Shark Tank India’s Season-2: వ్యాపారం చేయాలనే ఆలోచన ఉండి డబ్బు లేనివారి కోసం షార్క్ ట్యాంక్ ఇండియా పేరుతో నిర్వహించిన రియాలిటీ షో ఫస్ట్ సీజన్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ షోలో మన బిజినెస్ ఐడియాలతో ఇన్వెస్టర్లను మెప్పించగలిగితే వాళ్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తారు. ఫస్ట్ సీజన్‌లో దేశవ్యాప్తంగా 62 వేల మంది ఔత్సాహికులు తమ ఆలోచనలను ఈ వేదికగా పంచుకున్నారు.
read more: Top Executives Resignations: పెద్ద సంస్థల్లో పెద్దల రాజీనామాలు.. చేరికలు..
అందులో 198 బిజినెస్ ఐడియాలు ఫైనల్‌గా సెలక్టవగా చివరికి 67 ఒప్పందాలు కుదిరాయి. సోనీ టీవీలో సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఈ రియాలిటీ షో సెకండ్ సీజన్ ప్రీమియర్‌ను ఈ నెల 2వ తేదీన లైవ్ చేశారు. ఆన్‌లైన్‌లో SonyLivలోకి కూడా అందుబాటులోకి తెచ్చిన ఈ షో సీజన్-1లో ఉన్న జడ్జిల్లో ఇద్దరు ఇప్పుడు మిస్ అవుతున్నారు.
వాళ్లకు బదులు ఈసారి కొత్తగా ఒక జడ్జి చేరారు. మామఎర్త్ కో-ఫౌండర్ ఘజల్ అలగ్ మరియు ‘భారత్ పే’ కో-ఫౌండర్ అష్నీర్ గ్రోవర్ ప్లేస్‌లో కార్‌దేఖో కో-ఫౌండర్ అండ్ CEO అమిత్ జైన్.. ఎంట్రీ ఇస్తున్నారు. మిగతా ఐదుగురు సీజన్-1లో ఉన్నవారే ఇప్పుడూ కంటిన్యూ అవుతున్నారు.
ఈ జాబితాలో.. సుగర్ కాస్మెటిక్స్ ఫౌండర్ వినీతా సింగ్, లెన్స్‌కార్ట్ కో-ఫౌండర్ పెయుష్ బన్సల్, బోట్ కో-ఫౌండర్ అమన్ గుప్తా, షాదీడాట్‌కామ్ ఫౌండర్ అనుపమ్ మిట్టల్‌తోపాటు నమితా థాపర్ ఉన్నారు. వీళ్లంతా ప్రముఖ పెట్టుబడిదారులు. ఐఐటీ, ఐఐఎం వంటి ఉన్నత విద్యా సంస్థల్లో చదువుకున్నారు. చార్టర్డ్ అకౌంటెంట్ తదితర కోర్సులు చేశారు.