Sardar 2: కార్తి డ్యూయల్ రోల్ అరాచకం .. ఎస్.జె. సూర్య స్టైలిష్ విలనిజం..టీజర్ తో షేక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్, కోలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ 2’ నుంచి మేకర్స్ తాజాగా అదిరిపోయే టీజర్‌ను విడుదల చేశారు. కార్తీ హీరోగా, పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ పార్ట్ ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు సీక్వెల్‌తో మరింత భారీ స్థాయిలో బాక్సాఫీస్‌పై దండెత్తడానికి సిద్ధమవుతున్నారు. ఈ టీజర్ ఆద్యంతం హై-వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్, ఊహకందని ట్విస్టులతో సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. “ఇద్దరు స్పైలు.. ఒక తండ్రి, ఒక కొడుకు” అంటూ సాగే ఎస్.జె. సూర్య వాయిస్ ఓవర్‌తో టీజర్ ఒక పజిల్లా మొదలవుతుంది. తండ్రిగా ఒక వైల్డ్ అండ్ రగ్డ్ లుక్‌లో, కొడుకుగా స్టైలిష్ అండ్ టఫ్ క్యారెక్టర్లో కార్తీ ద్విపాత్రాభినయంలో విశ్వరూపం చూపించబోతున్నట్లు స్పష్టమవుతోంది.
ఇక ఈ టీజర్‌కు అసలైన హైలైట్ ఎస్.జె. సూర్య విలనిజం అనే చెప్పాలి. విభిన్నమైన మేనరిజమ్స్, స్టైలిష్ గ్లాసెస్ ధరించి ఆయన చెప్పే డైలాగులు, చేసే యాక్షన్ సీన్స్ సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నాయి. “టెక్నికల్లీ నేనే మంచివాడిని.. వాళ్లే బ్యాడ్ గైస్” అంటూ ఎస్.జె. సూర్య చెప్పే సంభాషణలు సినిమాలోని మాస్ అప్పీల్‌ను తెలియజేస్తున్నాయి. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి సామ్ సి.ఎస్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ టీజర్‌ను వేరే లెవెల్‌కు తీసుకెళ్లింది. మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ పాన్-ఇండియా సినిమా సెప్టెంబర్ 10, 2026 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ట్రెమండస్ యాక్షన్ సీక్వెన్స్‌లు, హై-క్వాలిటీ ప్రొడక్షన్ వాల్యూస్‌తో వస్తున్న ఈ ‘సర్దార్ 2’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో వేచి చూడాలి!
Also Read
- The Paradise: ఓటీటీలో నాని విధ్వంసం.. నెగెటివ్ టాక్‌తోనూ నెంబర్ 1 స్థానంలో 'ది ప్యారడైజ్'!
- AK 47: 'ఆదర్శ కుటుంబం'పై తగ్గిన క్రేజ్.. తమన్ పాటలతో మరింత డౌన్.. ఇక ట్రైలర్‌పైనే ఆశలు!
- Kalki 2: భైరవ ఈజ్ బ్యాక్.. ప్రభాస్ బర్త్‌డే స్పెషల్..! ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే మేకింగ్ వీడియో..
- Kajal Aggarwal-Ramayana: 'రామాయణ'లో చందమామ ఉందా?.. సీన్స్ తీసేశారా?
తాజావార్తలు
-
Vidadala Rajini: విడదల రజిని ఇంటి వద్ద హైటెన్షన్.. ఎస్సై చర్యతో కిందపడ్డ మాజీ మంత్రి..
-
Annamalai: CJPకి ఎప్పటికీ మద్దతు ఇవ్వం, వారి అజెండా వేరు.. అన్నామలై కీలక వ్యాఖ్యలు..
-
DK Shivakumar: మెటా స్మార్ట్ గ్లాసెస్ ధరించి, నాపై స్టింగ్ ఆపరేషన్.. డీకే శివకుమార్ సంచలన ఆరోపణ..!
-
The Paradise: ఓటీటీలో నాని విధ్వంసం.. నెగెటివ్ టాక్‌తోనూ నెంబర్ 1 స్థానంలో ‘ది ప్యారడైజ్’!
-
BJP: కాంగ్రెస్‌లో ప్రియాంక గాంధీ vs రాహుల్ గాంధీ.. బీజేపీ సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!