Pawan Kalyan Tour: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ నెలలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలకు సిద్ధమవుతున్నారు. పర్యటన షెడ్యూల్ రూపొందిస్తున్నారు. మొదటగా పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో పర్యటించనున్నారు పవన్ కల్యాణ్. ఇటీవల అక్కడి గురుకుల పాఠశాలలో విద్యార్థినులు అనారోగ్యంతో ఆసుపత్రి పాలవ్వడంతో, ఆ పాఠశాల పరిస్థితులను స్వయంగా పరిశీలించనున్నారు. ఆ తర్వాత పిఠాపురం, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో వరుస పర్యటనలు చేయనున్నారు. అలాగే రాజోలు నియోజకవర్గంలో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన కార్యక్రమంలో కూడా పాల్గొననున్నారు.…
Pawan Kalyan: కార్మికుడికి ఉద్యోగం అంటే కేవలం జీతం కాదు, అది అతని గౌరవం, భద్రత అని జస్టిస్ వి. గోపాల గౌడ నిరూపించారు. కార్మికుడికి రక్షణ, ఒక హైకోర్టు తీర్పుని కొట్టివేస్తూ, కార్మికుడికి అక్రమ తొలగింపునకు పరిహారం బదులు ఉద్యోగం పునరుద్ధరణ తప్పనిసరి అని తీర్పునిచ్చారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. తాజాగా కర్ణాటక, చిక్కబళ్లాపూర్ జిల్లా చింతామణి పట్టణంలో జస్టిస్ వి.గోపాల గౌడ అమృత మహోత్సవంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ ప్రసంగించారు.
AP Fake Liquor Case: కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతలకు భారీ షాక్ తగిలింది.. జయచంద్రా రెడ్డి, సురేశ్ నాయుడులను టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు తాజాగా టీడీపీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు.. తాజాగా నకిలీ మద్యంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అన్నమయ్య జిల్లా మొలకల చెరువు నకిలీ మద్యం వ్యవహారంలో నిందితులపై కఠిన చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. నిస్పక్షపాతంగా దర్యాప్తు […]
Pawan Kalyan: గురుకులలో ఇద్దరు విద్యార్థినుల మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. కురుపాం గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు మృతి బాధాకరమన్నారు. కురుపాంలోని బాలికల గురుకులంలోని విద్యార్థినులు అనారోగ్యానికి గురైన విషయం తెలిసి బాధపడ్డానని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అక్కడ నెలకొన్న పరిస్థితిపై జిల్లా అధికారులు, వైద్యుల నుంచి వివరాలు తీసుకున్నట్లు తెలిపారు. అక్కడి పిల్లలు కామెర్లు, సంబంధిత లక్షణాలతో అనారోగ్యానికి గురైనట్లు చెప్పారన్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఇద్దరు విద్యార్థినులు వేర్వేరు రోజుల్లో ఇంటి దగ్గర…
Brahmanandam: తెలుగు సినీ పరిశ్రమలో కామెడీ కింగ్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు హాస్యబ్రహ్మ బ్రహ్మానందం. ఎన్నో సంవత్సరాలుగా దాదాపు వెయ్యికి పైగా సినిమాల్లో నటించి తనదైన కామెడీ టైమింగ్.. నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. కమెడియన్ మాత్రమే కాదు.. సోషల్ మీడియా మీమ్ గాడ్ కూడా ఆయనే. ఎంతటి సీరియస్ పరిస్థితి అయినా.. కన్నీరు తెప్పించే బాధలో ఉన్నా..
Ghosts in Dreams: దేవుడు ఉంటే దెయ్యాలు సైతం ఉంటాయి. ఈ వ్యాఖ్యాన్ని చాలా సార్లు వినే ఉంటాం. దెయ్యాలు ఉన్నాయా? మనిషి చనిపోయాక అతని ఆత్మ దెయ్యంగా మారుతుందా? ఎవరి మీద కోపం ఉంటే వారి పై పగ తీర్చుకుంటాయా? ఇలాంటి రకరకాల ప్రశ్నలు తరచూ వస్తుంటాయి దెయ్యాలు రాత్రి పూట మాత్రమే ఎందుకు కనిపిస్తాయనే సందేహం సైతం మీకు వచ్చే ఉంటుంది. దెయ్యాలు, భూతాలు ఉంటాయి అనేది.. మనుషుల నమ్మకాలను బట్టి ఉంటుంది. ఇది […]
Pahalgam Attack: కశ్మీర్ లోయలోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి వెనుక కుట్ర నెమ్మదిగా బయటపడుతోంది. ఉగ్రవాదులతో నాలుగుసార్లు సమావేశమై, వారికి లాజిస్టికల్ మద్దతును అందించి, మొబైల్ ఫోన్ ఛార్జర్లను సరఫరా చేసిన ఓ వ్యక్తిని జమ్మూ కశ్మీర్ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. నిందితుడి పేరు 26 ఏళ్ల మొహమ్మద్ యూసుఫ్ కటారి. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. కేంద్ర దర్యాప్తు సంస్థల ప్రకారం.. పహల్గామ్ దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులు సులేమాన్ అలియాస్ ఆసిఫ్, జిబ్రాన్, హంజా […]
YS Jagan: మన్యం జిల్లాలో పచ్చకామెర్లతో విద్యార్థులు మృతి చెందటంపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు.. ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. కూటమి ప్రభుత్వం పాలనలో నిర్లక్ష్యం, అలసత్వం కారణంగా ఇవాళ పేద విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారని మండిపడ్డారు. అయినా వాళ్లకు కనికరం కూడా లేదని సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
Karnataka: బీహార్ ఎన్నికల తర్వాత కర్ణాటకలో పెను రాజకీయ మార్పులు వస్తాయని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర అంచనా వేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ మధ్య అధికార పోరాటం జరుగుతుంద జోష్యం చెప్పారు. తాజాగా విజయేంద్ర విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో గందరగోళం నెలకొందన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు నాయకత్వ మార్పు గురించి బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారని గుర్తు చేశారు. సిద్ధరామయ్య తొందరపడుతున్నట్లు కనిపిస్తున్నారన్నారు.
Botsa Satyanarayana: మెడికల్ కాలేజీల ఏర్పాటు పేద వాని వైద్యానికి సంబంధించినదని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తాజాగా విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నామన్నారు.. పేదవాడి ఆరోగ్య విషయంలో రాజీపడమన్నారు.. కూటమి ప్రభుత్వానికి జగన్ ఫోబియా పట్టుకుందని తెలిపారు.. ఇంకా ఎన్ని రోజులు జగన్ పేరు చెబుతూ బతుకుతారని ప్రశ్నించారు. కురుపాంలో 39 మంది విద్యార్థులు పచ్చ కామెర్లతో బాధపడుతున్నారని గుర్తు చేశారు. అందులో ఇద్దరూ మరణించారన్నారు..