AP Govt School: రెండు తెలుగు రాష్ట్రాల్లోని గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు ఇంగ్లిష్ మాట్లాడటం కాదు కదా కనీసం చూసి (పర్ఫెక్టుగా) చదవటం కూడా రాదనే చులకన భావం చాలా మందిలో ఉంది. అసలు తెలుగు అక్షరాలనే సరిగా గుర్తించలేకపోతున్నారని సర్వేలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా అన్నవరానికి సమీపంలో ఉన్న బెండపూడి ప్రభుత్వ బడి పిల్లలు ఆంగ్లాన్ని అనర్గళంగా మాట్లాడుతున్నారు. ఇండియన్ ఇంగ్లిష్ కాదు. ఏకంగా అమెరికా ఇంగ్లిష్‌నే ఈజీగా దంచికొడుతున్నారు.
Study in Germany: ఐఎంఎఫ్ఎస్.. విద్యార్థులకు ఎలాంటి సర్వీసులు అందిస్తోంది?. ఈ సంస్థ ద్వారా విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఎలాంటి అవకాశాలు ఉంటాయి? మరీ ముఖ్యంగా జర్మనీలో స్థిరపడాలనుకునేవారికి ఎలాంటి ఆపర్చునిటీస్ అందుబాటులో ఉన్నాయి?. ఇలాంటి సందేహాలను నివృత్తి చేసేందుకు ‘ఎన్-కెరీర్’.. ఓవర్సీస్ స్టడీస్‌లో పేరుగాంచిన వ్యక్తి, ఐఎంఎఫ్ఎస్ సీఈఓ కేపీ సింగ్, డైరెక్టర్ అజయ్ కుమార్ వేములపాటి, anhalt రిప్రజెంటేటివ్ లిండాను ఒకే వేదిక మీదికి తీసుకొచ్చింది.
Special Story On Patanjali: ప్రకృతి ఆశీర్వాదమే పతంజలి ఆయుర్వేదం అనే ఆకట్టుకునే నినాదంతో ప్రజాదరణ పొందిన సంస్థ పతంజలి. దీన్ని.. యోగా గురు బాబా రామ్‌దేవ్ 1995లో ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ప్రారంభించారు. ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ రంగంలో అతితక్కువ కాలంలో 10 వేల కోట్ల రూపాయల టర్నోవర్ సాధించి రికార్డు నెలకొల్పింది. ఒకానొక దశలో అత్యంత ప్రభావశీల కంపెనీల సరసన చేరింది. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్‌ల తర్వాత 4వ స్థానాన్ని ఆక్రమించింది.
Business Today: తెలంగాణకు 3, ఏపీకి 2 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న దేశవ్యాప్తంగా ప్రారంభించిన 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లలో రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 5 యూనిట్లు వచ్చాయి. ఇందులో తెలంగాణకు 3, ఆంధ్రప్రదేశ్‌కు 2 లభించాయి. తెలంగాణలో జనగామ, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఖమ్మంలోని సిటీ యూనియన్ బ్యాంక్ దీనికి ఎంపికయ్యాయి.
Stock Market Fundamental Analysis: స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు ముఖ్యంగా రెండు ఉన్నాయని, అవి.. 1. క్వాలిటేటివ్ 2. క్వాంటిటేటివ్ అని గత వారం చెప్పుకున్నాం. ఈ వారం టెక్నికల్ అనాలసిస్ గురించి తెలుసుకుందాం. టెక్నికల్ అనాలసిస్ అంటే చాలా కష్టంగా ఉంటుందేమోననే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. వాటిని ఇవాళ నివృత్తి చేసుకుందాం.
Myth N Fact: మన ఇంట్లో చిన్న పిల్లలు అప్పుడప్పుడూ లేదా వరుసగా కొన్ని రోజుల పాటు రోజులో కొద్దిసేపు గుక్క పట్టి ఏడుస్తుంటారు. తద్వారా వాళ్లు తమ బాధను బయటికి చెప్పుకోలేక తమలోతామే తీవ్రంగా ఇబ్బందిపడటం జరుగుతుంటుంది. అలా తల్లడిల్లిపోతున్న చిన్నారులను చూసి వాళ్ల తల్లిదండ్రులు కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. పసికందులు ఎందుకు అలా ఏడుస్తున్నారో అర్థంకాదు. ఆ సందర్భంలో ఏం చేయాలో కూడా తోచదు.
Special Story on Ambani's Solid Legacy: మన దేశంలో అంబానీ పేరు తెలియనివారు లేరంటే అతిశయోక్తి కాదు. అలాగే.. ప్రపంచవ్యాప్తంగా సైతం ఇది సుపరిచితమే. ఈ బ్రాండ్ నేమ్ రీసెంట్గా మరోసారి వరల్డ్‌వైడ్‌గా వార్తల్లో నిలిచింది. ఇండియాలోని అతిపెద్ద టెలికం సంస్థ రిలయెన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ ప్రపంచంలోని 100 మంది ఎమర్జింగ్ లీడర్లలో ఒకరిగా నిలిచిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఒన్ అండ్ ఓన్లీ ఇండియన్ ఈయనే కావటం విశేషం.
Business Today: డాక్టర్ రెడ్డీస్‌కి మరోసారి ప్రపంచ స్థాయి గుర్తింపు: హైదరాబాద్‌కి చెందిన ప్రముఖ ఫార్మాస్యుటికల్ సంస్థ డాక్టర్ రెడ్డీస్ మరోసారి ప్రపంచ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం పరిధిలోని గ్లోబల్ లైట్‌హౌజ్ నెట్‌వర్క్‌లో చోటు సంపాదించింది. భాగ్య నగరంలోని బాచుపల్లిలో ఈ సంస్థకు అతిపెద్ద మ్యానిఫ్యాక్షరింగ్ యూనిట్ ఉంది.
Guptajiinvests: ఓ వ్యక్తి పల్లెటూరులో పుట్టి పెరిగాడు. చిన్న స్కూల్లో చదువుకున్నాడు. జిల్లా కేంద్రానికి తప్ప సిటీకి రెగ్యులర్‌గా వెళ్లే స్థాయి కూడా కాదు అతనిది. ఏడాదికో రెండేళ్లకో ఒకసారి నగరానికి వెళ్లివస్తుండేవాడు. జీవితంలో పెద్ద విజయాలు సిటీల్లో ఉండేవారికే సాధ్యమని, వాళ్లకు మాత్రమే ఆ ఎకోసిస్టమ్, కల్చర్ ఉంటాయని నమ్మాడు. అంతేకాదు. తననుతాను యావరేజ్, బిలో యావరేజ్ స్టూడెంట్‌గా తక్కువ అంచనా వేసుకున్నాడు.
Stock Market Highlights: డాలర్‌తో పోల్చితే మన కరెన్సీ రూపాయి మారకం విలువ 82 దాటింది. ఇది స్టాక్ మార్కెట్లకు ఏమాత్రం సానుకూల పరిణామం కాదు. దీనికితోడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని రెండో త్రైమాసికం (సెప్టెంబర్‌తో) ముగియటంతో టీసీఎస్, టాటా ఎలక్సీ వంటి కంపెనీలు తమ పనితీరును, ఆర్థిక ఫలితాలను సోమవారం నుంచి వరుసగా వెల్లడించనున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ స్టాక్ మార్కెట్లలో వచ్చే వారం ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయనేది ఆసక్తికరంగా మారింది.