బాలీవుడ్ హీరో జాన్ అబ్రహంకు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అలవాటుగా మారిపోయింది అంటున్నారు మిగిలిన నటులు.. మొన్నటికి మొన్న టాలీవుడ్ లో నటించడంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ గా మారిన జాన్ ప్రస్తుతం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి నెటిజన్ల చేత తిట్టించుకొంటున్నాడు.
కోలీవుడ్ అడోరబుల్ కపుల్ సూర్య- జ్యోతిక గురించి ఎవరికి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అన్యోన్యమైన భార్యాభర్తలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న జంటల్లో వీరు ఒకరు.
ఇంటర్నెట్ వచ్చాకా సినీ అభిమానుల పని సులువు అయ్యింది. ఒకప్పుడు ఒక సినిమాలో సీన్ ను కాపీ కొడితే ఇది ఎక్కడో చూసినట్లు ఉందే అనుకోనేవాళ్ళు..కానీ, సోషల్ మీడియా వచ్చాకా నిమిషాల్లో అది ఎక్కడి నుంచి కాపీ కొట్టారో.. వెతికి మరీ స్క్రీన్ షాట్స్ పెట్టేస్తున్నారు.
కోలీవుడ్ సీనియర్ హీరో విజయకాంత్ ఆరోగ్యం విషమంగా ఉందని కోలీవుడ్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. కెప్టెన్ విజయకాంత్ గా తమిళ్ లోనే కాకుండా తెలుగులోనూ ఆయన సుపరిచితుడే.
మ్యాచో హీరో గోపీచంద్ ప్రస్తుతం 'పక్కా కమర్షియల్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో గోపీచంద్ సరసన రాశీ ఖన్నా నటిస్తోంది.
ఇళయదళపతి విజయ్ నటిస్తున్న కొత్త సినిమాకు 'వారసుడు' అనే టైటిల్ నిర్ణయించారు. జూన్ 22న విజయ్ పుట్టినరోజు సందర్భంగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న సినిమాకు 'వారిసు' అనే పేరు ప్రకటించారు.