YS Jagan: రేపు మాజీ సీఎం వైఎస్ జగన్ అనకాపల్లి జిల్లా పర్యటన ఖరారైంది.. అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాలను పరిశీలించనున్నారు. తాజాగా జగన్ పర్యటన షెడ్యూల్ విడుదల చేశారు.. రేపు ఉదయం 9.20 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరుతారు. 9.50 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు..10.15 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి 11 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు.. 11.30 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరుతారు.. 2 గంటలకు అనకాపల్లి జిల్లా…
Hyderabad: సరదాగా ఆడుకుంటూ పిల్లలు తెచ్చిన పంచాయితీ... ఓ నిండు ప్రాణం బలితీసుకుంది. నా కొడుకునే మందలిస్తావా అంటూ.. ఓ తండ్రి చేసిన దాడిలో మరో పిల్లాడి తండ్రి బలయ్యాడు. పిల్లలకు సర్ధిచెప్పాల్సిన పెద్దలు.. రోడ్డెక్కి పిడిగుద్దులు గుద్దుకున్నారు. కాసేపటికే ఓ పిల్లాడి తండ్రి చాతినొప్పి అంటూ తల్లిడిస్తూ పడిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే చనిపోయాడు. ఘట్కేసర్ పరిధిలోని ఔషపూర్‌లో జరిగిన ఘటన విషాదం నింపుతోంది.
YS Jagan: జగన్ మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనకు షరతులతో కూడిన అనుమతి లభించింది. రూట్ మార్చి..18 కండీషన్లతో పోలీసులు అనుమతి ఇచ్చారు. పోలీసులు ప్రతిపాదించిన మార్గంలోనే జగన్ పర్యటన నిర్వహించేందుకు వైసీపీ నాయకత్వం అంగీకరించింది. ఈ అంశంపై మాజీ మంత్రి అమర్నాథ్ మాట్లాడారు. "జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది. స్టీల్ ప్లాంట్ కార్మికులను జగన్మోహన్ రెడ్డి కలవకుండా చూసేందుకు పోలీసులు రూట్ మార్చారు.
Hyderabad:బాబా అవతారం ఎత్తిన కేటుగాడు.. వైద్యం కోసం వచ్చిన బాలికను ట్రాప్ చేశాడు. బాలిక పేరెంట్స్‌కు చెప్పకుండా పెళ్లి చేసుకుని ఇంట్లో నిర్బంధించాడు. పెళ్లై.. ఇద్దరు పిల్లలున్న బురిడీ బాబా... ఆ బాలికను ఇప్పుడు తన భార్య అంటున్నాడు. తమ కూతురును ట్రాప్ చేశాడని.. జీవితం నాశనం చేస్తున్నాడని పోలీసులను ఆశ్రయించారు బాలిక పేరెంట్స్. బాబాకి పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న విషయం తెలిసే తనను పెళ్లి చేసుకున్నానని.. పరిచయమైన 2 నెలలకే బాబాతో ప్రేమలో పడిపోయానని చెప్తోంది బాలిక.
Fake PMO Letter Scam: సైబర్ క్రిమినల్స్ తీరుకు అంతే లేకుండా పోతోంది. ఓ వ్యక్తి.. తాను చీటింగ్ చేయడం కోసం ప్రధాన మంత్రి కార్యాలయాన్ని వాడుకుంటున్నాడు. ఏకంగా పీఎంఓ అధికారినంటూ లేఖలు పంపుతున్నాడు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలోని ప్రభుత్వ సంస్థలను మోసం చేసేందుకు ప్రయత్నించాడు. ఇటీవల 2025 మే 1న డాక్టర్ పి. రామారావు పేరుతో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఓ లేఖ వచ్చింది. అందులో పి. రామారావు.. తనను తాను న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో పీఎంఓ డిప్యూటీ సెక్రటరీగా పొందుపరిచాడు. ఈవోకు…
Fake Doctorate Scam: డాక్టరేట్ కావాలా..? పదో తరగతి ఫెయిల్ ఐనా పర్వాలేదు.. డబ్బులిస్తే చాలు !! సమాజంలో మీకంటూ గుర్తింపు కావాలని ఆశపడుతున్నారా ? ఇంకెందుకు ఆలస్యం.. అడిగినంత ఇచ్చేయండి.. డాక్టరేట్ పొందేయండి !! ప్రతిష్టాత్మక డాక్టరేట్లను అంగట్లో సరుకులా అమ్ముతున్నాడు ఓ మేధావి. డాక్టరేట్...!! పేరుకు ముందు ఈ పదం జోడించుకోవాలి అంటే ఎంతో ఘనత సాధించి ఉండాలి.
Twist in Mulakalacheruvu Fake Liquor Case: ములకలచెరువు నకిలీ మద్యం తయారి కేసులో ట్విస్ట్ నెలకొంది. నిందితుడు జనార్దన్ వైసీపీకి చెందిన రాంమోహన్ గోడన్ ను అద్దెకు తీసుకోని మద్యం తయారీ యూనిట్ ఏర్పాటు చేసినట్లు తేలింది. గూడుపల్లికి చెందిన రాంమోహన్ వైసీపీలో యాక్టివ్ కార్యకర్త.. గతంలో అర్ కె డాబా పేరుతో హోటల్ నిర్వహించాడు. హైవే మార్పు చేయడంతో హోటల్ కు కష్టమర్లు రాకపోవడంతో మూసివేశాడు. జయచంద్రారెడ్డి సూచనతో అద్దెపల్లికి దాన్ని అద్దెకు ఇచ్చాడు. మరోవైపు.. తనకు ఎలాంటి సంబంధం లేదని…
Nellore:వాళ్లిద్దరూ గిరిజనులు.. పెన్నా నది ఒడ్డున నివసిస్తూ.. చేపలు పట్టుకుని జీవనం సాగించేవారు.. అలాంటి వారిని గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా హత మార్చారు. కర్రలు రాళ్లతో కొట్టి హత్య చేశారు. ఈడ్చుకుంటూ తీసుకు వచ్చి సమీపంలోని పెన్నా బ్యారేజ్‌లో పడేశారు.. భయాందోళన కలిగించే ఈ ఘటన నెల్లూరులోని పెన్నా బ్యారేజీ సమీపంలో జరిగింది.
Jagan Tour: మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటన అనుమతులుపై ఉత్కంఠ కొనసాగుతోంది. కమిషనర్ సిటీ పరిధిలో పరిమితులతో కూడిన అనుమతి ఇచ్చారు. జగన్ సహా 10 వాహనాలు వెళ్లేందుకు రూట్ మ్యాప్ ఖరారు చేశారు పోలీసులు. ఎయిర్ పోర్టు నుంచి పెందుర్తి మీదుగా నేషనల్ హైవే మీద వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. రోడ్ షోలు, జన సమీకరణ చేస్తే పర్యటనను అర్ధాంతరంగా నిలిపివేస్తామని షరతులు విధించారు.. రోడ్డు మార్గంలో జగన్ నర్సీపట్నం వెళ్లేందుకు అనుమతి లేదని అనకాపల్లి ఎస్పీ ప్రకటించారు.…
Pawan Kalyan: భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ కేసు విచారణ సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ఓ లాయర్ దాడికి యత్నించాడు. ఈ అంశంపై తాజాగా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. హింసకు సనాతనంలో చోటు లేదని పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్పామ్ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తిపై దాడి ప్రయత్నాన్ని ఖండించారు. “ఇది […]