Big Update:’సలార్’ రిలీజ్ డేట్ ఖరారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సలార్. హోంబాలే ఫిలిమ్స్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెస్ట్ తో పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ నటిస్తోంది. ఎప్పుడో పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రంపై ప్రేక్షకులను భారీ అంచనాలు పెట్టుకున్నారు. కెజిఎఫ్ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన ప్రశాంత్ నీల్, ప్రభాస్ ని ఊర మాస్ అవతారంలో చూపించనున్నాడు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన దీర్స్ లుక్ పోస్టర్ ఇప్పటికీ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా గురించి హోంబాలే ఫిలిమ్స్ అధినేత, నిర్మాత విజయ్ కిరగండూర్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారాయి.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ” సలార్ సినిమా 30 శాతం షూటింగ్ ని పూర్తిచేసుకుంది. మిగతా షూటింగ్ ని మే లో మొదలుకానుంది. ఇక ఈ ఏడాది చివరిలోపు షూటింగ్ ని పూర్తిచేసి, 2023 ఏప్రిల్ కానీ, జూన్ లో కానీ సినిమాను రిలీజ్ చేస్తాం” అని చెప్పుకొచ్చారు. ఇకఎట్టకేలకు సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయడంతో ప్రభాస్ అభిమానులు వచ్చే ఏడాది కోసం ఎదురుచూస్తున్నారు. అయితే గతేడాది షూటింగ్ నిమొదలుపెట్టిన ఈ సినిమా ఇప్పటివరకు 30 శాతం మాత్రమే పూర్తిచేసింది అంటే.. ప్రశాంత్ నీల్ ఎంత పర్ఫెక్ట్ గా సినిమాను చెక్కుతున్నాడో అర్ధం అవుతుందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రభాస్ ఊర మాస అవతారంతో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Also Read
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
- Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
- Veta: 'పెదరాయుడు' లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
- Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన 'ఇరుముడి'!
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!