Amazon founder warned about recession: సొమ్ములే ఆదా.. చెయ్యరా భాయి.. డాబుకే పోక.. డబ్బు పోగెయ్యి.. అని తెలుగు రచయిత చంద్రబోస్ 20 సంవత్సరాల క్రితమే బడ్జెట్ పద్మనాభం అనే మూవీ కోసం ఒక చక్కని పాట రాశారు. అమేజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ కూడా ఇప్పుడు అదే చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఎకానమీ ఏమంత బాగా లేదని, అందుకే అన్ని రంగాల్లోనూ ఉద్యోగ కోతలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. ఆర్థిక సంక్షోభం సవాళ్లు విసురుతోందని చెప్పారు.
IT Companies Lay offs: ఆర్థిక సంక్షోభ భయాలతో ఉద్యోగులను ఇంటికి పరిమితం చేస్తున్న కార్పొరేట్ కంపెనీల జాబితాలోకి ఇప్పుడు సిస్కో కూడా చేరనున్నట్లు తెలుస్తోంది. నెట్ వర్కింగ్ రంగంలో పెద్ద సంస్థగా పేరొందిన సిస్కో.. 4 వేలకు పైగా కొలువులకు లేదా మొత్తం వర్క్ ఫోర్సులో 5 శాతానికి కోత పెట్టనుందని అంటున్నారు. అయితే.. ఆ కంపెనీ యాజమాన్యం మాత్రం ఈ వార్తల్ని ధ్రువీకరించట్లేదు. అలాగని.. పూర్తిగా తోసిపుచ్చటం కూడా చేయలేదు.
Special Interview with Founders of Darwin Box: మేనేజ్మెంట్, మనీ అండ్ మ్యాన్‌పవర్.. ఈ మూడూ ఉంటే ఏ కంపెనీ అయినా టాప్‌లో వెళుతుంది. డార్విన్ బాక్స్ యాప్ అనే సంస్థ కూడా ఆ కేటగిరీలోకే వస్తుంది. యూనికార్న్ క్లబ్లో చేరి హైదరాబాదీలు గర్వపడేలా చేసింది. ఈ కంపెనీ కోఫౌండర్లు రోహిత్ చెన్నమనేని, చైతన్య పెద్దిలతో ‘‘ఎన్-బిజినెస్ ఐకాన్’’ టీం ముచ్చటించింది. ఆ విశేషాలు వాళ్ల మాటల్లోనే.. ఈ సంస్థను ఏడేళ్ల కిందట ముగ్గురం కలిసి స్థాపించాం.
Special Story on Snapdeal Founders: మన దేశంలోని అతిపెద్ద ఆన్లైన్ మార్కెట్ ప్లేసుల్లో ఒకటైన స్నాప్‌డీల్ సక్సెస్ స్టోరీ వెనక ఇద్దరు మిత్రులున్నారు. వాళ్లే.. కునాల్ బహల్ మరియు రోహిత్ బన్సల్. స్నాప్‌డీల్ విజయవంతం కావటంతో వీళ్లిద్దరూ కొన్నాళ్లుగా యూనికార్న్‌లు మరియు సూనికార్న్ల్లో వ్యక్తిగతంగా భారీఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. అవి అనూహ్యంగా లాభాలను ఆర్జిస్తుండటంతో ఇద్దరి సంపద దాదాపు 200 మిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.
Special Story on Solar Power in India: మన దేశంలో సరికొత్త సౌర చరిత్ర ప్రారంభమైంది. దీంతో.. కరంట్ కోసం భవిష్యత్తులో బొగ్గు పైన మరియు శిలాజ ఇంధనాల పైన ఆధారపడాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఈ సంవత్సరంలోని మొదటి 6 నెలల్లో ఇండియా.. సోలార్ పవర్ జనరేషన్ ద్వారా 4.2 బిలియన్ డాలర్ల ఇంధన ఖర్చును తగ్గించుకోగలిగింది. 19.4 మిలియన్ టన్నుల బొగ్గును కూడా ఆదా చేసుకుంది.
Special Story on Nykaa’s Business Model: నైకా అనే ఇ-కామర్స్ కంపెనీకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ సంస్థ రెండేళ్ల కిందట అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. మహిళ సారథ్యం వహిస్తున్న ఫస్ట్ ఇండియన్ యూనికార్న్ స్టార్టప్‌గా గుర్తింపు తెచ్చుకుంది. పదేళ్ల కిందట ప్రారంభమైన ఈ పాపులర్ ఆన్లైన్ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ రిటైలర్.. ఏడాది క్రితం ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌కి వచ్చింది. తద్వారా 5 వేల 352 కోట్ల రూపాయల నిధులను సమీకరించింది. దీంతో నైకా ఫౌండర్ ఫల్గుణి నాయర్…
Beer: ఈమధ్య కాలంలో చాలా మంది ఈ ప్రశ్న అడుగుతున్నారు. అందుకే.. ఈ సమాధానం. బీర్ అనేది ఒక ఆల్కహాలిక్ డ్రింక్. దీన్ని.. గోధుమలు, బార్లీ, రైస్ వంటి మాల్తో తయారుచేస్తారు. బీర్లో ఆల్కహాల్ పర్సంటేజ్ 4 నుంచి 6 శాతం మాత్రమే ఉంటుంది. 355 మిల్లీ లీటర్ల బీర్లో 153 గ్రాముల క్యాలరీలు, 14 గ్రాముల ఆల్కహాల్, 13 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 2 గ్రాముల ప్రొటీన్, జీరో గ్రామ్ ఫ్యాట్ ఉంటాయి.
Special Story on Marriages: దేశవ్యాప్తంగా వ్యాపారులకు ఈ ఏడాది దీపావళి పండుగ ఘనంగా గుర్తుండిపోతుంది. ఫెస్టివల్ సీజన్లో బిజినెస్ బాగా జరగటంతో వాళ్లు మస్తు ఖుషీ అయ్యారు. మళ్లీ అదే రేంజ్లో వ్యాపారం చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి వచ్చే నెల 14 వరకు భారీ సంఖ్యలో బాజాలు మోగనుండటంతో బిజినెస్ సైతం పెద్దఎత్తున జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు మొత్తం ఎన్ని మ్యారేజ్లు జరగనున్నాయి? వాటికి ఎంతెంత ఖర్చవుతుంది?
Special Story on Use of cash: ‘ఫీల్ మై క్యాష్’ అనే కాన్సెప్ట్ గురించి ఇంతకుముందు ఎప్పుడైనా విన్నారా? మన దేశంలో పెద్ద నోట్లు రద్దయి ఆరేళ్లయినా.. డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్నా.. జనం ఇప్పటికీ రికార్డు లెవల్లో క్యాషే వాడుతున్నారు. కారణమేంటంటే ‘పర్సనల్’ అంటున్నారు. ఆర్య సినిమాలోని ‘ఫీల్ మై లవ్’ అనే పాట మాదిరిగా ‘ఫీల్ మై క్యాష్’ అని చెబుతున్నారు. డబ్బు.. బ్యాంక్ ఖాతాలో ఉండటం వేరు, చేతిలో ఉండటం వేరు అని పేర్కొంటున్నారు.
Special Story on Sundar Pichai: ఈ రోజుల్లో చాలా మంది తమకు తెలియని ఏ విషయాన్నైనా అడిగేందుకు, సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ముందుగా గూగుల్ తల్లినే ఆశ్రయిస్తున్నారు. ఆ తల్లినే కన్న కొడుకు సుందర్ పిచాయ్. ప్రపంచంలోని పవర్ ఫుల్ కంపెనీ గూగుల్‌కి సీఈఓ అయిన మొట్టమొదటి నల్లజాతీయుడు, భారతీయుడు ఈయనే కావటం మనకు గర్వకారణం. సెర్చింజన్లలో గూగుల్ ఒక దిగ్గజంగా ఎదిగేందుకు తోడ్పడిన టూల్బార్ రూపకల్పనలో సుందర్ పిచాయ్ కీలక పాత్ర పోషించారు.