Indian Market: ఇండియన్ మార్కెట్ తమకెంతో ముఖ్యమని టర్కిష్ ఎయిర్‌లైన్స్ సీఈఓ బిలాల్ ఎక్సి అన్నారు. టర్కిష్ ఎయిర్‌లైన్స్ ప్రపంచంలోనే లార్జెస్ట్ నెట్వర్క్ క్యారియర్ అయినప్పటికీ మన దేశంలో ఆ సంస్థ అభివృద్ధికి ప్రతిబంధకాలు ఉన్నాయి. టర్కిష్ ఎయిర్‌లైన్స్‌కి ఇండియాలో ట్రాఫిక్ రైట్స్‌ని పరిమితంగా ఇవ్వటమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో నంబర్ వన్ ఎయిర్‌లైన్స్ ఇండిగోతో భాగస్వామ్యాన్ని బలపరచుకోవటం ద్వారా ఇండియన్ మార్కెట్లో షేర్ (బిజినెస్) పెంచుకోవాలని టర్కిష్ ఎయిర్‌లైన్స్ ఆశిస్తోంది.
Made in Hyderabad Guns: హైదరాబాద్‌లో తుపాకులు తదితర చిన్న రక్షణ ఆయుధాల తయారీ ప్రారంభంకానుంది. ఈ మేరకు మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ కంపెనీ ఐకామ్.. UAEకి చెందిన ఎడ్జ్ గ్రూప్ కంపెనీ కారకాల్‌తో ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా మన దేశ రక్షణ దళాల కోసం లోకల్‌గా చిన్న ఆయుధాలను తయారుచేయటమే కాకుండా ఎగుమతులు కూడా చేస్తుంది.
PM Kisan Scheme Scam: కేంద్ర ప్రభుత్వానికి గత మూడేళ్లుగా 4 వేల కోట్ల రూపాయల భారీ నష్టం వాటిల్లింది. ఖజానా నుంచి ఇంత మొత్తాన్ని ఎవరు కొట్టేశారనుకుంటున్నారు?. బ్యాంక్ ఆఫీసర్లు కాదు. పేరు మోసిన వ్యాపారవేత్తలు అసలే కాదు. మరి ఈ రేంజ్లో డబ్బును ఎవరు కాజేశారు?. సంజీవని పర్వతం మాదిరిగా సర్కారు సంపదను హనుమంతుడు ఎత్తి పట్టుకుపోయాడా? (లేక) ఆలీబాబా అర డజను దొంగలు నొక్కేశారా?. లేదు. ఈ బిగ్ అమౌంట్‌ను మన దేశానికే చెందిన మధ్యవర్తులు.. అవినీతిపరులు.. అది కూడా…
To Get Profits in Stock Markets: స్టాక్ మార్కెట్లలో లాభాలను ఆర్జించాలంటే ఏవి ముఖ్యం?. స్కిల్సా?, నాలెడ్జా?, లేక ఈ రెండూ కాకుండా మరేదైనా ఉందా? అంటే ‘ఉంది’ అని నిపుణులు చెబుతున్నారు. అదే.. ట్రేడింగ్ సైకాలజీ. అసలు ఈ టాపిక్ ఏంటి అంటే.. స్టాక్ మార్కెట్లో ఎలా ట్రేడింగ్ చేయాలి?, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టేవారికి ఎలాంటి మనస్తత్వం ఉండాలి? వంటి ప్రశ్నలకు ఈ కాన్సెప్టులో సమాధానాలను తెలుసుకోవచ్చు. స్టాక్ మార్కెట్ బిజినెస్ విషయానికి వస్తే రెండింటి గురించి ప్రధానంగా చెప్పుకోవాలి.
Business Today: సాగర్ సిమెంట్స్ ఆదాయం పెరిగింది. కానీ..: సాగర్ సిమెంట్స్ ఆదాయం గతేడాది 2వ త్రైమాసికంతో పోల్చితే ఈసారి 32 శాతం పెరిగింది. పోయినేడాది 371 కోట్ల రూపాయలు మాత్రమే రెవెన్యూ రాగా ఇప్పుడది 489 కోట్ల రూపాయలకు పెరిగింది. నిరుడు 20 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించిన సాగర్ సిమెంట్స్ ప్రస్తుతం అంతకు రెట్టింపు కన్నా ఎక్కువ.. అంటే 49 కోట్ల రూపాయల నికర నష్టాన్ని నమోదుచేసింది.
Special Story on RATAN TATA: నమ్మకంతో కూడిన నాయకత్వం.. టాటా గ్రూపు నినాదం. ఈ నమ్మకానికి నైతిక విలువలను జోడించారు రతన్ టాటా. 1868లో అంటే 154 ఏళ్ల కిందట ఒక ‘స్టార్టప్’గా ప్రస్థానం ప్రారంభించిన టాటా గ్రూపు ఇప్పుడు గ్లోబల్ కంపెనీల్లో ఒకటిగా ఊహించని స్థాయికి ఎదిగింది. దీని వెనక సంస్థ వ్యవస్థాకుడు జెమ్ షెట్ జీ టాటా కృషి ఎంత ఉందో ఆయన మునిమనవడు రతన్ టాటా పట్టుదలా అంతే ఉంది.
Business Today: ఏపీలో బంగారం తవ్వకాల దిశగా..: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో బంగారం తవ్వకాల దిశగా ఎప్పుడో విజయవంతంగా తొలి అడుగు వేసిన ఎన్ఎండీసీ.. ఇప్పుడు రెండో అడుగు కూడా ముందుకేసింది. మైనింగ్ లైసెన్స్ పొందేందుకు కన్సల్టెంట్ నియామకానికి తాజాగా తెర తీసింది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. లైసెన్స్ లభిస్తే నాలుగేళ్ల నిరీక్షణ ఫలించినట్లవుతుంది.
Telugu Lady Inspirational Story: మనిషికో చరిత్ర. కానీ.. అందరివీ అంత ఆసక్తికరంగా ఉండవు. ఆదర్శంగా అసలే అనిపించవు. అయితే.. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్లకు చెందిన లక్ష్మి అనే మహిళది మాత్రం సూపర్ హిట్ సినిమాకు మించిన ఇంటస్ట్రింగ్ స్టోరీ. ఇన్స్పిరేషనల్ స్టోరీ. చదువు మానేసిన 30 ఏళ్ల తర్వాత 49 ఏళ్ల వయసులో ఎంబీబీఎస్‌లో చేరి 53 ఏళ్ల వయసులో విజయవంతంగా కోర్సు పూర్తి చేశారు.
World Bank: ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రమాదకర పరిస్థితుల్లో, ఆర్థిక మాంద్యానికి చేరువులో ఉందని సాక్షాత్తూ వరల్డ్ బ్యాంకే ఆందోళన వ్యక్తం చేసింది. ద్రవ్యోల్బణం, రుణాల భారం, వడ్డీ రేట్లు పెరుగుతుండటం అభివృద్ధి చెందుతున్న దేశాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ డేవిడ్ మల్పాస్ పేర్కొన్నారు.
Business Today: హైదరాబాద్ సిగలో మరో అంతర్జాతీయ కేంద్రం: విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌కి మరో ఇంటర్నేషనల్ కంపెనీ వచ్చింది. స్విట్జర్లాండ్‌కు చెందిన ఎంఎన్సీ రోషె ఫార్మా తన డేటా సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటుచేసింది. ఈ కేంద్రాన్ని గ్లోబల్ అనలిటిక్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా పిలుస్తారు. షార్ట్ కట్లో ‘గేట్’ అని కూడా వ్యవహరిస్తారు.