Ayesha Khan: గత కొంతకాలంగా హిట్ అయిన సినిమాల్లో నటిస్తున్న హీరోయిన్లు మాత్రమే కాదు, స్పెషల్ సాంగ్స్ చేసిన హీరోయిన్లు, నెగెటివ్ రోల్స్ చేసిన హీరోయిన్లను కూడా క్రష్ లా మార్చేసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం ఆ క్రష్ లిస్ట్ లోకి చేరింది అయేషా ఖాన్. అసలు ఎవర్రా ఈ అమ్మాయి అని అంటే.. ఓం భీమ్ బుష్ చూసినవారికి బాగా గుర్తుండిపోతుంది. ముఖచిత్రం అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది హిందీ బిగ్ బాస్ 17 షోలో పాల్గొని రచ్చ లేపింది. హౌస్ నుంచి బయటకు వచ్చాకా అమ్మడికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇక ఓం భీమ్ బుష్ లో అమ్మడు ఉన్నది కొద్దిసేపే అయినా కూడా అందాల ఆరబోత చేసి కుర్రకారును తన వైపుకు తిప్పుకుంది. కొన్నిరోజులుగా ఈ పిల్ల జోరు మాములుగా లేదు. సోషల్ మీడియాలో అయేషా ఖాన్ ట్రేండింగ్ లో ఉంటుంది.
ఇక తాజాగా అమ్మడు.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లో ఒక స్పెషల్ సాంగ్ చేస్తుంది. విశ్వక్ సేన్, నేహా శెట్టి నటించిన ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహించగా.. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రంలో అంజలి ఒక కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నిన్నటికి నిన్న.. గ్యాంగ్ ఆఫ్ గోదావరి నుంచి ఐటెం సాంగ్ ప్రోమోను వదిలారు. మోత మోగిపోద్ది అంటూ సాగే సాంగ్ ప్రోమోలో అయేషా ఊపిన ఊపు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక ఈ వీడియోను నెటిజన్స్ షేర్ చేస్తూ.. ఆ ఒక్క ఊపుతో ఇండస్ట్రీని ఊపేస్తోంది భయ్యా.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సాంగ్ అమ్మడికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.