Business Headlines 24-02-23: ఇక.. హైడ్రోజన్ బస్సులు. మరిన్ని వార్తలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Business Headlines 24-02-23
BWA-తెలంగాణ ఒప్పందం
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
తెలంగాణ రాష్ట్రాన్ని నూతన సాంకేతిక పరిజ్ఞానంలో అగ్ర స్థానంలో నిలబెట్టే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్-కమ్యూనికేషన్ల శాఖ శ్రీకారం చుట్టింది. వెబ్3 టెక్నాలజీ సంస్థ భారత్ వెబ్3 అసోసియేట్స్.. BWAతో ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం BWA కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో సదస్సులు, ప్రదర్శనలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుంది. తద్వారా.. వెబ్3 టెక్నాలజీని విస్తరించేందుకు అనుకూల పరిస్థితులను కల్పిస్తుంది. ఈ టెక్నాలజీలపై పనిచేసేందుకు ఆసక్తి ప్రదర్శించే సంస్థలకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తుంది.
క్రిప్టోలను కట్టడి చేయాల్సిందే
జీ20 దేశాల ఆర్థిక మంత్రుల మరియు కేంద్ర బ్యాంక్ గవర్నర్ల రెండు రోజుల సమావేశాలు ఇవాళ ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. అమెరికా, జపాన్ వంటి పలు దేశాల ఆర్థిక మంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రిప్టో కరెన్సీల కట్టడికి అంతర్జాతీయంగా నియమనిబంధనలను రూపొందించాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. ఈ కరెన్సీలను కంట్రోల్ చేయకపోతే ప్రజలు పేదరికంలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నిర్మలా సీతారామన్ మరో 10 ద్వైపాక్షిక సమావేశాల్లోనూ పాల్గొననున్నారు.
‘మేఘా’ హైడ్రోజన్ బస్సులు
మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ గ్రూప్ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్.. హైడ్రోజన్ బస్సులను తయారుచేయనుంది. ఈ మేరకు కావాల్సిన టెక్నాలజీని రిలయెన్స్ ఇండస్ట్రీస్ నుంచి తీసుకుంది. ఈ సాంకేతికత సాయంతో ఒక హైడ్రోజన్ బస్సును రూపొందించి ఆవిష్కరించింది. ఇందులోని హైడ్రోజన్ ట్యాంక్‌ను పావు గంటలో పూర్తిగా నింపొచ్చు. ఈ వాయువు సాయంతో బస్సు 400 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఈ బస్సు సుమారు 12 మీటర్ల పొడవు ఉంటుంది. ఇందులో కనీసం 32 నుంచి గరిష్టంగా 49 వరకు సీట్లు ఉన్నాయి. ఏడాది వ్యవధిలో ఈ బస్సుల వాణిజ్య ఉత్పత్తిని చేపట్టి దేశంలోని పలు ప్రాంతాల్లో అందుబాటులోకి తేనుంది.
బడ్జెట్‌పై దువ్వూరి అసంతృప్తి
కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కొత్త బడ్జెట్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగ కల్పనకు బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వలేదని తప్పుపట్టారు. ఈ అంశం తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. నెలకు పది లక్షల మందికి కొత్తగా ఉపాధి అవసరం కాగా కనీసం సగం మందికి కూడా లభించడంలేదని కుండబద్ధలు కొట్టారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించే పథకాల రూపకల్పనలో బడ్జెట్ ఫెయిలైందని తేల్చిచెప్పారు. ఆర్థిక వృద్ధి జరిగినంత మాత్రాన ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని భావించటం తప్పు అని స్పష్టం చేశారు.
వందే భారత్ రేసులో ‘మేధా’
వందే భారత్ రైళ్ల విడి భాగాల తయారీకి సంబంధించిన బిడ్డింగ్ ప్రక్రియలో హైదరాబాద్ సంస్థ మేధా సర్వో డ్రైవ్స్ పాల్గొంది. వంద రైళ్లకు కావాల్సిన స్పేర్ పార్ట్స్‌ను అల్యూమినియంతో రూపొందించే ఈ ప్రాజెక్టు విలువ దాదాపు 30 వేల కోట్ల రూపాయలు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇండియన్ రైల్వేస్ తొలిసారిగా రైళ్ల తయారీకి అల్యూమినియం విడి భాగాలను వినియోగిస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టెక్నికల్ బిడ్‌లను నిన్న గురువారం ఓపెన్ చేశారు. ఫైనాన్షియల్ బిడ్‌లను త్వరలో ఆహ్వానించనున్నారు. ఆగస్టు నాటికి కనీసం 75 వందే భారత్ రైళ్లను ప్రారంభించాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
అమెరికాలో అపారవకాశాలు
ఇండియాలోని లీడింగ్ జ్యూలరీ రిటైల్ బ్రాండ్లలో ఒకటైన తనిష్క్.. అగ్ర రాజ్యం అమెరికాలో తొలి ఔట్‌లెట్‌ని ప్రారంభించి నెల రోజులైంది. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ.. యునైటెడ్ స్టేట్స్‌లో తమ సంస్థకే కాకుండా ఇతర ఇండియన్ రిటైల్ బ్రాండ్లకు కూడా అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అమెరికాలో భారతీయులు పెద్ద సంఖ్యలో ఉండటంతోపాటు వాళ్ల తలసరి ఆదాయం సైతం భారీగా ఉండటం ఇందుకు ప్రధాన కారణాలని చెప్పారు. మన దేశం, మన కల్చర్, మన ఉత్పత్తులపై ఇండియన్లకు ఆసక్తి ఉండటం కూడా దీనికి దోహదపడిందని తెలిపారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..