Stock Market Roundup 24-02-23: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారం మొత్తం నష్టాలనే చవిచూసింది. ఇవాళ శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమైనప్పటికీ సాయంత్రం నష్టాలతోనే ముగిసింది. మధ్యాహ్నం జరిగిన లావాదేవీల వల్ల రెండు కీలక సూచీలు కూడా లాభాలను కోల్పోయి నష్టాల్లోకి జారుకున్నాయి. ఐటీసీ మరియు లార్సన్ అండ్ టూబ్రో వంటి సంస్థల షేర్ల విలువ పడిపోవటం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది.
ఇదిలాఉండగా.. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఇండెక్స్‌లు మన దేశంలోనే తొలిసారిగా నిఫ్టీ ఇండియా మునిసిపల్ బాండ్ ఇండెక్స్‌ను ప్రారంభించటం విశేషం. సెన్సెక్స్.. 141 పాయింట్లు కోల్పోయి 59 వేల 463 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ.. 45 పాయింట్లు తగ్గి 17 వేల 465 పాయింట్ల వద్ద ఎండ్ అయింది.
read more: Indian Rupee: ఇండియన్ కరెన్సీ ఎందుకు పడిపోతోందంటే..
సెన్సెక్స్‌లో రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, బజాజ్ ట్విన్స్, ఏసియన్ పెయింట్స్ రాణించగా మహింద్రా అండ్ మహింద్రా రెండూ పాయింట్ నాలుగు శాతం దెబ్బతిన్నది. రంగాల వారీగా చూస్తే.. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 2 శాతం వరకు డౌన్ అయింది. ఆటోమొబైల్ మరియు ఎఫ్‌ఎంసీజీ సూచీలు కూడా బాగా నష్టపోయాయి.
వ్యక్తిగత స్టాక్స్‌ను పరిశీలిస్తే.. జిందాల్ స్టెయిన్‌లెస్ సంస్థ షేర్ల విలువ 3 శాతం పెరిగి 504 రూపాయల 55 పైసల రికార్డు స్థాయికి చేరుకుంది. మరో వైపు.. మహింద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్ స్టాక్స్ వ్యాల్యూ 8 శాతం పడిపోయింది. ఆ సంస్థ సీఈఓ అండ్ ఎండీ అర్వింద్ సుబ్రమణియన్ రాజీనామా చేయటం కలిసి రాలేదు. 10 గ్రాముల బంగారం ధర 102 రూపాయలు పెరిగింది.
అత్యధికంగా 55 వేల 689 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి రేటు 142 రూపాయలు తగ్గింది. గరిష్టంగా 64 వేల 209 రూపాయలు పలికింది. క్రూడాయిల్ ధర స్వల్పంగా 50 రూపాయలు మైనస్ అయింది. ఒక బ్యారెల్ చమురు 6 వేల 307 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూలో పెద్దగా మార్పులేదు. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 75 పైసల వద్ద స్థిరపడింది.