‘‘Bisleri’’ Ramesh Chauhan: ఈ రోజుల్లో మనం ఎక్కడికి వెళ్లినా పక్కన ఒక వాటర్ బాటిల్ ఉంచుకుంటున్నాం. మనం వెళ్లే చోట మంచి నీళ్లు ఉంటాయని తెలిసినప్పటికీ వాటర్ బాటిల్స్‌ను మర్చిపోకుండా పట్టుకెళుతున్నాం. ఇది ఇప్పుడు అందరికీ ఒక అలవాటుగా మారింది. అంటే.. మంచి నీళ్ల సీసాలకు మంచి ప్రజాదరణ వచ్చింది. అయితే.. మన దేశంలో ఇలా వాటర్ బాటిల్స్‌కి ఇంత పాపులారిటీ రావటం వెనక ఒక వ్యక్తి ఉన్నారు. ఆయనే.. రమేష్ చౌహాన్. ఈ వారం మన డిఫైనింగ్ పర్సనాలిటీ.
Bye Bye Twitter: ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ట్విట్టర్.. ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. ఆ సంస్థకు సంబంధించి రోజూ కొత్త కొత్త వార్తలు వెలువడుతున్నాయి. దీంతో ఇదొక సరికొత్త డైలీ సీరియల్‌గా మారిపోవటం ఆసక్తిని మరియు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇదిలా ఉండగా.. ఇప్పటివరకూ ట్విట్టర్‌ను ఒక సోషల్ మీడియా మాదిరిగా హాయిగా ఎంజాయ్ చేసిన యూజర్లు మరిన్నాళ్లు ఇలా కొనసాగే సూచనలు కనిపించట్లేదు.
Google Parent Company Alphabet: గూగుల్ తల్లికి.. ‘‘ఎంప్లాయీ ఫ్రెండ్లీ కంపెనీ’’ అనే మంచి పేరుంది. అన్ని సంస్థల కన్నా ఎక్కువ శాలరీలిచ్చే టెక్నాలజీ దిగ్గజం అని చెబుతారు. కానీ ఈ కంపెనీకి పేరెంట్ సంస్థగా పేర్కొనే ఆల్ఫాబేట్కి మాత్రం ఆదాయం పెరుగుతున్నా లాభాలు తగ్గుముఖం పడుతున్నాయి. గతేడాది క్యూ3తో పోల్చితే ఈసారి 27 శాతం ప్రాఫిట్ కోల్పోయింది. ఓవరాల్ రెవెన్యూ 6 శాతం గ్రోత్ అయినప్పటికీ లాభం పడిపోవటం మింగుడు పడట్లేదు. దీంతో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటోంది.
Indian States Going Bankrupt: మన దేశంలోని చాలా రాష్ట్రాలు ఇప్పటికే పీకల్లోతులో అప్పులపాలయ్యాయి. వాటి ఆర్థిక పరిస్థితి.. ముందు ముందు మరింత క్షీణించే ప్రమాదం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇంకో మాటలో చెప్పాలంటే దాదాపు అన్ని రాష్ట్రాల పరిస్థితీ ఏమంత గొప్పగా లేదు. ఈ మేరకు ఆర్బీఐ ఇటీవల ఒక కేస్ స్టడీని విడుదల చేసింది. స్టడీలో భాగంగా ఆర్బీఐ రూపొందించిన జాబితాలోని 10 రాష్ట్రాల్లో 5 చోట్ల ఫైనాన్షియల్ కండిషన్ ఏమాత్రం సంతృప్తికరంగా లేదు.
Indian Economy: అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఇండియన్ ఎకానమీ గతేడాది ప్రత్యేక గుర్తింపు పొందింది. అయితే.. ఆ ఆనందం మరెన్నాళ్లో ఉండేట్లు లేదు. వచ్చే ఏడాదిలోనే ఈ టైటిల్‌ని కోల్పోయే ఛాన్స్ కనిపిస్తున్నాయి. కొవిడ్ అనంతరం ఆర్థిక వ్యవస్థలో కాస్త సానుకూల వాతావరణం నెలకొన్నప్పటికీ ఈ ప్రయోజనాలను అధిక రుణ భారం మరియు పెరుగుతున్న ఖర్చులు క్షీణింపజేస్తున్నాయని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ గోల్డమన్ శాక్స్ పేర్కొంది.
India Wanted Pilots: విమానయాన రంగం అభివృద్ధి దిశగా రెక్కలు తొడిగి రెప రెప లాడుతుండటంతో ఇండియాకి ఏటా వెయ్యి మందికి పైగా పైలట్లు అవసరమనే అంచనాలు వెలువడుతున్నాయి. వచ్చే ఐదేళ్లపాటు పైలట్లకు ఇదే స్థాయిలో డిమాండ్ నెలకొంటుందని చెబుతున్నారు. అయితే మన దేశానికి అవసరమైన సంఖ్యలో పైలట్లకు శిక్షణ ఇవ్వటానికి సరిపోను మౌలిక వసతులు లేవని నిపుణులు అంటున్నారు.
Zomato: జొమాటో అనగానే ఫుడ్ డెలివరీ గుర్తుకొస్తుంది. నిమిషాల వ్యవధిలో ఇంటికి తెచ్చిస్తారు. ఇంటికే కాదు. ఆఫీసులో ఉన్నా.. మరెక్కడ ఉన్నా.. లోకేషన్ ప్రకారం వాలిపోతారు. పార్సిల్ మన చేతిలో పెట్టిపోతారు. అయితే ఆ సంస్థ ఇప్పుడు ఖర్చులను తగ్గించుకునే పనిలో పడింది. దాదాపు 3 శాతం మంది సిబ్బందిని పనిలోంచి తీసేయాలనుకుంటోంది. తద్వారా లాభాలు ఆర్జించాలని కూడా ఆశిస్తోంది.
Real India: పెరుగుతున్న వడ్డీ రేట్లు మరియు ద్రవ్యోల్బణం వల్ల కొంత మందగమనం నెలకొన్నప్పటికీ.. ఇండియన్ రియల్ ఎస్టేట్ మార్కెట్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని 3వ త్రైమాసికంలో మంచి పనితీరే కనబరిచిందని.. కొలియర్స్ ఇండియా రిపోర్ట్ పేర్కొంది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు.. అంటే.. తొమ్మిది నెలల వ్యవధిలో.. మన దేశ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు.. గతేడాదితో పోల్చితే 18 శాతం పెరిగి.. 3 పాయింట్ 6 బిలియన్ డాలర్లకు చేరాయని తెలిపింది.
The India Box Office Report-October: అక్టోబర్‌కు సంబంధించిన ఇండియా బాక్సాఫీస్ రిపోర్ట్ వచ్చేసింది. ఆ నెలలో దేశం మొత్తమ్మీద ఏ భాషలో ఎన్ని సినిమాలు విడుదలయ్యాయి? వాటికి ఎన్ని కలెక్షన్లు వచ్చాయి? అన్నింటికన్నా ఏ మూవీ అత్యధిక వసూళ్లు సాధించింది? తదితర విషయాలను ఈ నివేదిక ప్రేక్షక దేవుళ్లకు సమగ్రంగా సమర్పిస్తోంది.
PhonePe Wonderful Decision: ఈ రోజుల్లో ఫోన్ గురించి తెలియనివారు ఉన్నారా? అస్సలు లేరు కదా!. అలాగే.. ఫోన్‌పే గురించి తెలియనివారు కూడా లేరంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే అది అంతగా ప్రజల్లోకి వెళ్లింది. మనం రోజూ పలికే ఫోన్ అనే రెండక్షరాల పక్కన ‘పే’ అనే ఒక్క అక్షరం చేర్చటంతో ఆ పేరు పలకటం ప్రజలకు ఈజీ అయింది. అలా.. అది జనం నోళ్లల్లో నానింది. మౌత్ పబ్లిసిటీతోనే ప్రతి సిటీ నుంచి గల్లీగల్లీకీ చేరింది.