Akkirala Kondala Rao
Author- NTV Telugu-
Diwali Gold Sales: పండుగ చేసుకుంటున్న బంగారం వ్యాపారులు
Diwali Gold Sales: ఈ ఏడాది దీపావళి పండుగ.. బంగారం వ్యాపారానికి బాగా కలిసొచ్చింది. మన దేశంలో మొన్న, నిన్న రెండు రోజులు పాతిక వేల కోట్ల రూపాయల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. గతేడాది ధన త్రయోదశితో పోల్చితే ఈసారి బంగారం, వెండి ఆభరణాల విక్రయాలు 35 శాతం అధికంగా నమోదైనట్లు అంచనా వేస్తున్నారు. పోయిన సంవత్సరం ఇదే సమయంలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 47 వేల 644 రూపాయలు ఉండగా ఈ సంవత్సరం 52 వేల రూపాయలు పలుకుతోంది. -
Laurus Labs Paediatric HIV Treatment: పిల్లల్లో హెచ్ఐవీ చికిత్సకు లారస్ ల్యాబ్స్ Novel Delivery
Laurus Labs Paediatric HIV treatment: హైదరాబాద్‌కి చెందిన లారస్ ల్యాబ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం ఫలితాలను వెల్లడించింది. జులై, ఆగస్టు, సెప్టెంబర్.. ఈ మూడు నెలల్లో కలిపి 234 కోట్ల రూపాయల లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో ఈ సంస్థ లాభం 204 కోట్లు మాత్రమే కావటం గమనించాల్సిన విషయం. దీన్నిబట్టి ఈసారి నికరంగా 15 శాతం ఎక్కువ ప్రాఫిట్‌ను ఆర్జించింది. -
Hyderabad Weapon Systems: రాఫెల్ యుద్ధ విమానాలకు ‘‘హైదరాబాద్’’ అస్త్రాలు
Hyderabad Weapon Systems: రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించి జాతీయ రాజకీయాల్లో ఎంత రచ్చ జరిగిందో దేశం మొత్తం చూసింది. ఈ అంశంపై అధికార పార్టీ బీజేపీ, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పలుమార్లు నువ్వా నేనా అన్నంత స్థాయిలో తలపడ్డాయి. పార్లమెంట్ లోపల, బయట పొలిటికల్ హీట్ పెరిగింది. మొత్తమ్మీద ఈ వివాదం ఎలాగోలా సద్దుమణిగింది. అయితే.. ఇప్పుడు ఆ రాఫెల్ యుద్ధ విమానాల్లో మేడిన్ హైదరాబాద్ అస్త్రాలను అమర్చనున్నారు. -
Jio 5G: శ్రీనాథ్జీ ఆలయం.. జియో 5జీ ఆరంభం.. ఏమిటీ అనుబంధం?
Jio 5G: రిలయెన్స్ జియో చైర్మన్ ఆకాష్ అంబానీ ఇవాళ రాజస్థాన్‌లో జియో 5జీ బీటా సర్వీసులను ప్రారంభించారు. రాజ్‌సమంద్‌లోని నాథద్వారాలో ఉన్న ప్రసిద్ధ శ్రీనాథ్జీ ఆలయం వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంబానీలకు ఈ దేవుడి పైన అపార నమ్మకం ఉంది. శ్రీనాథ్జీని తమ కుటుంబ దైవంగా కొలుస్తారు. గతంలో రిలయెన్స్ జియో 4జీ సర్వీసులను సైతం ఇక్కడే ప్రారంభించటం విశేషం. -
Rupee Trade: రూపాయల్లో ట్రేడింగ్‌కి రెస్పాన్స్ బ్రహ్మాండం
Rupee Trade: రూపాయల్లో ట్రేడింగ్ జరిపేందుకు ప్రపంచ దేశాల నుంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చినట్లు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రబి శంకర్ వెల్లడించారు. వాణిజ్య చెల్లింపుల నిమిత్తం దేశీయ కరెన్సీలను ఉపయోగించే పథకం కోసం ఆసియన్ క్లియరింగ్ యూనియన్ అన్వేషిస్తోందని తెలిపారు. ద్వైపాక్షికంగా లేదా వివిధ ట్రేడింగ్ బ్లాకుల మధ్య ఇలాంటి ఒక ప్రత్యేకమైన ఏర్పాటు ఉంటే ప్రతి దేశానికి చెందిన దిగుమతిదారులు డొమెస్టిక్ కరెన్సీలో పేమెంట్లు చేసేందుకు వీలుపడుతుందని చెప్పారు. -
IT Employees: మరిన్ని రోజులు ఉండం.. మళ్లీ ఇటువైపు రాం.
IT Employees: వచ్చే మూడేళ్లలో ఏకంగా 22 లక్షల మంది ఐటీ ప్రొఫెషనల్స్ జాబులు వదులుకోనున్నారని ఓ రిపోర్ట్ వెల్లడించింది. దీన్నిబట్టి మన దేశంలోని ఐటీ-బీపీఎం రంగంలో ఉద్యోగ క్షీణత ఏ రేంజులో ఉండనుందో అర్థంచేసుకోవచ్చు. దీంతోపాటు.. 57 శాతం మంది ఐటీ నిపుణులు మళ్లీ ఈ సర్వీసుల సెక్టారులోకి రావాలనుకోవట్లేదని కూడా ఆ నివేదిక పేర్కొంది. ‘ట్యాలెంట్ ఎక్సోడస్ రిపోర్ట్’ పేరుతో ఈ నివేదికను ‘‘టీమ్ లీజ్ డిజిటల్’’ అనే సంస్థ రూపొందించింది. -
World’s First Licensing Deal: ప్రజల కోసం ‘నోవార్టిస్’ పెద్ద మనసు. ప్రపంచంలోనే తొలి లైసెన్సింగ్ డీల్
World's First Licensing Deal: అధిక ధర కలిగిన క్యాన్సర్ మందు తయారీ కోసం నోవార్టిస్ సంస్థ ప్రపంచంలోనే మొట్టమొదటి లైసెన్సింగ్ డీల్‌పై సంతకం చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా దీర్ఘకాలిక మైలోయిడ్ లుకేమియా ట్రీట్మెంట్లో వాడే ఓరల్ డ్రగ్ నిలోటినిబ్ను రూపొందించనున్నారు. ఈ ఔషధాన్ని ఈజిప్ట్, గ్వాటెమాల, ఇండోనేషియా, మొరాకో, పాకిస్థాన్, ది ఫిలిప్పీన్స్, ట్యునీషియా వంటి ఏడు మధ్య ఆదాయ దేశాల్లో జనరిక్ డ్రగ్మేకర్స్ తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకురానున్నారు. -
Shiv Nadar: శివ్ నాడార్.. మేటి దాత.. అరుదైన ఘనత..
Shiv Nadar: ప్రముఖ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్ ఫౌండర్ శివ్ నాడార్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. సగటున రోజుకి 3 కోట్ల రూపాయలకు పైగా దానమిచ్చి మన దేశంలో అత్యధిక సంపదను పంచిపెట్టినవారి లిస్టులో టాప్‌లో నిలిచారు. ఏడాది కాలంలో ఏకంగా రూ.1,161 కోట్లు డొనేట్ చేశారు. తద్వారా తాజాగా విడుదలైన ‘‘ఎడెల్‌గివ్ హురున్ ఇండియా ఫిలాంథ్రపీ లిస్ట్-2022’’లో అగ్రస్థానాన్ని ఆక్రమించారు. -
GST Returns: సెప్టెంబర్ జీఎస్టీ రిటర్న్స్ దాఖలుచేయలేదా?. అయితే ఈ వార్త మీకోసమే
GST Returns: గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ నెట్వర్క్ (జీఎస్టీఎన్) పోర్టల్ స్లోగా పనిచేయటంతో ట్యాక్స్ పేయర్లు సకాలంలో పన్నులను చెల్లించలేక ఇబ్బందిపడ్డారు. దీంతో సెప్టెంబర్ నెలకు సంబంధించిన జీఎస్టీ రిటర్న్స్ దాఖలు గడువును పొడిగించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) అధికారులు తెలిపారు. -
DefExpo-2022: ఇలాంటి డిఫెన్స్ ఎక్స్పో.. గతంలో ఎప్పుడూ జరగలేదు పో..
DefExpo-2022: గుజరాత్‌లోని గాంధీనగర్‌లో నిర్వహిస్తున్న డిఫెన్స్ ఎక్స్పో 12వ ఎడిషన్‌లో ఇప్పటికే లక్షన్నర కోట్లకు పైగా విలువైన 451 అవగాహన ఒప్పందాలు(ఎంఓయూలు), ఒడంబడికలు కుదిరాయని అధికారులు తెలిపారు. దీంతో బిజినెస్ జనరేషన్‌కి సంబంధించిన పాత రికార్డులన్నీ బద్ధలైనట్లు చెప్పారు. గతంలో ఎప్పుడూ ఈ రేంజ్లో డిఫెన్స్ ఎక్స్పో జరగలేదని, ఈసారి అత్యధిక సంఖ్యలో ఎగ్జిబిటర్లు, వేల సంఖ్యలో బిజినెస్ విజిటర్స్ హాజరవుతున్నారని డిఫెన్స్ సెక్రెటరీ అజయ్ కుమార్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?