Diya Suriya: సూర్య- జ్యోతిక కూతురు బిగ్గెస్ట్ అచీవ్ మెంట్.. మ్యాథ్స్‌లో 100/100
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ అడోరబుల్ కపుల్ సూర్య- జ్యోతిక గురించి ఎవరికి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అన్యోన్యమైన భార్యాభర్తలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న జంటల్లో వీరు ఒకరు. హీరోయిన్ గా కెరీర్ పీక్స్‌లో ఉన్నపుడే సూర్యను పెళ్లి చేసుకుని జ్యోతిక సినిమాలకు గుడ్‌బై చెప్పిన జ్యోతిక తమ పిల్లలు దియా, దేవ్ ఆలనాపాలనా చూసుకొంటూ గృహిణిగా మారిపోయింది. ఇక సూర్యకు తన పిల్లలు అంటే ఎనలేని ప్రేమ.. ముఖ్యంగా దియాతో సూర్యకు అనుభందం మాటల్లో వర్ణించలేనిది. కొంచెం సమయం దొరికినా సూర్య కూతురు, కొడుకుతో కలిసి చిన్నపిల్లాడు అయిపోతాడు.
ప్రస్తుతం దియా చెన్నైలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 10 వ తరగతి పూర్తి చేసింది. ఇక తాజాగా ఆమె పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. చిన్నతనం నుంచి దియా చదువుల్లో దిట్ట. మొదటి నుంచి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయిన ఆమె 10 వ తరగతి పరీక్షల్లోనూ తన ప్రతిభను చూపించింది. అన్ని సబ్జెక్టుల్లోనూ 95 ప్లస్ మార్కులు సాధించి ఆశ్చర్యపరిచింది. మరి ముఖ్యంగా అతి కష్టమైన మాథ్స్ సబ్జెక్టులో 100 కి 100 స్కోర్ చేసింది. ఇది ఒక బిగ్గెస్ట్ అచీవ్ మెంట్ అని చెప్పొచ్చు. 10 వ తరగతి మ్యాథమేటిక్స్ అంటే ఎంత కష్టంగా ఉంటాయో అందరికి తెలిసిందే. అందులో కనీసం పాస్ మార్కులు వస్తే చాలు అనుకొనేవారు చాలామంది ఉన్నారు. అలాంటిది ఆ సబ్జెక్టులో నూటికి నూరుశాతం మార్కులు సాధించింది అంటే దియా ఎంత కష్టపడిందో అర్ధం అవుతుంది.
Also Read
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
ఇక కూతురు సాధించిన బిగ్గెస్ట్ అచీవ్ మెంట్ కు సూర్య పొంగిపోతున్నారు. అంతే కాదు వారి కుటుంబం మొత్తం సంబరాలు చేసుకుంటోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సైతం సూర్య దంపతులకు, దియాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే దియా ప్రతిభను చూస్తుంటే ముందు ముందు చదువుల్లో బాగా రాణిస్తుందని తెలుస్తోంది. అయితే పెద్దయ్యాక ఆమె సినీ ఇండస్ట్రీకి వచ్చే అవకాశం లేదని కొందరు అంటున్నారు. తల్లిదండ్రుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని దియా హీరోయిన్ గా ఎదుగుతుందా..? లేక తన ప్రతిభకు తగ్గ రంగంలో ఎదుగుతుందా అనేది చూడాలి.
తాజావార్తలు
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
-
Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!