యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి చెందిన ఎమిరేట్స్ ఎన్బీడీ అనే బ్యాంక్ ఇండియాలో అదనంగా 100 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. చెన్నై మరియు గురుగ్రామ్‌లలో కొత్త బ్రాంచ్‌లను ఓపెన్ చేసింది. ఈ బ్యాంక్ గత ఐదేళ్లలో మన దేశంలో మూడు దశల్లో 300 మిలియన్ డాలర్ల వరకు ఇన్వెస్ట్ చేసింది. ప్రస్తుతం కార్పొరేట్ మరియు ట్రేడ్ సెగ్మెంట్ల పైనే దృష్టి పెట్టామని, రిటైల్ వైపు ఫోకస్ చేయలేదని ఇండియా రీజియన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ శరద్ అగర్వాల్ […]
నిధుల కొరత ఎదుర్కొంటున్న ఎడ్టెక్ సంస్థ అన్అకాడెమీ.. ఉద్యోగుల తొలగింపునకు తెరతీసింది. మొత్తం స్టాఫ్‌లో పది శాతం మందిని ఇంటికి పంపింది. ఈ సంస్థలో 3,500 మంది పనిచేస్తుండగా అందులో 350 మందిని తొలగించింది. ఖర్చులను తగ్గించుకోవటం ద్వారా లాభాలపై ఫోకస్ పెట్టిన ఈ సంస్థ.. ముందుగా సిబ్బందిని తగ్గించుకునే పనిలో పడింది. ఈ మేరకు అన్అకాడెమీ కోఫౌండర్ అండ్ సీఈఓ గౌరవ్ ముంజాల్ ఇంటర్నల్‌గా ఒక నోట్ విడుదల చేశారు.
ఇంటర్నేషనల్ ఓటీటీ సర్వీసుల కంపెనీ అమెజాన్ ప్రైమ్ వీడియో.. సరికొత్త ఆఫర్ ప్రకటించింది. ఇండియన్ కస్టమర్ల కోసం 599 రూపాయలకే ఏడాది పాటు సబ్స్క్రిప్షన్ ఇవ్వనున్నట్లు తెలిపింది. గతంలో ఈ ఆఫర్ కేవలం ఎయిర్టెల్ వినియోగదారులకే ఉండేది. ఇప్పుడు అన్ని టెలికం కంపెనీల కస్టమర్లకు విస్తరించింది. అయితే ఈ సబ్స్క్రిప్షన్ తీసుకున్నవాళ్లు ఒక వినియోగదారుడు, ఒక స్మార్ట్‌ఫోన్‌లో మాత్రమే ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ సర్వీసులను పొందుతారు.
Suven Pharma: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే సువెన్ ఫార్మాస్యుటికల్స్లో మెజారిటీ వాటా కొనుగోలు పట్ల రెండు ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. బ్లాక్‌స్టోన్ మరియు అడ్వెంట్ ఇంటర్నేషనల్ అనే కంపెనీలు సువెన్ ఫార్మాలో షేర్ కోసం విడివిడిగా సంప్రదింపులు జరుపుతున్నాయని స్టాక్ మార్కెట్ వర్గాల సమాచారం. సువెన్ ఫార్మాలో షేరును విక్రయించే విషయం ప్రమోటర్ల పరిశీలనలో ఉందనే వార్తలు ఇంతకు ముందు కూడా వచ్చాయి.
Special Story on SUVs Sales: వినాయకచవితి.. రక్షాబంధన్.. దసరా.. దీపావళి.. నవరాత్రి.. కార్తీక మాసం.. ఈ పండగ సీజన్లో ఎస్యూవీ కార్లు హాట్‌కేకుల్లా సేల్ అయ్యాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ మరియు మిడ్ సైజ్ వాహనాల విక్రయాలు జోరుగా సాగాయని వార్తలు వస్తున్నాయి. ఎంట్రీ లెవల్ కార్ల అమ్మకాలకు సైతం భారీ గిరాకీ నెలకొందని డేటా వెల్లడిస్తోంది. అన్ని కార్ల కంపెనీలకు కూడా బిజినెస్ హ్యాపీగా జరిగినట్లు దీన్నిబట్టి తెలిసిపోతోంది.
Uma Devi Chigurupati Exclusive Interview: ఉమా దేవి చిగురుపాటి.. విజయవంతమైన మహిళాపారిశ్రామికవేత్త. ప్రతిభావంతురాలైన క్రీడాకారిణి. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును ఒక్కసారి కాదు ఏకంగా రెండు సార్లు సొంతం చేసుకున్నారు. గ్రాన్యూల్స్ ఇండియా అనే సంస్థకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ కంపెనీలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మరియు హ్యూమన్ రిసొర్సెస్ విభాగాలను ముందుండి సమర్థంగా నడిపిస్తున్నారు.
Skin Care Basics: మన శరీరంలోని అతిపెద్ద అవయవం చర్మం. చలి, ఎండ, వాన ప్రభావాల నుంచి మనల్ని రక్షిస్తుంది. అందువల్ల చర్మాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం, ప్రాముఖ్యత అందరికీ ఉంది. చర్మ సంరక్షణ, చర్మ సౌందర్యం వంటి పదాలను వినగానే వెంటనే అమ్మాయిలు గుర్తొస్తారు. కానీ అది కరెక్ట్ కాదు. అబ్బాయిలు సైతం స్కిన్ పట్ల కేర్‌ఫుల్‌గా ఉండాలి. అయితే.. అబ్బాయిలకు స్కిన్ కేరా అని కొందరు ఆశ్చర్యపోతుంటారు. దానివల్ల మాకేంటి ఉపయోగం? అని కూడా అడుగుతుంటారు.
Easy and Healthy Breakfast: ఈజీ అండ్ హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌ను ఎలా తయారుచేసుకోవాలి? దానికి కావాల్సిన ఇన్‌గ్రెడియెంట్స్(పదార్థాలు) ఏంటి? వాటిని ఏవిధంగా యూజ్ చేసుకోవాలి? అనే అంశాలను చూద్దాం. ఈజీ అండ్ హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌ను ప్రిపేర్ చేయాలంటే ముఖ్యంగా ఓట్స్, వాల్నట్స్, ఆల్మండ్స్(బాదం పప్పు), కోకో పౌడర్(కొబ్బరి పొడి), కాఫీ పౌడర్(కాఫీ పొడి), మిక్స్డ్ సీడ్స్(వివిధ రకాల విత్తనాలు) కావాలి.
Special Story on Netflix vs Disney: ప్రపంచవ్యాప్తంగా వీడియో స్ట్రీమింగ్ సెగ్మెంట్లో ఇప్పుడు రెండు ప్లాట్‌ఫామ్‌ల మధ్య నువ్వానేనా అనే రేంజ్లో పోటీ నెలకొంది. ఇందులో ఒకటి నెట్‌ఫ్లిక్స్ కాగా రెండోది డిస్నీ. ఈ రెండింటిలో నెట్‌ఫ్లిక్స్ చాలా సీనియర్. డిస్నీ బాగా జూనియర్. అయితే.. మార్కెట్లోకి ఎప్పుడు వచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ముఖ్యమని డిస్నీ అంటుంటే.. నెట్‌ఫ్లిక్స్ మాత్రం తన ఫ్యూచర్ ప్లాన్లు తనకు ఉన్నాయని ధీమాగా చెబుతోంది. ఇంతకీ ఈ యుద్ధంలో గెలుపెవరిది?.
Satya Nadella: ప్రపంచంలోని అతి పెద్ద ఐటీ కంపెనీల్లో మైక్రోసాఫ్ట్ ఒకటి. దానికి తెలుగు సీఈఓ అయిన సత్య నాదెళ్ల లేటెస్టుగా సంస్థ ఉద్యోగులను, ఇన్వెస్టర్లను, కస్టమర్లను, పార్ట్నర్లను ఉద్దేశించి ఒక లెటర్ రాశారు. మైక్రోసాఫ్ట్ యాన్యువల్ రిపోర్ట్-2022లో పబ్లిష్ అయిన ఆ లేఖలో సత్య నాదెళ్ల పేర్కొన్న ఓ విషయం ఆసక్తికరంగా ఉంది. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ఏకైక పరిష్కారం డిజిటల్ టెక్నాలజీయే అని సత్య నాదెళ్ల చెప్పారు.