Ayesha Khan: గత కొంతకాలంగా హిట్ అయిన సినిమాల్లో నటిస్తున్న హీరోయిన్లు మాత్రమే కాదు, స్పెషల్ సాంగ్స్ చేసిన హీరోయిన్లు, నెగెటివ్ రోల్స్ చేసిన హీరోయిన్లను కూడా క్రష్ లా మార్చేసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం ఆ క్రష్ లిస్ట్ లోకి చేరింది అయేషా ఖాన్. అసలు ఎవర్రా ఈ అమ్మాయి అని అంటే.. ఓం భీమ్ బుష్ చూసినవారికి బాగా గుర్తుండిపోతుంది.
Teppa Samudram: సింగర్ కమ్ లిరిసిస్ట్ పెంచల్ దాస్ గురించి తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అరవింద సమేతలో రెడ్డమ్మ తల్లి అని ఏడిపించినా.. శ్రీకారం సినిమాలో భలేగుంది బాలా అంటూ అమ్మాయిని ఆటపట్టించినా.. కృష్ణార్జున యుద్ధంలో దారి చూడు దుమ్ము చూడు మామ అంటూ హుషారెత్తించినా.. పెంచల్ దాస్ కె చెల్లింది. ఎన్నో పాటలు ఆయన చేతినుంచి జాలువారాయి..
Love Me: టాలెంటెడ్ యాక్టర్స్ ఆశిష్, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం లవ్ మీ. ఇఫ్ యు డేర్ అనేది ఉప శీర్షిక. అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి టీజర్ రీసెంట్ గా విడుదలైన సంగతి తెలిసిందే.
TheyCallHimOG: ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోలు.. టాలీవుడ్ విలన్స్ గా ఎంట్రీ ఇవ్వడం ట్రెండ్ గా మారిన విషయం తెల్సిందే. ఇక ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ కూడా OG సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కుర్ర డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి కానీ, ఆయన మంచి మనసు గురించి కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీకి ఏదైనా సమస్య వచ్చినా ముందుడేది ఆయనే. ఇండస్ట్రీలో తన అనుకున్నవారిని జాగ్రత్తగా చూసుకొనేది ఆయనే.
Karthika Deepam: ఆరనీకుమా ఈ దీపం.. కార్తీక దీపం.. పాడడం మొదలుపెట్టండి. వంటలక్క మళ్లీ వచ్చేస్తుంది. ఈ సీరియల్ కు ఉన్న క్రేజ్ మాములుది కాదు. ఎంతోమంది మగవారిని సైతం టీవీ ల ముందు కూర్చోపెట్టిన సీరియల్ ఇది.
Samantha:స్టార్ హీరోయిన్ సమంత ఒక ఏడాది నుంచి రెస్ట్ మోడ్ లో ఉన్న విషయం తెల్సిందే. మయోసైటిస్ వ్యాధితో చికిత్స తీసుకుంటున్న సమంత.. దాంతో పాటు మానసిక ప్రశాంతత కోసం షూటింగ్స్ కు ఒక ఏడాది ఫుల్ స్టాప్ పెట్టింది.
Manchu Vishnu: తెలుగు సినిమా పరిశ్రమ 90 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా గతంలో వజ్రోత్సవం చేసినట్టు ఈసారి 'నవతిహి ఉత్సవం' చేయబోతున్నారు. త్వరలో మలేషియాలో నవతిహి పేరిట చేయబోయే ఈ చారిత్రాత్మక ఈవెంట్ గురించి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణు మంచు.. హైదరాబాద్ పార్క్ హయత్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు.
Varalaxmi Sarathkumar: తమిళ స్టార్ యాక్టర్ శరత్ కుమార్ వారసురాలిగా వరలక్ష్మీ శరత్ కుమార్ ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదట హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టినా కూడా తనకు హీరోయిన్ పాత్రలు సూట్ కావని విలనిజాన్ని ఎంచుకుంది. ఇప్పుడున్న ఇండస్ట్రీలో కుర్ర లేడీ విలన్ గా అమ్మడు ఒక గుర్తింపును తెచ్చుకుంది.
బాలీవుడ్ వివాదాస్పద దర్శకుడిగా పేరుతెచ్చుకున్నాడు అనురాగ్ కశ్యప్. ఎలాంటి విషయం అయినా ఆయన మాట్లాడితే వివాదం అవ్వాల్సిందే. ఇక ఈయనపై ఎంతోమంది హీరోయిన్లు లైంగిక వేధింపుల ఆరోపణలు కూడా చేశారు. అయినా ఆధారాలు లేకపోవడంతో అవన్నీ వట్టి మాటలే అని కొట్టిపారేశాడు. ప్రస్తుతం ఒకపక్క డైరెక్టర్ గా, నటుడిగా బిజీగా ఉన్న అనురాగ్.. సోషల్ మీడియాలో ఒక వైరల్ పోస్ట్ ను షేర్ చేశాడు.