Union Nari Shakti Scheme: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. యూనియన్ నారీ శక్తి పథకంలో భాగంగా మహిళా పారిశ్రామికవేత్తలకు వెయ్యి కోట్లకు పైగా రుణాలను మంజూరుచేసింది. దేశం మొత్తమ్మీద 10 వేల మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 2 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు లోన్లు ఇచ్చింది. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు మరియు వాళ్ల అవసరాలను బట్టి లోన్ అమౌంట్‌ను నిర్ణయిస్తున్నామని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ మినోచి చెప్పారు.
తగ్గిన ఎగుమతులు.. పెరిగిన దిగుమతులు..
గత నెలలో ఇండియా ఎగుమతులు 3.52 శాతం తగ్గాయి. దీంతో ఎగుమతుల విలువ 32.62 బిలియన్ డాలర్లకే పరిమితమైంది. ఇదే సమయంలో దిగుమతులు 5.44 శాతం పెరిగాయి. మొత్తం దిగుమతుల విలువ 59.35 బిలియన్ డాలర్లుగా నమోదైంది. దిగుమతులు గతేడాది సెప్టెంబర్ నెలతో పోల్చితే దాదాపు 3 శాతం పెరిగాయి. గత ఏడు నెలల్లో దిగుమతులు 60 బిలియన్‌ల లోపుకే పరిమితం కావటం ఇదే తొలిసారి. ఈ డేటాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.
read also: Dubai: ముస్లిం దేశంలో హిందూ ఆలయం.. దసరా సందర్భంగా ప్రారంభం
పీఎన్‌బీ వాట్సాప్ సర్వీలు ప్రారంభం
పంజాబ్ నేషనల్ బ్యాంక్.. కస్టమర్లు మరియు నాన్-కస్టమర్ల కోసం వాట్సాప్ బ్యాంకింగ్ సర్వీస్‌ను ప్రారంభించింది. సెలవు రోజులు సహా రోజుకి 24 గంటలు ఈ సేవలు ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ బేస్డ్ మొబైల్ ఫోన్లలో అందుబాటులో ఉంటాయని పీఎన్‌బీ పేర్కొంది. బ్యాంక్ సేవలను మరింత మందికి చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ సర్వీస్‌ను లాంఛ్ చేసినట్లు తెలిపింది. వాట్సాప్ సర్వీస్‌ను వాడుకోవాలనుకునేవారు ముందుగా పీఎన్‌బీ వాట్సాప్ నంబర్ 92640 92640ను ఫోన్ బుక్‌లో సేవ్ చేసుకొని ఆ తర్వాత హాయ్ అని గానీ హలో అని గానీ టైప్ చేయటం ద్వారా కన్వర్జేషన్ స్టార్ట్ చేయాలని సూచించింది.
స్టాక్ మార్కెట్ అప్‌డేట్
దేశీయ స్టాక్ మార్కెట్లలో దసరా జోష్ కనిపిస్తోంది. ఇవాళ భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ‘బ్రిటన్ ట్యాక్స్’తో గ్లోబల్ మార్కెట్లలో సానుకూల సంకేతాలు నెలకొన్నాయి. సెన్సెక్స్ 1092 పాయింట్లు పెరిగి 57881 వద్ద ట్రేడింగ్ అవుతోంది. నిఫ్టీ 294 పాయింట్లు ప్లస్ అయి 17181కి పైనే కొనసాగుతోంది. ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేరు విలువ 4 శాతం పెరిగింది.