India Unemployment Rate: ఈ సంవత్సరం ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ డిసెంబర్ నెలలో అత్యధికంగా నమోదైంది. ఈ విషయాన్ని సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ అనే సంస్థ వెల్లడించింది. భారతదేశ నిరుద్యోగ రేట్ 2022 డిసెంబర్ 20వ తేదీ నాటికి 9 శాతానికి చేరింది. థర్టీ డే మూవింగ్ యావరేజ్ ప్రాతిపదికన ఇది నవంబర్‌లో 8 శాతంగానే ఉంది. నెల రోజుల్లోనే వన్ పర్సెంట్ పెరిగింది.
Gold Shine in 2023: బంగారం.. విలువైన లోహం. వన్నె కలిగిన వస్తువు. ఆభరణాల రూపంలో అలంకారం పరంగానే కాకుండా ఆర్థిక కోణంలో కూడా పసిడికి ప్రాధాన్యత ఎక్కువ. అందుకే.. ఎకానమీ అనగానే గోల్డ్ గురించిన ప్రస్తావన తప్పకుండా వస్తుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యంపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వర్ణం పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ ప్రశ్నకు పరిశీలకులందరూ పాజిటివ్‌గానే సమాధానం ఇస్తుండటం విశేషం.
Today (28-12-22) Business Headlines: రికార్డ్ స్థాయిలో ఇళ్ల అమ్మకాలు: హైదరాబాద్‌లో ఈ ఏడాది ఇళ్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఏడేళ్ల కిందట.. అంటే.. 2014లో.. అత్యధికంగా 3 పాయింట్ నాలుగు మూడు లక్షల నివాసాలు సేల్ అవగా ఈ సంవత్సరం 3 పాయింట్ ఆరు ఐదు లక్షల గృహాల విక్రయాలు జరిగాయి. గతేడాది 25 వేల 406 ఇళ్ల అమ్మకాలు జరగ్గా ఈ ఏడాది 87 శాతం ఎక్కువగా 47 వేల 487
Today (27-12-22) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్లో క్రిస్మస్ మరుసటి రోజు నుంచి.. అంటే.. గడచిన రెండు రోజులుగా లాభాలు కొనసాగుతున్నాయి. దీంతో ఈ ట్రెండ్‌ను శాంతాక్లాజ్ ర్యాలీగా పేర్కొంటున్నారు. గ్లోబల్ మార్కెట్ నుంచి కూడా ఇవాళ సానుకూల సంకేతాలు వెలువడ్డాయి. చైనాలో సైతం కొవిడ్ సంబంధిత ఆంక్షలను మరింతగా సడలిస్తున్నట్లు ప్రకటించటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు బూస్ట్‌లా పనిచేసింది. దీంతో రెండు సూచీలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో గ్రోత్ నమోదు చేశాయి.
Present Job Bore: ఇండియాలో సగం మందికి పైగా ఎంప్లాయీస్ ఇప్పుడు చేస్తున్న ఉద్యోగంలో ఏమాత్రం ఎంజాయ్మెంట్ పొందలేకపోతున్నారు. ప్రజెంట్ జాబు పరమ బోరింగ్ అంటున్నారు. అందుకే కొత్త కొలువు కోసం సెర్చింగ్ చేస్తున్నారు. ఈ మేరకు సరికొత్త స్కిల్స్ నేర్చుకుంటున్నారు. ఫీల్డ్ మారటం ద్వారా ఫ్లెక్సిబిలిటీ మరియు హ్యాపీనెస్ కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం అన్ని చోట్లా కొనసాగుతున్న లేఆఫ్స్ ట్రెండింగ్.. సిబ్బంది మనోభావాలకు ఇబ్బందిగా మారింది. వెలగబెడుతున్న నౌకరీ ఎన్నాళ్లు ఉంటుందో తెలియని డోలాయమానం వల్ల కొంచెం ‘డిప్రెషన్’కి
South India Cinema-BookMyShow Report: సౌతిండియా సినిమా లెవల్ ఇప్పుడు పాన్ఇండియా రేంజ్‌ని దాటేసి ప్రపంచ స్థాయికి ఎదిగింది. హాలీవుడ్, బాలీవుడ్‌లను ఓవర్టేక్ చేసేసింది. ఈ మేరకు బుక్‌మైషో రిపోర్ట్ పలు ఉదాహరణలను వెల్లడించింది. ఇందులో ముందుగా కేజీఎఫ్ మూవీ గురించి చెప్పుకోవాలి. యశ్ హీరోగా రూపొందించిన ఈ చలన చిత్రం సంచలనం సృష్టించింది. కేజీఎఫ్ చాప్టర్-2 ప్రపంచవ్యాప్తంగా 12 వందల కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుంది.
Tech Layoffs: 2022.. మరికొద్ది రోజుల్లో ముగుస్తోంది. కానీ.. ఈ సంవత్సరం ఇప్పటికే లక్షన్నర మంది ఉద్యోగ జీవితాలు తాత్కాలికంగా ముగిశాయి. మీరిక రేపటి నుంచి ఆఫీసుకి రావొద్దంటూ 965 టెక్ కంపెనీలు తమ ఎంప్లాయీస్‌కి చెప్పేశాయి. 2008లో ప్రపంచ ఆర్థికమాంద్యం తలెత్తినప్పుడు కేవలం 65 వేల మందే కొలువులను కోల్పోగా 2009లో కూడా దాదాపు ఇదే సంఖ్యలో జాబులు పోయాయి. దీనికి రెట్టింపు కన్నా ఎక్కువగా ఈ ఏడాది లేఫ్‌లు ప్రకటించటం గమనించాల్సిన విషయం.
Today (27-12-22) Business Headlines: ‘‘పవర్ మెక్’’కి ఖాజీపేట: హైదరాబాద్‌కు చెందిన పవర్ మెక్ ప్రాజెక్ట్స్ అనే సంస్థ కొత్తగా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా విలువైన లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఆర్డర్లను దక్కించుకుంది. లోకల్ కేటగిరీలో తెలంగాణలోని ఖాజీపేటలో 306 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్‌తో వ్యాగన్ రిపేర్ వర్క్‌షాపు నిర్మించనుంది. నేషనల్ లెవల్లో అదానీ గ్రూపు నుంచి 608 కోట్ల రూపాయల ఆర్డర్ పొందింది. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని ఆ సంస్థ పవర్ ప్లాంట్లకు మెషినరీని సప్లై…
Today (26-12-22) Stock Market Roundup: గతవారం మొత్తం వెంటాడిన కొవిడ్ భయాల నుంచి దేశీయ స్టాక్ మార్కెట్ ఎట్టకేలకు కోలుకుంది. ఈ వారం శుభారంభం లభించింది. ఇవాళ సోమవారం లాభాలతో మొదలై లాభాలతోనే ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఆ ప్రభావం ఇండియన్ మార్కెట్‌పై ఏమాత్రం పడకపోవటం గమనించాల్సి విషయం. రెండు సూచీలు కూడా బెంచ్ మార్క్‌కు పైనే ట్రేడ్ అవటం ఈ రోజు చెప్పుకోదగ్గ అంశం.
India in World Steel Production: ప్రపంచవ్యాప్తంగా ఉక్కు ఉత్పత్తిలో ప్రస్తుతం మన దేశమే నంబర్-2 పొజిషన్లో ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గడచిన 8 ఏళ్లలో స్టీల్ ప్రొడక్షన్ రెట్టింపైందని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రాజ్యసభలో వెల్లడించారు. ఇండియా చరిత్రలో ఎప్పుడూ ఈ స్థాయిలో పురోగతి చోటుచేసుకోలేదని చెప్పారు. 2013-14లో ఏడాదికి 6 కోట్ల టన్నుల ఉక్కును మాత్రమే ఉత్పత్తి చేసేవాళ్లం.