Chillapalli-The Vintage Weavers: మగువలకు చీరలంటే మక్కువ. అది తెలుగువారికి మరింత ఎక్కువ. ఎందుకంటే శారీస్ లేడీస్ చక్కదనాన్ని పెంచుతాయి. వాళ్లకు నిండుదనాన్ని నింపుతాయి. అమ్మతనాన్ని అద్దుతాయి. మహిళల జీవితంలోని మధురమైన ఘట్టాలన్నీ చీరలతో ‘‘ముడి’’పడి ఉన్నాయి. మనువు ముహూర్తం మొదలుకొని.. ముత్తైదువుతనం వరకు, నిశ్చితార్థం నుంచి శ్రీమంతం వరకు ప్రతి సందర్భంలోనూ వాళ్ల సంతోషానికి చీరలు అద్దంపడతాయి. ఇలా చెప్పుకుంటూపోతే చీరలోని గొప్పతనం
Be Ready with B Better: కాసులు లేకపోయినా పర్లేదు గానీ కాలూ చెయ్యీ బాగుంటే చాలు.. అదే పది వేలు.. అంటుంటారు పెద్దలు. ఇది అక్షర సత్యం. లక్షల విలువ చేసే మాట. కానీ.. ఫిట్నెస్ విషయంలో అప్పటివాళ్లకు, ఇప్పటివాళ్లకు చాలా తేడా ఉంది. ఆ రోజుల్లో ఆహారపు అలవాట్లు వేరు. వాళ్ల జీవన శైలి సైతం ఎంతో విభిన్నంగా ఉండేది. ప్రజెంట్ జనరేషన్ లైఫ్ స్టైల్‌కి అస్సలు పోలికే లేదు. అందుకే ఆ తరంవాళ్లు ఇప్పటికీ ఫిట్నెస్తో ఉంటారు.
Energy Demand in India: ఈ దశాబ్దంలో ప్రపంచంలోని అన్ని దేశాల కన్నా ఇండియాలోనే ఎనర్జీకి భారీగా డిమాండ్ పెరగనుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) అంచనా వేసింది. లేటెస్టుగా విడుదల చేసిన వరల్డ్ ఎనర్జీ ఔట్‌లుక్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. పట్టణీకరణ మరియు పారిశ్రామికీకరణ నేపథ్యంలో భారతదేశంలో ఎనర్జీకి గిరాకీ ఏటా 3 శాతం పెరుగుతుండటమే ఇందుకు కారణమని తెలిపింది. 2025 నాటికి ఇండియా అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఎదగనుండటం మరో కారణమని పేర్కొంది.
ONDC Network: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తెచ్చిన ‘‘ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్’’లోకి షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ప్రొవైడర్ Shiprocket చేరింది. తద్వారా ఈ పరిధిలోకి వచ్చిన తొలి ఇంటర్-సిటీ లాజిస్టిక్స్ ప్రొవైడర్ గా నిలిచింది. ఈ మేరకు ఈ నెల 22న తొలి లావాదేవీని విజయవంతంగా పూర్తి చేసింది. దీంతో ఇకపై అన్ని సెగ్మెంట్లకు సంబంధించిన విక్రయదారులు తమ ఉత్పత్తులను దేశవ్యాప్తంగా ఉన్న సిటీలకు, టౌన్లకు చేరవేసే వీలు కలిగింది.
Hyderabad to Thailand: హైదరాబాద్, థాయ్‌లాండ్ మధ్య ప్రయాణికులతోపాటు సరుకులకు సంబంధించిన విమాన సర్వీసులు కూడా రెండేళ్ల విరామం అనంతరం ఎల్లుండి నుంచి పున:ప్రారంభం కానున్నాయి. కొవిడ్ వల్ల నిలిచిపోయిన ఈ సేవలు మళ్లీ మొదలవుతుండటం ఔషధాల వంటి ముఖ్యమైన ప్రొడక్టుల రవాణాకు, పర్యాటకుల రాకపోకలకు ఉపయుక్తంగా ఉంటుందని థాయ్ కాన్సులేట్ జనరల్ నిటిరూగ్ ఫోన్ ప్రాసెర్ట్ హర్షం వ్యక్తం చేశారు.
Special Story on India’s Natural Gas Needs: రోజురోజుకీ పెరుగుతున్న సహజ వాయువు ధరలను మోయలేక యూరప్ దేశాల వెన్ను విరుగుతోంది. అలాగే.. ఈమధ్య కాలంలో రష్యా నుంచి దిగుమతులు తగ్గటంతో ఇండియా కూడా లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్‌ను అధిక రేట్లకు కొనాల్సి వచ్చింది. ఈ సమస్యకు మన దగ్గర రెండు పరిష్కార మార్గాలు ఉన్నాయి. ఒకటి.. తక్కువ రేటుకి గ్యాస్ దొరికేలా చూసుకోవటం; రెండు.. దేశీయంగా ఉత్పత్తిని పెంచటం. కానీ.. ఈ రెండూ అనుకున్నంత ఈజీ కాదని చెప్పొచ్చు.
Vijayawada to Sharjah: విజయవాడ నుంచి షార్జాకి నేరుగా రాకపోకలు సాగించే ఎయిరిండియా విమాన సర్వీసులు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ సోమవారం సాయంత్రం 6 గంటల 35 నిమిషాలకు విజయవాడలో బయలుదేరుతుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య ఇదే తొలి విమాన సర్వీసు కావటం విశేషం. స్టార్టింగ్ ఆఫర్ కింద టికెట్ ప్రారంభ ధర 13,669 రూపాయలని అధికార వర్గాలు పేర్కొన్నాయి. షార్జా నుంచి విజయవాడకి సర్వీస్ ఛార్జ్ 8,946 రూపాయలుగా నిర్ణయించారు.
India.. world's start-up capital: భారతదేశం ప్రపంచ స్టార్టప్‌ల రాజధానిగా ఎదుగుతోందని మైక్రోసాఫ్ట్ ఇండియా స్టార్టప్ ఎకోసిస్టమ్ డైరెక్టర్ సంగీత బవి అన్నారు. ఇండియాలో ఒక వ్యాపారవేత్తగా ఉండటానికి ఇది సరైన సమయమని చెప్పారు. భారతదేశం సాంస్కృతికపరంగా కూడా చాలా మార్పులకు లోనవుతోందని, ఎంట్రప్రెన్యూర్షిప్ వైపు శరవేగంగా దూసుకుపోతోందని తెలిపారు. సొంత స్టార్టప్‌లను బిల్డ్ చేయాలనుకునేవారికి మైక్రోసాఫ్ట్ ఏవిధంగా సాయపడుతోందో ఆమె వివరించారు.
5G Towers: టెలీకమ్యూనికేషన్ కంపెనీలు ప్రస్తుతం వారానికి 2 వేల 5 వందల 5జీ టవర్లను మాత్రమే ఏర్పాటుచేస్తుండగా ఆ సంఖ్యను వారానికి కనీసం 10 వేలకు పెంచాల్సిన అవసరం ఉందని కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. ఇప్పటివరకు మొత్తం 8 వేల టవర్లను మాత్రమే ఇన్స్టాల్ చేశారని, 5జీ మౌలిక సదుపాయాల ఏర్పాటులో టెల్కోలకు ప్రభుత్వం నుంచి పాలసీకి సంబంధించిన ఎలాంటి సపోర్ట్ కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
Indian Currency Look: ప్రస్తుతం మన కరెన్సీ నోట్ల పైన ఒక వైపు జాతిపిత మహాత్మాగాంధీ బొమ్మ, మరోవైపు చారిత్రక కట్టడాల బొమ్మలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ నోట్ల లుక్ భవిష్యత్‌లో మారనుందా అనే చర్చ ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొదలైంది. డబ్బు, సంపద, శాంతి, శ్రేయస్సు, అదృష్టాలకు ప్రతిరూపంగా పూజించే లక్ష్మీదేవితోపాటు కళలకు, శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా భావించే గణేషుడి బొమ్మలు వస్తాయా అని ప్రజలు అనుకుంటున్నారు.