Karthika Deepam: ఆరనీకుమా ఈ దీపం.. కార్తీక దీపం.. పాడడం మొదలుపెట్టండి. వంటలక్క మళ్లీ వచ్చేస్తుంది. ఈ సీరియల్ కు ఉన్న క్రేజ్ మాములుది కాదు. ఎంతోమంది మగవారిని సైతం టీవీ ల ముందు కూర్చోపెట్టిన సీరియల్ ఇది. ఎప్పుడెప్పుడు ఈ సీరియల్ వస్తుందా అని ఎదురుచూసిన జనాలకు.. ఎట్టేకలకు సీజన్ 2 తో తెరదింపారు మేకర్స్. కార్తీక దీపం.. ఇది నవవసంతం అనే పేరుతో ఈ సీజన్ మొదలుకానుందని అందరికి తెల్సిందే. ఇక తాజాగా సాంగ్ ను కూడా మార్చేశారు. ఆరనీకుమా ఈ దీపం.. కార్తీక దీపం.. అంటూ సాగిన ఈ సాంగ్ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పబ్ లో డీజేలు కూడా ఇదే సాంగ్ ను రీమిక్స్ చేసి పెడుతున్నారు అంటే అతిశయోక్తి కాదు.
తాజాగా సీజన్ 2 సాంగ్ కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. ఇక పాటలో మోనిత కనిపించలేదు కానీ, మోనిత పాత్ర మాత్రం మారలేదు అనిపిస్తుంది. కేవలం పల్లవిని మాత్రమే అలా ఉంచి చరణాలను మార్చారు. దీప క్యారెక్టర్ ను లిరిక్స్ లో అచ్చుగుద్దినట్లు దింపారు. అడవి కాచిన వెన్నెల అని, తనకు వసంతం ఉండదని దీప పాడగా.. కార్తీక్ సైతం తనకు మంచి లైఫ్ ఉంటుందని ఓదారుస్తూ కనిపించాడు. లిరిక్స్ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. మార్చి 25 నుంచి ఈ సీరియల్ రాత్రి 8 గంటలకు ప్రసారం కానుంది. మరి ఈసారి కార్తీక్ దీపలు ఎలా ఒకటవుతారు అనేది చూడాలి.