Students Missing: అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి మండలంలో ఆరుగురు విద్యార్థులు అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. రాంబిల్లి BCT ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు నిన్న మధ్యాహ్నం తర్వాత నుంచి కనిపించకుండా పోయారని తల్లిదండ్రులు తెలిపారు. అయితే, సాధారణంగా స్కూల్ ముగిసిన తర్వాత ఇంటికి చేరే విద్యార్థులు, నిన్న మాత్రం మిస్సింగ్ కావడంతో కుటుంబాలు భయాందోళనలకు గురయ్యాయి. విద్యార్థుల ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు పాఠశాల దగ్గరకు చేరుకుని పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించారు. పిల్లలు కనిపించకుండా పోయిన విషయం కనీసం తమకు స్కూల్ మేనేజ్మెంట్ తెలియజేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Eating Biscuits with Tea: రోజూ ఛాయ్ తో బిస్కెట్ తింటున్నారా.. బీకేర్ ఫుల్
అయితే, విద్యార్థుల మిస్సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. రాంబిల్లిలోని బస్టాండ్, సమీప రైల్వే స్టేషన్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. విద్యార్థులు ఏదైనా వాహనం ఎక్కారా? ఎక్కడికైనా వెళ్లారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇక, తమ పిల్లలు ఎక్కడ ఉన్నారో, ఎలా ఉన్నారో తెలియక ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ పిల్లల్ని తీసుకురావాలని పోలీసుల్ని విద్యార్థుల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
Read Also: Wife Attacks Husband: సెల్ఫోన్ వాడకం తగ్గించాలన్న భర్త.. గొడ్డలితో దాడి చేసిన భార్య
స్కూల్ నుంచి పారిపోయిన విద్యార్థులు..
1. డి. జస్వంత్
2. ఎం. హిమతేజ…
3. ఎస్. భరత్…
4. బి లక్ష్మణరావు
5. పి. వరుణ్
6. యు. రాజారావు