Love Me: దిల్ రాజు వారసుడు మంచి డేట్ నే పట్టాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Love Me: టాలెంటెడ్ యాక్టర్స్ ఆశిష్, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం లవ్ మీ. ఇఫ్ యు డేర్ అనేది ఉప శీర్షిక. అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి టీజర్ రీసెంట్ గా విడుదలైన సంగతి తెలిసిందే. టీజర్ కు అమేజింగ్ రెస్పాన్స్ రావటమే కాకుండా సినిమాపై ఉన్న అంచనాలు నెక్ట్స్ రేంజ్‌కు చేరుకున్నాయి. లవ్ మీ- ఇఫ్ యు డేర్’ టీజర్‌ను గమనిస్తే కట్టిపడేసే కథనంతో పాటు వెన్నులో భయాన్ని కలిగించే హారర్ ఎలిమెంట్స్ ఉన్నాయనే విషయం స్పష్టమవుతుంది. ఇది ప్రేక్షకులకు మరచిపోలేని సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌నిస్తుందని టీజర్ చూసిన వారందరూ అంటున్నారు.
బలగం వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత ఓ కుర్రాడు, దెయ్యాన్ని ప్రేమించాలనుకుంటే ఎలా ఉంటుంది.. ఏమవుతుంది.. ఇలాంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతోన్న లవ్ మీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే క్యూరియాసిటీ అందరిలోనూ క్రియేట్ అయ్యింది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ హారర్ థ్రిల్లర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 25 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని మేకర్స్ అధికారికంగా తెలిపారు. దేవర.. ఏప్రిల్ 5 న రావాల్సి ఉండగా.. కొన్నికారణాల వలన అది వాయిదా పడింది. దీంతో ఆ నెలను కుర్ర హీరోలు బాగా వాడేసుకుంటున్నారు. ఏప్రిల్ 25 మంచి డేట్ అని చెప్పాలి. ఏదైనా దిల్ రాజు వారసుడు మంచి డేట్ నే పట్టాడే అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాతో ఆశిష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Also Read
- Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
- Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
- SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం?
- Nana Patekar: కార్గిల్ వార్‌లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
తాజావార్తలు
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
-
Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
-
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!