Indian Musical Instruments Exports: ఈ ఆర్థిక సంవత్సరంలోని తొలి ప్రథమార్ధంలో మన దేశం నుంచి సంగీత వాయిద్యాల ఎగుమతులు 3.5 రెట్లకు పైగా పెరిగాయి. ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో ఈ ఎక్స్‌పోర్ట్‌ల విలువ 172 కోట్ల రూపాయలుగా నమోదైంది. దాదాపు పదేళ్ల కిందట.. అంటే.. 2013-14 ఫైనాన్షియల్ ఇయర్‌లోని ఇదే సమయంలో ఈ ఎగుమతుల విలువ కేవలం 49 కోట్ల రూపాయలేనని కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ ట్విట్టర్లో తెలిపారు.
Gland Pharma Results: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహించే గ్లాండ్ ఫార్మా సంస్థ సెప్టెంబర్ త్రైమాసికం ఫలితాలను వెల్లడించింది. గతేడాది ఇదే సమయంలో 302 కోట్లకు పైగా లాభాన్ని ఆర్జించిన ఈ కంపెనీ ఈసారి 20 శాతం తక్కువగా అంటే 241 కోట్ల నికర లాభంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సంస్థ మొత్తం ఆదాయం సైతం 2 శాతం తగ్గి రూ.1,110 కోట్లకే పరిమితమైంది.
Heritage Foods: హెరిటేజ్ ఫుడ్స్‌ని నేషనల్ బ్రాండ్‌గా అభివృద్ధి చేయాలని కంపెనీ యాజమాన్యం భవిష్యత్ ప్రణాళికలను రచిస్తోంది. ఇందులో భాగంగా ప్రొడక్టుల మ్యానిఫ్యాక్షరింగ్ కెపాసిటీలను పెంచుకోవాలని నిర్ణయించింది. పాల సేకరణ కోసం పల్లె స్థాయిలో మౌలిక వసతులను ఏర్పాటుచేయాలని భావిస్తోంది. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో ప్రాసెసింగ్ యూనిట్లు, 11 రాష్ట్రాల్లో 121 డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, ఒకటీ పాయింట్ మూడు లక్షల రిటైల్ ఔట్లెట్లు, 859 పార్లర్లు ఉన్నాయి.
Special Story on Indian Digital Currency: మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల దేశవ్యాప్తంగా 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ప్రారంభించారు. అంతకుముందు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ‘‘సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ’’పై కాన్సెప్ట్ నోట్‌ను విడుదల చేసింది. దీంతో ఇప్పుడు ఈ కొత్త డిజిటల్ కరెన్సీ ఆసక్తికరమైన చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.
Indian Space Congress-2022: స్పేస్ టెక్ స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ఇండియన్ స్పేస్ కాంగ్రెస్-2022 ప్రత్యేక చొరవ చూపుతోంది. వాటిని 1.5 ట్రిలియన్ డాలర్ల స్పేస్ ఎకానమీలో భాగస్వాములను చేసేందుకు పలు కార్యక్రమాలను ప్రకటించింది. షార్ట్ లిస్ట్ చేసిన 15 స్టార్టప్‌లకు ఫౌండర్స్ హబ్ ప్రయోజనాలను అందించనుంది. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా ఆ స్టార్టప్‌లు లక్షన్నర డాలర్ల వరకు విలువ చేసే ఉచిత అజూర్ క్రెడిట్ల కోసం అప్లై చేసుకోవచ్చు.
YouTube Ad Revenue: ఆర్థిక మందగమనంతోపాటు టిక్‌టాక్ నుంచి ఎదురవుతున్న పోటీ ప్రభావం యూట్యూబ్ యాడ్ రెవెన్యూపై పడుతోంది. దీనివల్ల గతేడాదితో పోల్చితే ఈసారి ఆదాయం తగ్గింది. యూట్యూబ్‌తోపాటు మెటా మరియు స్నాప్ సంస్థల రెవెన్యూని టిక్‌టాక్ క్రమంగా తన వైపుకు మళ్లించుకుంటోందంటూ ఇటీవల వచ్చిన వార్తలు దీంతో నిజమైనట్లు మార్కెట్ వర్గాలు గుర్తుచేస్తున్నాయి.
Coca Cola Sprite: మన దేశ మార్కెట్లో కోకాకోలా స్ప్రైట్ కూల్‌డ్రింక్.. స్పెషల్ ఫీట్‌ను సాధించింది. ఒక బిలియన్ (వంద కోట్ల) డాలర్ల బ్రాండ్‌గా ఎదిగింది. జులై, ఆగస్ట్, సెప్టెంబర్లలో భారత మార్కెట్లో స్ప్రైట్ సేల్స్ భారీగా పెరిగాయని కోకాకోలా వెల్లడించింది. సాఫ్ట్ డ్రింక్‌లు మరియు ఫ్రూట్ డ్రింక్ మాజా విక్రయాలు సైతం దీనికి కారణమయ్యాయని పేర్కొంది. కోకాకోలాకే చెందిన సాఫ్ట్ డ్రింక్ థమ్సప్ పోయినేడాదే బిలియన్ డాలర్ బ్రాండ్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే.
MosChip: హైదరాబాద్‌లోని టెక్నాలజీ కంపెనీ ‘మాస్ చిప్’.. 52 కోట్ల రూపాయలకు పైగా ఆదాయాన్ని నమోదుచేసింది. గత నెలతో ముగిసిన త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. నిరుడు ఇదే టైమ్‌లో ఈ సంస్థ 39 కోట్లకు పైగా మాత్రమే రెవెన్యూని ఆర్జించింది. దీంతో పోల్చితే ఈసారి 33 శాతం అధిక ఆదాయాన్ని సొంతం చేసుకుంది. అయితే.. రెవెన్యూ పెరిగినప్పటికీ నికర లాభం మాత్రం తగ్గిందని మాస్ చిప్ పేర్కొంది. నెట్ ప్రాఫిట్.. కోటీ 60 లక్షల రూపాయల నుంచి కోటీ 24 లక్షలకు పడిపోయింది.
Sai Silks (Kalamandir): హైదరాబాద్‌లోని శారీ రిటైలర్ సంస్థ సాయి సిల్క్స్ కళామందిర్ త్వరలో పబ్లిక్ ఇష్యూకి రానుంది. తద్వారా 12 వందల కోట్ల రూపాయల నిధుల సమీకరణ దిశగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా పర్మిషన్ కోసం వెయిట్ చేస్తోంది. ఇక మీదట ఫ్రాంచైజీ విధానంలో బిజినెస్‌ను విస్తరించాలనుకుంటోంది. ఈ కంపెనీకి ఇప్పుడు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లో సొంతగా 50 రిటైల్ స్టోర్లు ఉండగా రానున్న రెండేళ్లలో మరో 25 స్టోర్లను ప్రారంభించాలని ఆశిస్తోంది.
Special Story on Shiv Nadar: దానం.. మనిషికి ఉండాల్సిన ఓ మంచి లక్షణం. కుడి చేతితో చేసే దానం ఎడమ చేతికి తెలియకూడదంటారు. కానీ ఆయన రెండు చేతులా చేస్తుంటారు. రోజుకి 3 కోట్ల రూపాయలు సమాజానికిస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నారు. సంపదను పంచిపెట్టడంలో తనకుతానే సాటని నిరూపించుకుంటున్నారు. ఈ విషయంలో ఇప్పటికే పలుమార్లు నంబర్-1గా నిలిచారు. మరోసారి అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నారు.