Today (03-02-03) Stock Market Roundup: వారాంతం రోజైన ఇవాళ శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్‌లో జోష్ కనిపించింది. రెండు కీలక సూచీలు కూడా లాభాలతో ప్రారంభమై లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్.. బెంచ్‌మార్క్ అయిన 60 వేల పాయింట్లను అధిగమించింది. ఫైనాన్షియల్ మరియు ఐటీ షేర్లు భారీగా లాభాలను ఆర్జించాయి. దీంతో ఇండియన్ ఈక్విటీ మార్కెట్‌లో ఈ వారం మొత్తం నెలకొన్న ప్రతికూల వాతావరణం ఇవాళ ఒక్కరోజుతో కొట్టుకుపోయింది.
అదానీ ఎఫెక్ట్ నుంచి ఇండెక్స్‌లు క్రమంగా కోలుకుంటున్నాయనటానికి ఈ రోజంతా జరిగిన పాజిటివ్ ట్రేడింగ్‌ను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నిఫ్టీ.. బెంచ్‌మార్క్ కన్నా కిందే క్లోజ్ కావటం ఒక్కటే కాస్త నిరాశపరిచింది. చివరికి.. సెన్సెక్స్.. ఏకంగా 909 పాయింట్లు పెరిగి 60 వేల 841 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ.. 243 పాయింట్లు పెరిగి 17 వేల 854 పాయింట్ల వద్ద ఎండ్ అయింది.
read more: Blockbuster Vs Netflix: ఓటమి అంచుల నుంచి.. విజయ తీరాలకు. తెలుసుకోవాల్సిన ‘బ్లాక్‌బస్టర్’ స్టోరీ
సెన్సెక్స్‌లో పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల సూచీ 3 శాతం పెరిగింది. బ్యాంక్ ఆఫ్ బరోడా క్యూ3 ఫలితాలు ఆశాజనకంగా ఉండటం కలిసొచ్చింది. సెన్సెక్స్‌లో టెక్ మహింద్రా, విప్రో, హెచ్‌సీఎల్ టెక్ నష్టపోయాయి. సెక్టార్ల వారీగా చూస్తే.. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ లాభాల బాటలో నడిచింది. ఒక శాతం వరకు పెరిగింది. రియల్టీ, మెటల్ సూచీలు మాత్రం నేల చూపులు చూశాయి. 4 శాతం వరకు డౌన్ అయ్యాయి.
వ్యక్తిగత స్టాక్స్‌ను పరిశీలిస్తే.. అదానీ గ్రూపు సంస్థల షేర్ల విలువ పతనమవుతూనే ఉంది. మొత్తం 10 కంపెనీల్లోని 7 కంపెనీల స్టాక్స్ వ్యాల్యూ లోయర్ సర్క్యూట్స్ వద్ద లాక్ అయ్యాయి. 10 గ్రాముల బంగారం ధర 414 రూపాయలు తగ్గి గరిష్టంగా 57 వేల 700 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.
కేజీ వెండి రేటు 309 రూపాయలు పడిపోయి అత్యధికంగా 69 వేల 895 రూపాయలు పలికింది. క్రూడాయిల్ ధర స్వల్పంగా 69 రూపాయలు తగ్గింది. ఒక బ్యారెల్ ముడి చమురు రేటు 6 వేల 248 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 5 పైసలు పడిపోయింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 81 రూపాయల 24 పైసల వద్ద స్థిరపడింది.