MohanBabu University: స్వప్నించు (డ్రీమ్), విశ్వసించు (బిలీవ్), సాధించు (అఛీవ్) అని బోధిస్తున్న మోహన్‌బాబు యూనివర్సిటీ (ఎంబీయూ).. అనుభవజ్ఞులు, అత్యుత్తమ ప్రతిభ కలిగినవారు, అకడమిక్ లీడర్స్ నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంబీయూ సక్సెస్ స్టోరీలో పాలుపంచుకోవాలని కోరుతోంది. విద్యా రంగంలో 30 ఏళ్ల సుదీర్ఘ అనుభవంతో, నమ్మకానికి మారుపేరుగా మారిన తమ సంస్థల్లోని వివిధ ఉద్యోగాల భర్తీకి నియామక ప్రకటన జారీ చేసింది. ముఖ్యంగా మూడు డొమైన్లలో ఖాళీగా ఉన్న పొజిషన్లను ఈ నోటిఫికేషన్‌లో పొందుపరిచింది. 1. లీడర్‌షిప్ పొజిషన్లు. 2. ఫ్యాకల్టీ పొజిషన్లు. 3. సపోర్టింగ్ స్టాఫ్ పొజిషన్లు.
మొదటి డొమైన్‌లో స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్, స్కూల్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ ఫార్మసీలకు డీన్‌లను, బ్రాండ్ అండ్ మార్కెటింగ్ విభాగానికి వీపీని నియమించనుంది. ఈ పోస్టులకు సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ మరియు టీచింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్‌లో 15 ఏళ్లకు పైగా అనుభవం ఉండాలి. వీపీ పోస్టుకి కనీసం సంబంధిత రంగంలో 10 ఏళ్ల అనుభవం ఉంటే సరిపోతుంది.
read also: Bharat Rashtra Samithi: బీఆర్ఎస్‌పై కేసీఆర్ ప్రకటన ఇదే..
రెండో డొమైన్‌లో ప్రొఫెసర్/అసిస్టెంట్ ప్రొఫెసర్ పొజిషన్లను భర్తీ చేయనుంది. స్కూల్ ఆఫ్ నర్సింగ్, స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్, స్కూల్ ఆఫ్ ఫార్మసీ, స్కూల్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్ స్కూల్ ఆఫ్ పాలిటెక్నిక్‌లకు ప్రొఫెసర్లు/అసిస్టెంట్ ప్రొఫెసర్లు కావాలి. సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, ఎంఎస్సీ, పీహెచ్‌డీ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మ్-డి, ఎంఏ, ఎంఫిల్, ఎంకామ్, బీఈ, బీటెక్(ట్రిపుల్ ఈ, ఈసీఈ, సీఎస్‌ఈ, మెకానికల్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్) తదితర విద్యార్హతలు ఉండాలి. క్వాలిఫికేషన్, రెమ్యునరేషన్ విషయంలో యూజీసీ/ఏఐసీటీఈ/పీసీఐ గైడ్‌లైన్స్‌ను ఫాలో అవుతారు.
మూడో డొమైన్‌లో వైస్ ప్రెసిడెంట్ (ఐటీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్), చీఫ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్, ఫైనాన్స్ ఆఫీసర్, ఎస్టేట్ మేనేజర్, అసెట్ మేనేజర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, గెస్ట్‌హౌజ్ మేనేజర్, ఐటీ ఇంజనీర్, సీనియర్ అకౌంట్స్ మేనేజర్/ఆఫీసర్, డిప్యూటీ రిజిస్ట్రార్, హాస్టల్ వార్డెన్, పర్ఛేజ్ అండ్ స్టోర్స్ మేనేజర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ వంటి పోస్టులను భర్తీ చేస్తారు. అర్హత, ఆసక్తి, అనుభవం కలిగిన అభ్యర్థులు తమ రెజ్యూమ్‌లను (ఏ పొజిషన్‌కి అప్లై చేస్తున్నారో క్లియర్‌గా రాసి) careers@mbu.asia అనే ఇ-మెయిల్ ఐడీకి పంపాలి.