతోంది. తెలుగునాట చాలా రోజులకు విడుదలవుతోన్న అసలు సిసలు మల్టీస్టారర్ గా ‘ట్రిపుల్ ఆర్’ జేజేలు అందుకుంటోంది. అందువల్ల ఆ సినిమాకు ఉన్న […]
బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ బ్యూటీ అనడానికి ఫిదా కానీ ప్రేక్షకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు. ఇక తెలుగులో లోఫర్ సినిమాతో పరిచయమైన దిశా ఇక్కడ కూడా తన అందచందాలతో తెలుగు కుర్రాళ్ల మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. ఇక అమ్మడు సోషల్ మేడీఐలో చేసే అరాచకం గురించి మాట్లాడుకొనవసరం లేదు. హాట్ హాట్ ఫోటోలను […]
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనాకు వివాదాలు వదలడం లేదు. అప్పుడెప్పుడో ఆమె చేసిన వివాదాస్పద వైకాయలు ఇప్పటికీ ఆమెను వేధిస్తూనే ఉన్నాయి. గతంలో కంగనా, ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. ఇక ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ జావేద్, కంగనాపై పరువు నష్టం కేసును వేశారు. గత కొన్నినెలల నుంచి ఈ కేసు ముంబై కోర్టులో నడుస్తుండగా.. ఇటీవల కంగనా కేసు విచారణకు ప్రత్యక్ష హాజరునుంచి మినహాయింపునివ్వాలని కోర్టుకు విజ్ఞప్తి […]