Today (03-02-23) Business Headlines: తెర పైకి సత్యం రామలింగరాజు వ్యవహారం. మరిన్ని వార్తలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today (03-02-23) Business Headlines:
హైదరాబాద్ కంపెనీ ‘ఆజాద్’ ఘనత
Also Read
హైదరాబాద్ సంస్థ ఆజాద్ ఇంజనీరింగ్ అరుదైన ఘనత సాధించింది. ప్రపంచ మార్కెట్’కి న్యూక్లియర్ విడి భాగాలను అందించిన దేశంలోనే తొలి కంపెనీగా నిలిచింది. ఫ్రాన్స్’లో తయారుచేస్తున్న న్యూక్లియర్ టర్బైన్లకు కీలకమైన స్పేర్ పార్ట్స్ సప్లై చేసినట్లు ఆజాద్ ఇంజనీరింగ్ సంస్థ వెల్లడించింది. ఫ్రాన్స్ కంపెనీ GE స్టీమ్ పవర్’తో ఉన్న దీర్ఘకాలిక ఒప్పందం వల్లే వరల్డ్ వైడ్’గా న్యూక్లియర్ సెక్టార్’లో బిజినెస్ ఆపర్చునిటీస్’ని దక్కించుకున్నామని తెలిపింది. తమ ప్రగతి ప్రస్థానం ఐదేళ్లపాటు కొనసాగుతుందని పేర్కొంది.
వార్తల్లోకి సత్యం రామలింగరాజు
సత్యం రామలింగరాజు చానాళ్ల తర్వాత వార్తల్లోకి వచ్చారు. ఆయన విషయంలో సెబీ ఇచ్చిన ఉత్తర్వులను శాట్ పక్కన పెట్టింది. వివాదాన్ని మరోసారి పరిశీలించి కొత్తగా ఉత్తర్వులు ఇవ్వాలని సూచించింది. సత్యం రామలింగరాజును సెక్యూరిటీ మార్కెట్’లోకి 14 ఏళ్ల పాటు ప్రవేశించకుండా నిషేధిస్తూ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా.. సెబీ.. నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ ఆదేశాల అమలును సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్.. శాట్.. ఇప్పుడు నిలిపివేయటం ప్రాధాన్యత సంతరించుకుంది.
హిందుస్థాన్ జింక్’లో వాటా విక్రయం
ప్రభుత్వ రంగ సంస్థల్లోని పెట్టుబడుల ఉపసంహరణపై ఫోకస్ పెట్టిన సెంట్రల్ గవర్నమెంట్ తాజాగా హిందుస్థాన్ జింక్ కంపెనీపై దృష్టి సారించింది. అందులో తమకు ఉన్న వాటాలో కొంత భాగాన్ని మార్చి నెలలోపు విక్రయించనుంది. ఈ విషయాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్.. దీపం.. కార్యదర్శి తుహిన్ కాంత పాండే వెల్లడించారు. హిందుస్థాన్ జింక్’లో కేంద్ర ప్రభుత్వానికి 29 పాయింట్ ఐదు నాలుగు శాతం వాటా ఉండేది. 2002లో వేదాంతా కంపెనీకి 26 శాతం షేరును విక్రయించారు.
‘సహారా’పై కఠిన చర్యలకు సెబీ ఆదేశం
సహారా గ్రూపుపై కఠిన చర్యలు తీసుకోవాలని సెబీ ఆదేశించింది. ఆ గ్రూపులోని రెండు సంస్థలతోపాటు చైర్మన్ సుబ్రతా రాయ్ మరియు మరో ముగ్గురి అకౌంట్లను, లాకర్లను స్వాధీనం చేయాలని అన్ని బ్యాంకులకు సూచించింది. అకౌంట్ల నుంచి డబ్బులు తీసుకోవటంపై ఆంక్షలు పెట్టాలని, డిపాజిట్లకు మాత్రం అనుమతించాలని స్పష్టం చేసింది. చట్ట విరుద్ధంగా నిధులు సేకరించినందుకు సహారా గ్రూపుపై సెబీ గతేడాది జూన్ 27వ తేదీన దాదాపు ఆరున్నర కోట్ల రూపాయలు ఫైన్ వేసింది. ఆ పెనాల్టీని వసూలు చేసుకోవటం కోసమే తాజాగా ఈ ఆదేశాలను జారీ చేసింది.
యూఎస్ కంపెనీతో హైదరాబాద్ సంస్థ జేవీ
హైదరాబాద్ కంపెనీ బ్రైట్’కామ్ అమెరికా సంస్థ కన్జ్యూమబుల్ INCతో జాయింట్ వెంచర్ ఏర్పాటుచేస్తోంది. ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపింది. ఒప్పందం ప్రకారం అమెరికా సంస్థలో హైదరాబాద్ కంపెనీకి 51 శాతం వాటా దక్కుతుంది. ఫలితంగా జాయింట్ వెంచర్ పేరును బ్రైట్’కామ్ ఆడియో US LLCగా పేర్కొంటారు. ఆడియో అడ్వర్టైజింగ్ సొల్యూషన్లను అందించటానికే ఈ జాయింట్ వెంచర్’ను ఏర్పాటుచేయనుంది.
‘అదానీ’ రేటింగులపై నిరంతర నిఘా: క్రిసిల్
అదానీ గ్రూపు సంస్థల రేటింగ్స్’పై నిరంతర నిఘా పెట్టినట్లు క్రిసిల్ అనే రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది. హిండెన్’బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ నేపథ్యంలో కార్పొరేట్ గవర్నెన్స్’కు సంబంధించి తలెత్తే కీలక పరిణామాలన్నింటినీ పరిశీలించనున్నట్లు పేర్కొంది. నియంత్రణ సంస్థలు లేదా ప్రభుత్వం చేపట్టే చర్యలను గమనిస్తున్నామని తెలిపింది. షేర్ల విలువలు పడిపోతూ ఉండటంతో అదానీ గ్రూపునకు బ్యాంకుల నుంచి గానీ క్యాపిటల్ మార్కెట్ల నుంచి గానీ వనరుల పెంపు సామర్థ్యాలు తగ్గిపోతే వాటి పైనా కన్నేసి ఉంచుతామని క్రిసిల్ వివరించింది.
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!