Pragati CEO Paruchuri Narendra Exclusive interview: ప్రపంచంలోని కీలకమైన పరిశ్రమల్లో ప్రింటింగ్ ఇండస్ట్రీ ఒకటి. ఆదాయంపరంగా టాప్-5లో కొనసాగుతోంది. ఇందులో ఇండియా కూడా విశేషంగా రాణిస్తోంది. మన దేశంలో మొత్తం రెండున్నర లక్షల ప్రింటింగ్ కంపెనీలున్నాయి. వాటిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రగతి ఆఫ్‌సెట్ ప్రైవేట్ లిమిటెడ్ తనదైన చెరిగిపోని ముద్ర వేసింది. అత్యుత్తమ నాణ్యతకు మారుపేరుగా నిలుస్తూ 60 ఏళ్లుగా తిరుగులేని సేవలందిస్తోంది.
read more: Airtel: రీఛార్జ్‌లో మోత.. వ్యాలిడిటీలో కోత..
ఈ క్రమంలో ప్రతిష్టాత్మక పురస్కారాలను, విలువ కట్టలేని ప్రశంసలను పొందింది. 49 ఇంటర్నేషనల్ అవార్డులను, 69 నేషనల్ అవార్డులను సొంతం చేసుకుంది. తద్వారా వరల్డ్ ప్రింటింగ్ మ్యాప్‌లో ఇండియాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. 1962లో 10 వేల రూపాయల పెట్టుబడితో ప్రారంభమైన ప్రగతి సంస్థ ప్రస్థానం ఇవాళ 440 కోట్ల రూపాయల టర్నోవర్‌కి చేరుకోవటం గొప్ప విషయం. ప్రస్తుతం ఈ కంపెనీ పరుచూరి నరేంద్ర సారథ్యంలో సగర్వంగా డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకుంటోంది.
42 ఏళ్ల కిందట.. అంటే.. 1978లో.. ప్రగతిలోకి ప్రవేశించిన పరుచూరి నరేంద్ర.. సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా సంస్థ విజయపథాన్ని కొనసాగిస్తున్నారు. ముద్రణా రంగంలో తన తండ్రి పరుచూరి హనుమంతరావు నెలకొల్పిన వారసత్వాన్ని ఘనంగా చాటుతున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రగతి ఆఫ్‌సెట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు పరుచూరి నరేంద్ర గారి మాటల్లో..