Firing-Hiring: ప్రతిభావంతులైన ఇంజనీరింగ్ విద్యార్థులకు శామ్‌సంగ్ సంస్థ శుభవార్త చెప్పింది. దాదాపు వెయ్యి మంది ఇంజనీర్లను నియమించుకోవటానికి ప్లాన్ చేస్తున్నామని రీసెంట్‌గా ప్రకటించింది. ఐఐటీల్లో మరియు టాప్ ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్లలో చదివేవాళ్లను రిక్రూట్ చేసుకుంటామని తెలిపింది. కొత్తగా ఉద్యోగంలోకి తీసుకునేవాళ్లకు బెంగళూరు, నోయిడా మరియు ఢిల్లీల్లోని శామ్‌సంగ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్లలో వచ్చే సంవత్సరం ప్లేస్‌మెంట్ ఇస్తామని పేర్కొంది.
బెంగళూరులోని శామ్‌సంగ్ సెమీకండక్టర్ ఇండియా రీసెర్చ్ సెంటర్‌లో కూడా నియమిస్తామని వెల్లడించింది. వీళ్లంతా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఇమేజ్ ప్రాసెసింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, కనెక్టివిటీ, క్లౌడ్, బిగ్ డేటా, బిజినెస్ ఇంటలిజెన్స్, ప్రెడిక్టివ్ అనాలసిస్, సిస్టమ్-ఆన్-ఏ-చిప్, స్టోరేజ్ సొల్యూషన్స్ తదితర ‘‘న్యూ-ఏజ్’’ టెక్నాలజీలకు సంబంధించిన వర్క్ చేయాల్సి ఉంటుందని వివరించింది.
read more: Reliance Industries-Naphtha Sale: రష్యా నుంచి అరుదుగా భారీఎత్తున కొన్నదేంటి?
ఈ ట్యాలెంటెడ్ పీపుల్‌తో తమ ఆర్ అండ్ డీ సెంటర్లు ప్రజల నిత్య జీవితాలను మరింత మెరుగుపరిచే ఇండియా-సెంట్రిక్ ఇన్నోవేషన్లు సహా సరికొత్త ఆవిష్కరణలు, అత్యాధునిక సాంకేతికతలు, ప్రొడక్టులు, డిజైన్లను తెర మీదికి తేనున్నాయని శామ్‌సంగ్ ఇండియా హెచ్‌ఆర్ హెడ్ సమీర్ వాద్వాన్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద టెక్నాలజీ సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగులను కొలువుల నుంచి తొలగిస్తున్న నేపథ్యంలో శామ్‌సంగ్ ఇలాంటి సానుకూల ప్రకటన చేయటం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.