Byjus: ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ఫుడ్బాలర్లలో లియోనెల్ మెస్సీ ఒకరు. ఆ స్టార్ ప్లేయర్‌ని ఎడ్టెక్ స్టార్టప్ బైజూస్.. ‘ఎడ్యుకేషన్ ఫర్ ఆల్’ అనే సామాజిక కార్యక్రమానికి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ సంస్థ లేటెస్ట్గా తీసుకున్న ఈ నిర్ణయాన్ని.. ‘2ఎక్స్’ ఫౌండర్ మరియు పబ్లిక్ స్పీకర్ రిషభ్ ధేడియా తీవ్రంగా తప్పుపట్టారు. ఈ మేరకు లింక్డిన్లో హాట్ హాట్‌గా పోస్టింగ్ పెట్టారు.
END of Ola and Uber?: హమ్మయ్య.. నగరాల్లో నరకం చూపే ఆటోవాళ్ల ఆగడాలను అరికట్టడానికి ఓలా, ఉబర్ వచ్చాయని జనం సంబరపడ్డారు. ప్రయాణం ఇంత సునాయాసమా అని సంతోషం వ్యక్తం చేశారు. ఇంటికే వచ్చి పికప్ చేసుకోవటం, సరిగ్గా ఎక్కడికి వెళ్లాలో అక్కడే డ్రాప్ చేయటం, ఛార్జీ బేరమాడే అవసరం లేకపోవటం, ఏసీ, ఎంటర్టైన్మెంట్ మరియు ఇతరత్రా సదుపాయాలు సైతం ఉండటంతో ప్యాసింజర్లు ఫుల్లు హ్యాపీగా ఫీలయ్యారు. కానీ.. ఆ ఆనందం మూణ్నాళ్ల ముచ్చటేనని ఆ తర్వాత తెలిసొచ్చింది.
Commercial Vehicles: కమర్షియల్ వెహికిల్స్‌ని ఒక్కో దేశంలో ఒక్కో రకంగా డిఫైన్ చేస్తుంటారు. సహజంగా.. సరుకు రవాణాకు లేదా ప్రయాణికుల రాకపోకలకు ఉపయోగించే వాహనాలను కమర్షియల్ వెహికిల్స్ అంటారు. ట్రక్కులు, వ్యాన్లు, బస్సులు, ట్యాక్సీలు, ఆటో రిక్షాలు, మోటర్ సైకిల్ ట్యాక్సీలు వంటివాటిని వీటికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మన దేశంలో ఈ వాణిజ్య వాహనాల కొనుగోళ్లు రానున్న కొన్నేళ్లలో భారీగా పెరుగుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
The Indian Box Office Report-September 2022: మన దేశంలో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్.. ఇలా పలు ఫిల్మ్ ఇండస్ట్రీలు ఉన్నాయి. వాటి నుంచి ప్రతి వారం, ప్రతి నెలా ఎన్నో సినిమాలు విడుదలవుతున్నాయి. వాటిలో కొన్ని మూవీలు అలా వచ్చి ఇలా పోతున్నాయి. చాలా కొద్ది పిక్చర్లు మాత్రమే హిట్ అవుతున్నా భారీగా కలెక్షన్లు కురిపిస్తున్నాయి. అందుకే.. ఇండియన్ బాక్సాఫీస్ రిపోర్టుకు బిజినెస్‌పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది.
How to Pick a Good Stock: స్టాక్ మార్కెట్లలో వేల సంఖ్యలో స్టా్క్స్ ఉన్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ)లో 2 వేలకు పైగా, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్(బీఎస్ఈ)లో 5 వేలకు పైగా స్టాక్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడులు పెట్టేందుకు ఏ స్టాక్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి? దానికి ఏదైనా మోడల్ ఉందా? అనేది ఆసక్తికరమైన అంశం. భిన్న వ్యక్తులు భిన్న మోడల్స్‌ని ఫాలో అవుతుంటారు. కానీ.. అందరికీ వర్తించే ఒక మంచి, పర్ఫెక్ట్ మోడల్ ఉంది. దాని గురించే ఇవాళ చర్చించుకుందాం.
Pan Fried Chicken: ఈరోజు మనం మంచి ప్రొటీన్ కోసం ‘పాన్ ఫ్రైడ్ చికెన్ విత్ వెజ్జీస్’ని ఎలా చేయాలో తెలుసుకుందాం. దీని తయారీకి కావాల్సినవి.. మూడు రకాల క్యాప్సికం, బ్రొకోలి, చికెన్ బ్రెస్ట్, నూనె. శనగ నూనె గానీ కుసుమ నూనె గానీ నువ్వుల నూనె తీసుకోవచ్చు. ఇంకా.. సాల్ట్, పెప్పర్, చిల్లీ ఫ్లేక్స్, మస్టర్డ్ సాస్ కూడా తీసుకోవాలి. ముందుగా.. కూరగాయలను కట్ చేసి పెట్టుకోవాలి. గ్రీన్, ఎల్లో, రెడ్ కలర్ క్యాప్సికమ్‌లు, చికెన్ మరియు క్యాలీఫ్లవర్‌ను ఇలా చిన్న ముక్కలుగా…
Elon Musk-Twitter Deal Details: ఎలాన్ మస్క్ ఎట్టకేలకు ట్వి్ట్టర్‌ను కొనుగోలు చేయటం వారం పది రోజుల నుంచి ప్రపంచం మొత్తం పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఆ సామాజిక మాధ్యమాన్ని తాను డబ్బు సంపాదన కోసం సొంతం చేసుకోలేదని కొత్త యజమాని చెప్పటం కొంత ఆశ్చర్యకరంగానే అనిపించింది. ఎందుకంటే.. ట్విట్టర్‌ను తన వ్యాపార సామ్రాజ్యంలో కలుపుకునేందుకు ఎలాన్ మస్క్ 44 బిలియన్ డాలర్లు చెల్లించారు.
Special Story on JJ Irani: మన దేశం మర్చిపోలేని పారిశ్రామికవేత్తల్లో జమ్షెడ్ జె ఇరానీ ఒకరు. జేజే ఇరానీగా, స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందారు. టాటా స్టీల్ కంపెనీ గొప్పతనంతోపాటు భారతదేశ ప్రతిష్టను ప్రపంచానికి చాటారు. 8 గంటల పని సంస్కృతికి శ్రీకారం చుట్టారు. ఈ నిర్ణయం ఇతర కంపెనీలకు బెంచ్‌మార్క్‌లాగా నిలవటం విశేషం. కేవలం ఇండస్ట్రియలిస్ట్గానే కాకుండా స్పోర్ట్స్మ్యాన్గా, స్టాంపులు-నాణేల సేకరణకర్తగా తన అభిరుచులను చాటుకున్నారు. తుది శ్వాస విడిచే వరకు క్రికెట్‌ను ఆస్వాదించారు.
Special Story on Walmart and Ikea: రిటైల్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన కంపెనీలు వాల్‌మార్ట్ మరియు ఐకియా. ఈ రెండు సంస్థలు ఇండియాలో మొండిగా ముందుకెళుతున్నాయి. భారీగా నష్టాలొస్తున్నా భరిస్తామంటున్నాయి. బిజినెస్‌ని కంటిన్యూ చేయాలనే నిర్ణయించుకున్నాయి. వాటి పట్టుదలకు తగ్గట్లే సేల్స్ పెరుగుతున్నాయి. కానీ.. లాభాల్లోకి రాలేకపోతున్నాయి. గతేడాది కాలంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇవి అనుసరిస్తున్న వ్యాపార వ్యూహంపై మరిన్ని వివరాలు..
ఫ్యూజిఫిల్మ్ ఇండియా కొత్తగా మిర్రర్‌లెస్ డిజిటల్ కెమెరాను లాంఛ్ చేసింది. ఇందులో నూతనంగా సెన్సార్లను ఇన్స్టాల్ చేసింది. ఈ కెమెరాలో ఇన్‌బిల్ట్‌గా 8కె/30పి రికార్డింగ్ కెపాసిటీ ఉంటుంది. దీంతో కంటెంట్‌ను స్టిల్ ఇమేజ్‌లుగా మరియు ఫిల్మ్‌లుగా క్రియేట్ చేసుకోవచ్చని వివరించింది. ఫ్యూజిఫిల్మ్ ఎక్స్-హెచ్2 మోడల్ ధర 1,99,999/- రూపాయలు. ఈ డిజిటల్ కెమెరా లెన్స్ కిట్‌తో కలిపి 2 లక్షల 44 వేల 999 రూపాయలకు లభిస్తుంది.