Manchu Vishnu: 90 ఏళ్ళ నవతిహి ఉత్సవం.. టాలీవుడ్ కు మూడు రోజులు సెలవు.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manchu Vishnu: తెలుగు సినిమా పరిశ్రమ 90 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా గతంలో వజ్రోత్సవం చేసినట్టు ఈసారి ‘నవతిహి ఉత్సవం’ చేయబోతున్నారు. త్వరలో మలేషియాలో నవతిహి పేరిట చేయబోయే ఈ చారిత్రాత్మక ఈవెంట్ గురించి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణు మంచు.. హైదరాబాద్ పార్క్ హయత్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు.ఈ ప్రెస్ మీట్ లో మా ప్రసిడెంట్ విష్ణు మంచు, వైస్ ప్రసిడెంట్ మాదాల రవి, ట్రెజరర్ శివ బాలాజీ, ఈసీ మెంబర్స్, పలువురు మలేషియా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇక ఈ ప్రెస్ మీట్ లో మంచు విష్ణు మాట్లాడుతూ.. ” మలేషియా నుంచి ఇక్కడికి వచ్చిన కమల్ నాథ్ గారికి, టూరిజం డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు. రెండేళ్ల క్రితం 90 ఏళ్ల తెలుగు సినిమా ఈవెంట్ చేయాలని నిర్ణయించుకున్నాం. తెలుగు సినీ పరిశ్రమ మొదలైన దగ్గర్నుంచి ఎంతోమంది నటీనటులను గుర్తుచేసుకుంటూ ఈ ఈవెంట్ ని గ్రాండ్ గా, చాలా సక్సెస్ ఫుల్ గా చేయాలని అనుకున్నాం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రోగ్రాం వాయిదా పడుతూ వస్తుంది. అలాగే ఈ ప్రోగ్రాం నుంచి ‘మా’ కోసం ఫండ్ రైజింగ్ కూడా చేద్దామనుకున్నాం. మలేషియా గవర్నమెంట్ తో చేయాలని నిర్ణయించుకున్నాం. రెండేళ్ల క్రితం నేను మలేషియాలో షూట్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగితే కమల్ నాథ్ గారే నాకు ఎంతో సపోర్ట్ చేసారు. ‘మా’ తరపున బిగ్గెస్ట్ సినిమా ఈవెంట్ ను జులైలో మలేషియాలో చేయబోతున్నాము. డేట్స్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. సినీ పరిశ్రమ పెద్ధలతో మాట్లాడి డేట్ ను ఎనౌన్స్ చేస్తాము. అందరిని ఈవెంట్ కి వచ్చేలా చేస్తాము. ఇప్పుడు తెలుగు సినిమాకు గోల్డెన్ ఎరా నడుస్తోంది. తెలుగు నటీనటులుగా మేమంతా గర్విస్తున్నాము. తెలుగు సినిమా ఘన కీర్తిని తెలిపేలా ఈ నవతిహి ఉత్సవం చేయబోతున్నాము. అమితాబ్, అనీల్ కపూర్.. పలువురు నటులను సినిమాలకు తెలుగువారే పరిచయం చేశారు.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
మెగాస్టార్ గారికి పద్మవిభూషణ్ రావడం చాలా గొప్ప విషయం. మన జై బాలయ్య అనే మాట ఎక్కడికి వెళ్లినా వినిపిస్తుంది. నా బ్రదర్ అల్లు అర్జున్ ఫస్ట్ తెలుగు హీరో నేషనల్ అవార్డ్ తీసుకొచ్చాడు. ప్రభాస్ హయ్యెస్ట్ పెయిడ్ ఇండియన్ యాక్టర్. మహేష్ రాజమౌళి గారి సినిమా ఏషియాలోనే బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా కాబోతుంది. రాజమౌళి తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేసారు. కీరవాణి గారు ఫస్ట్ ఆస్కార్ పొందిన తెలుగువారు. ఇలా ఎన్నో సాధిస్తున్నాము. అందుకే ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోవటం కరెక్ట్ టైమ్ అని భావిస్తున్నాము. మలేషియా గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ‘మా’లో దాదాపు 800 కి పైగా ఆర్టిస్టులు ఉన్నారు. కానీ అందులో కొంతమందే బాగా సెటిల్ అయినవాళ్లు. మిగిలిన వాళ్లకు మేము అండగా నిలబడటానికి ఈ ఫండ్ రైజింగ్ చేస్తున్నాము. ఇప్పటికే మేము చేస్తున్న మెడికల్ ఇన్స్యూరెన్స్ చాలా మందికి సపోర్ట్ గా నిలిచింది. ఈ ఈవెంట్ కి ఛాంబర్ తో మాట్లాడాము, నటీనటులు అంతా రావాలి అని అడిగాము. మూడు రోజులు సినిమా ఇండస్ట్రీకి సెలవులు ఇవ్వాలని కోరాము. దిల్ రాజు, దాము గారు సపోర్ట్ చేస్తామన్నారు. త్వరలోనే ఈ నవతిహి ఈవెంట్ డేట్ ని ప్రకటిస్తాం. పక్క రాష్ట్రాల అన్ని సినీ పరిశ్రమలతో టై అప్ అయ్యాము. అన్ని పరిశ్రమలతో మాట్లాడాను. ఈవెంట్ కి వేరే పరిశ్రమ నటీనటులు కూడా కొంతమంది రాబోతున్నారు” అని తెలిపారు. మరి ఈ వేడుకలో ఏఏ స్టార్స్ పాల్గొంటారో చూడాలి.
టాలీవుడ్ 90 ఏళ్ల వేడుకలు మలేసియాలో నిర్వహిస్తాం: 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు#ManchuVishnu #MAA #Tollywood #Tollywood90YearsCelebrations #malaysia #NTVTelugu #NTVENT pic.twitter.com/3X2dBn7Bmc
— NTV Telugu (@NtvTeluguLive) March 23, 2024
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?