Gopuff Layoff: అమెరికన్ కన్జ్యూమర్ గూడ్స్ మరియు ఫుడ్ డెలివరీ కంపెనీ గోపఫ్ రీసెంటుగా 200 మందికి పైగా కస్టమర్ సర్వీస్ ఉద్యోగులను తొలగించింది. జులై రౌండ్ లేఆఫ్ లో భాగంగా వీళ్లను తీసేసినట్లు తెలిపింది. సంస్థ ఎదుర్కొంటున్న ఆర్థిక మందగమనంతోపాటు నిధుల సమీకరణ నెమ్మదించటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లాభాలపై ఫోకస్ పెట్టేందుకు సంస్థ పునర్వ్యవస్థీకరణలో భాగంగా వర్క్ ఫోర్సును 10 శాతం తగ్గించుకోనున్నట్లు గోపఫ్ జులై నెలలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.
Buy Now Pay Later: ఫిన్ టెక్ యూనికార్న్ పైన్ ల్యాబ్స్ అందిస్తున్న బుక్ నౌ పే లేటర్ (బీఎన్‌పీఎల్) సర్వీసుకి చిన్న పట్టణాల్లో భారీ డిమాండ్ నెలకొంటోంది. ఈ లావాదేవీల విలువ ఈ నెలలో 5 వేల కోట్ల రూపాయలకు చేరనుందని అంచనా వేస్తోంది. పండగ సీజన్ నేపథ్యంలో ప్రొడక్టులను ఈఎంఐ (ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్) పద్ధతిలో (ఆఫ్‌లైన్ మర్చెంట్ కమ్యూనిటీలో) కొనుగోలు చేసే కస్టమర్ల సంఖ్య పెరుగుతోందని పేర్కొంది.
Sony Pictures India: సోనీ పిక్చర్స్ ఇండియా తన నెట్‌వర్క్‌లోని ఛానల్స్ అన్నింటినీ రీబ్రాండ్ చేసింది. గ్లోబల్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకుంది. సోనీ బ్రాండ్ పవర్ మరియు వ్యాల్యూస్ ఇన్నాళ్లూ తమ వర్క్ ఎథిక్స్‌కి వెన్నెముకగా నిలిచాయని, అవి ఇప్పుడు తమ ఛానల్ బ్రాండ్ ఆర్కిటెక్చర్‌లోనూ ప్రతిబింబిస్తాయని సంస్థ ఎండీ, సీఈఓ ఎన్ పీ సింగ్ చెప్పారు. రీబ్రాండింగ్కి సంబంధించిన పనులను మూడేళ్ల కిందట ప్రారంభిస్తే ఇన్నాళ్లకు కొలిక్కి వచ్చాయి.
Biggest Buyout in Asia: ఈ ఏడాది ఆసియాలోనే అతిపెద్ద కొనుగోలు నమోదు కానుంది. జపాన్‌కి చెందిన తోషిబా సంస్థను అదే దేశంలోని జేఐపీ గ్రూప్ కన్సార్షియం.. టేకోవర్ చేసుకునే అంశాన్ని పరిశీలిస్తోంది. మల్టీ నేషనల్ కంపెనీ అయిన తోషిబా మార్కెట్ విలువను 16 బిలియన్ డాలర్లకు (2.4 ట్రిలియన్ యెన్లకు) పైగా నిర్దారించినట్లు తెలుస్తోంది. బైఔట్ వార్తల నేపథ్యంలో తోషిబా షేర్ విలువ నిన్న సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 5 వేల 391 యెన్స్ పలికింది.
Top Five Luxury Brands in the World: బ్రాండ్ అంటే ఒక పేరు మాత్రమే కాదు. ఒక పదం, డిజైన్, సింబల్ లేదా మరేదైనా ఫీచర్. వస్తువులను లేదా సర్వీసులను తెలియజేస్తుంది. వివిధ కంపెనీలు విక్రయించే వస్తువులు లేదా సర్వీసులు ఒక్కటైనప్పుడు వాటిని వేరు చేసి చూపేది, వేర్వేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లేది బ్రాండ్సే. వీటిని బిజినెస్, మార్కెటింగ్, అడ్వర్టైజింగ్లలో వాడతారు. మార్కెట్ విషయానికి వస్తే బ్రాండ్లు ముఖ్యంగా రెండు రకాలు. ఒకటి.. మాస్ బ్రాండ్స్. రెండు.. లగ్జరీ బ్రాండ్స్.
Indian Brands: 2047 నాటికి గ్లోబల్ ఎక్స్‌పోర్ట్స్‌లో 10 శాతం వాటాను సొంతం చేసుకోవాలని ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. అంతర్జాతీయ ఎగుమతుల్లో మన దేశం షేరు ప్రస్తుతం 2.1 శాతం మాత్రమే కావటం గమనించాల్సిన విషయం. ఈ పర్సంటేజీని 2027 నాటికి 3 శాతానికి 2047 నాటికి 10 శాతానికి పెంచాలని ఆశిస్తోంది. 100 ఇండియన్ బ్రాండ్లను గ్లోబల్ ఛాంపియన్లుగా ప్రమోట్ చేయటం ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
Hyderabad and other 6 cities: హైదరాబాద్‌తోపాటు దేశంలోని ఏడు మేజర్ సిటీల్లో ఆఫీసు స్థలాల లీజింగ్ గత నెలలో 37 శాతం పెరిగిందని జేఎల్ఎల్ ఇండియా అనే రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ తన నివేదికలో పేర్కొంది. సెప్టెంబర్ మొత్తమ్మీద 63 లక్షల స్క్వేర్ ఫీట్ల స్థలాన్ని లీజ్‌కి ఇచ్చారని తెలిపింది. గతేడాది సెప్టెంబర్‌లో ఇది 46 లక్షల చదరపు అడుగులు మాత్రమేనని వెల్లడించింది.
‘Note’ these points: దాదాపు ఆరేళ్ల కిందట పెద్ద నోట్లను రద్దు చేయటం వల్ల కలుగుతున్న ప్రయోజనాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ సభ్యురాలు ఆషిమా గోయెల్ అన్నారు. పన్నుల వసూళ్లు పెరగటానికి ఈ నిర్ణయం పరోక్షంగా దోహదపడిందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇండియన్ ఎకానమీ.. డిజిటల్ బాటలో శరవేగంగా పయనిస్తోందని చెప్పారు.
Steel Pricing: ఈ ఆర్థిక సంవత్సరంలో స్టీల్‌కి గిరాకీ 90 లక్షల టన్నులు పెరగనుందని, తద్వారా మొత్తం పదకొండున్నర కోట్ల టన్నులకు చేరనుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ఒక టన్ను ఉక్కు ధర 55 వేల నుంచి 57 వేల రూపాయల వరకు ఉంది. అంతర్జాతీయంగా స్టీల్ ఉత్పత్తి 6.2 కోట్ల టన్నులు తగ్గినప్పటికీ ఇండియాలో డిమాండ్ బాగుండటం ఈ సెక్టార్‌కి ప్లస్ పాయింట్‌గా మారిందని నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Samsung India: కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ శామ్సంగ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి గత ఐదేళ్లలో ఎప్పుడూ లేనంత అధిక ఆదాయం ఈ సంవత్సరం సమకూరింది. ఇతర ఆదాయం ఏకంగా 78 శాతం (రూ.2873.20 కోట్లకు) పెరగటంతో ఈ వృద్ధి నెలకొంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.75,886 కోట్లు కాగా ఈసారి రూ.82,451 కోట్ల రెవెన్యూ వచ్చింది. అంటే.. గతేడాది కన్నా ఇప్పుడు 8.65 శాతం గ్రోత్ సాధించింది. ఇదిలాఉండగా శామ్సంగ్ ఇండియాకి నెట్ ప్రాఫిట్ 4.86 శాతం తగ్గింది.