తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్’. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ స్వరూప్ ఆర్.ఎస్.జె. దర్శకుడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఎన్ ఎం పాషా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా, ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. యు/ఎ సర్టిఫికెట్ పొందింది.
ఇదిలా ఉంటే ‘ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చిందని, ఇందులో నటించిన ముగ్గురు పిల్లల నటన హైలైట్ గా నిలుస్తుందని, దావూద్ ఇబ్రహం అనే వ్యక్తిని పట్టుకునే క్రమంలో వారికి ఎదురైన సమస్యలు ఎంటర్టైనింగ్ గా వున్నాయని’ దర్శకుడు చెప్పారు. ఇందులో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా తాప్సీ నటించింది. ఇటీవలే విడుదలైన పాటకు మంచి రెస్సాన్స్ వచ్చింది. దాంతో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. తెలుగులో డిఫరెంట్ సినిమాగా రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 1న విడుదల కాబోతుంది.