TheyCallHimOG: ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోలు.. టాలీవుడ్ విలన్స్ గా ఎంట్రీ ఇవ్వడం ట్రెండ్ గా మారిన విషయం తెల్సిందే. ఇక ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ కూడా OG సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కుర్ర డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పవన్ పొలిటికల్ ప్రచారం లో ఉన్నా కూడా సుజీత్ మాత్రం ఆగడం లేదు. ఆయన లేని సీన్స్ ను ముగించే పనిలో పడినట్లు చెప్పుకొచ్చాడు. ఇక నేడు ఇమ్రాన్ హష్మీ పుట్టినరోజు కావడంతో ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసి OG చిత్ర బృందం ఇమ్రాన్ కు బర్త్ డే విషెస్ తెలిపింది.
ఇక ఈ చిత్రంలో ఈ రొమాంటిక్ హీరో.. సీరియస్ విలనిజాన్ని చూపించబోతున్నట్లు పోస్టర్ ను బట్టే తెలిసిపోతుంది. ఓమి భౌ అనే పాత్రలో ఇమ్రాన్ నటిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. OG తో ఓమి క్లాష్ ఎలా ఉండబోతుందో అస్సలు ఊహించలేరు అంటూ మేకర్స్ చెప్పుకొచ్చారు. ఇక పోస్టర్ లో ఇమ్రాన్.. తలపై ఘాటు, గడ్డం, పొడవాటి జుట్టుతో చూడగానే భయపడే లుక్ లో ఉన్నాడు. ఇక ఆయన సిగరెట్ తాగే విధానం చాలా స్టైల్ గా కనిపించింది. దీంతో పవన్ విలన్ అంటే ఆ మాత్రం ఉండాలమ్మ అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. మరి ఈ సినిమాతో ఇమ్రాన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.