Top Five Sportswear in the World: సచిన్ టెండుల్కర్‌ని చూస్తే ఎంఆర్‌ఎఫ్ బ్రాండ్ గుర్తుకొస్తుంది. సానియా మీర్జా కనపడగానే జీవీకే కంపెనీ పేరు కళ్ల ముందు కదులుతుంది. క్రీడాకారులు ధరించే బ్రాండ్స్‌కి ఆ రేంజ్‌లో గుర్తింపు వస్తుంది. ఆయా సంస్థలు ప్రపంచం మొత్తం తెలిసిపోతాయి. అయితే ఇప్పుడు వాళ్లిద్దరూ ఫీల్డ్‌లో లేరు. రిటైర్ అయ్యారు. కానీ.. ఇతర ప్లేయర్లు కొందరు వాళ్ల రేంజ్‌లోనే అభిమానులను అలరిస్తున్నారు. తద్వారా కొన్ని కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని టాప్ ఫైవ్ స్పోర్ట్స్‌వేర్ బ్రాండ్స్ గురించి మీకు తెలుసా?.
అప్పుడెప్పుడో ఒక తెలుగు సినిమా పాటలో ‘యాడిడాస్ బూట్లూ.. తొడగవా నీకు ఆరు కోట్లూ..’ అని కవి రాయటంతో అది కూడా ఒక స్పోర్ట్స్‌వేర్ బ్రాండ్ అని చాలా మంది జనానికి తెలిసిపోయింది. ఆ కంపెనీ సైతం ప్రస్తుతం టాప్ ఫైవ్ స్పోర్ట్స్‌వేర్ బ్రాండ్స్ లిస్టులో చోటు సంపాదించింది. మిగతా నాలుగు బ్రాండ్ల గురించి తెలుసుకోవాలంటే ‘ఎన్-బిజినెస్’ రూపొందించిన ఈ షార్ట్స్ చూస్తే సరిపోతుంది. ఆయా కంపెనీల సీఈఓ, వ్యవస్థాపక సంవత్సరం, హెడ్ క్వార్టర్స్, మెయిన్ స్పోర్ట్స్ ప్రొడక్ట్, యాన్యువల్ రెవెన్యూ తదితర వివరాలు ఇట్టే తెలిసిపోతాయి. ఈజీగా గుర్తుంటాయి. మరెందుకు ఆలస్యం చూసేయండి.