నందమూరి తారక రామారావు పెద్ద అల్లుడు, పురంధేశ్వరి భర్త, బాలకృష్ణ బావ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గుండెపోటుకు గురయ్యారు. మంగళవారం ఉదయం ఆయన సడెన్ గా ఇంట్లో ఛాతీ నొప్పితో బాధపడుతుండగా వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు గుండెలో స్టెంట్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ఇక విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకొని తోడల్లుడిని పరామర్శించారు. ఆయన ఆరోగ్యం పై వైద్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక దగ్గుబాటి వెంకటేశ్వరావు.. రామానాయుడు అన్న కొడుకు అన్న విషయం విదితమే. దీంతో దగ్గుబాటి ఫ్యామిలీ కూడా ఆసుపత్రికి చేరుకున్నట్లు సమాచారం. సాయంత్రం లోపు బాలకృష్ణ కూడా బావను చూడడానికి ఆసుపత్రికి వస్తున్నట్లు సమాచారం.