How to Pick a Good Stock: స్టాక్ మార్కెట్లలో వేల సంఖ్యలో స్టా్క్స్ ఉన్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్‌ఎస్‌ఈ)లో 2 వేలకు పైగా, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్(బీఎస్‌ఈ)లో 5 వేలకు పైగా స్టాక్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడులు పెట్టేందుకు ఏ స్టాక్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి? దానికి ఏదైనా మోడల్ ఉందా? అనేది ఆసక్తికరమైన అంశం. భిన్న వ్యక్తులు భిన్న మోడల్స్‌ని ఫాలో అవుతుంటారు. కానీ.. అందరికీ వర్తించే ఒక మంచి, పర్ఫెక్ట్ మోడల్ ఉంది. దాని గురించే ఇవాళ చర్చించుకుందాం.
ఆ మోడల్‌ని షార్ట్‌కట్‌లో క్యాన్‌స్లిమ్ (CANSLIM) మోడల్ అంటారు. సీ అంటే కరంట్ ఎర్నింగ్స్. ఏ అంటే యాన్యువల్ ఎర్నింగ్స్. ఎన్ అంటే న్యూ ప్రొడక్ట్/సర్వీస్/మేనేజ్‌మెంట్. ఎస్ అంటే సప్లై అండ్ డిమాండ్. ఎల్ అంటే లీడర్‌షిప్ పొజిషన్. ఐ అంటే ఇన్‌స్టిట్యూషనల్ ఓనర్‌షిప్. ఎం అంటే మార్కెట్ ట్రెండ్. ఒక కంపెనీ మంచిదా? కాదా? అనేది దాని పెర్ఫార్మెన్స్‌ని బట్టి డిసైడ్ చేస్తారు.
read more: Christmas Effect on Stock Market: ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్ చైర్మన్ ఆర్.వెంకటరామన్ అంచనా
సంస్థ పనితీరును దాని వార్షిక నివేదికలను బట్టి అంచనా వేస్తారు. ప్రతి సంవత్సరం కంపెనీ ప్రాఫిట్స్, ఎర్నింగ్స్, సేల్స్ పెరుగుతున్నాయా? తగ్గుతున్నాయా అనేది చూడాలి. దీంతోపాటు ప్రస్తుత పరిస్థితినీ పరిశీలించాలి. అంటే.. త్రైమాసిక ఫలితాలను విశ్లేషించాలి. బెస్ట్ స్టాక్స్‌ని ఎంపిక చేసుకోవటానికి కంపెనీ పెర్ఫార్మెన్స్‌ని ఫస్ట్ క్రైటీరియాగా పరిగణనలోకి తీసుకోవాలి.
కొత్త ప్రొడక్టులను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నారా?, కొత్త ఆలోచనలను అమలుచేయబోతున్నారా? అనేవీ స్టడీ చేయాలి. ప్రొడక్ట్‌కి సప్లై మరియు డిమాండ్ ఎలా ఉంది? గిరాకీకి తగ్గట్లు స్టాక్‌ను సప్లై చేసే పరిస్థితుల్లో ఆ సంస్థ ఉందా లేదా అనేది గమనించాలి. ఫలానా ప్రొడక్టును పరిగణనలోకి తీసుకుంటే ఆ సెగ్మెంట్‌లో ఆ కంపెనీ లీడర్‌షిప్/డామినేటింగ్ పొజిషన్‌లో ఉందా లేదా చూడాలి. మిగతా పోటీ సంస్థల కంటే దీనికి అడ్వాంటేజెస్ ఏమున్నాయో తెలుసుకోవాలి.
తర్వాత.. ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ని లెక్కలోకి తీసుకోవాలి. ఈ పెట్టుబడుల వివరాలను వెబ్‌సైట్స్ చూసి తెలుసుకోవచ్చు. చివరిది.. మార్కెట్ డైరెక్షన్. అంటే.. ఓవరాల్ మార్కెట్ డైరెక్షన్‌పై ఒక అవగాహనకు రావటానికి టెక్నికల్ అనాలసిస్‌ని అధ్యయనం చేయాలి. ఇన్ని పెరామీటర్స్ ఆధారంగా స్టాక్స్‌ని ఫిల్టర్ చేసుకుంటే ‘ది బెస్ట్’ తప్పకుండా దొరుకుతాయి.