International Trade Prospects: అంతర్జాతీయ వాణిజ్య అవకాశాలకు సంబంధించి.. వరల్డ్‌లోని టాప్-10 ఆర్థిక వ్యవస్థల్లో ఇండియా.. ది బెస్ట్ ఎకనామీ అని ‘‘ఎస్ అండ్ పీ’’ గ్లోబల్ మార్కెట్ ఇంటలిజెన్స్ పేర్కొంది. ప్రపంచ ఆర్థిక మందగమన ప్రభావం భారతదేశ ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ఉండదని తెలిపింది. ఈ మేరకు లేటెస్ట్‌గా గ్లోబల్ ట్రేడ్ మానిటర్ రిపోర్టును విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం టాప్-10 ఎకానమీల్లో ఇండియాతోపాటు అమెరికా, యూరోపియన్ యూనియన్ 27, మెయిన్ ల్యాండ్ చైనా, జపాన్, బ్రిటన్, బ్రెజిల్, సౌత్ కొరియా, కెనడా, రష్యా ఉన్నాయి.
ప్రపంచ జీడీపీలో నాలుగైదు వంతులు మరియు గ్లోబల్ ఎక్స్‌పోర్ట్స్‌లో మూడు వంతులు ఈ పది దేశాలవే కావటం విశేషం. అత్యధిక వాణిజ్యం ఈ గ్రూప్ కంట్రీస్‌లోనే జరుగుతోంది. గ్లోబల్ ఎకనమిక్ స్లోడౌన్ ఎఫెక్ట్ ప్రస్తుతం ఈ దేశాల ఎగుమతులపైనే ముఖ్యంగా పడుతుందని, దిగుమతులపై ఏమంత ఉండదని అంచనా వేసింది. ముందు ముందు ఈ రెండు రంగాల పైన కూడా తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించింది. రానున్న రోజుల్లో యూరప్, అమెరికా, కెనడాతోపాటు లాటిన్ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఆర్థిక మాంద్యం నెలకొంటుందని వెల్లడించింది.
read more: Air india-Vistara: సింగపూర్ ఎయిర్‌లైన్స్ ప్రకటన
ఆసియా పసిఫిక్, మిడిల్ ఈస్ట్ మరియు ఆఫ్రికాల్లో ఆర్థిక వృద్ధి మధ్యస్థంగానే ఉంటుందని అంచనా వేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ తిరోగమనాన్ని నివారించగలదు కానీ వృద్ధి మాత్రం తక్కువగానే ఉంటుంది. గ్లోబల్ రియల్ జీడీపీ గ్రోత్ గతేడాది 5 పాయింట్ 9 శాతంగా ఉండగా ఈ ఏడాది 2 పాయింట్ 8 శాతానికి, వచ్చే ఏడాది 1 పాయింట్ 4 శాతానికి తగ్గిపోతుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ మార్కెట్ ఇంటలిజెన్స్ తెలిపింది.