APPSC Job Notifications: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వివిధ విభాగాల్లో 269 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ద్వారా ఒక్కసారే 9 ప్రకటనలు ఇచ్చింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకునేందుకు వీలుగా దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన ముఖ్య తేదీలను ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా పలు విభాగాల్లో వైద్యులతోపాటు లెక్చరర్లను మరియు ఇతర ఉద్యోగ ఖాళీలను నింపనుంది. ఇందులో.. 72 ఆయుర్వేద డాక్టర్లు, 53 హోమియోపతి వైద్యులు, 26 యునాని డాక్టర్లు, 34 హోమియో లెక్చరర్స్, 3 ఆయుర్వేద లెక్చరర్స్/అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్టుల భర్తీకి విడివిడిగా నోటిఫికేషన్లను విడుదల చేసింది.
read also: MBBS seats in Telangana: గుడ్ న్యూస్.. వెయ్యికి పైగా ఎంబీబీఎస్ బీ-కేటగిరి సీట్లు
అంతేకాకుండా.. నోటిఫికేషన్ నంబర్ 11/2022 కింద ఏపీ ప్రివెంటివ్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ అండ్ ఫుడ్ సబ్ సర్వీసులో 12 శాంపిల్ టేకర్, 8 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ ఆఫీసర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్ తదితర పోస్టులు కలిపి మొత్తం 45 ఉన్నాయి. పై పోస్టులతోపాటు 23 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, 7 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి 2 నోటిఫికేషన్లను ఏపీపీఎస్సీ జారీ చేసింది. గ్రూప్-4 కేటగిరీలో నోటిఫికేషన్ నంబర్ 06/2022 కింద 6 పోస్టులను భర్తీ చేయనుంది. దరఖాస్తు స్వీకరణ తేదీలు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.