UP: ఉత్తరప్రదేశ్‌లో ఓ భయంకరమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. తనతో లివ్-ఇన్ రిలేషన్‌లో ఉన్న మహిళను హత్య చేసి తల నరికి, మృతదేహాన్ని అడవి ప్రాంతంలో పడేసిన కేసులో పోలీసులు ఓ ట్యాక్సీ డ్రైవర్‌ను అరెస్టు చేశారు. అనంతరం నిందితుడు మరో పెళ్లికి సిద్ధమవుతున్నాడని పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఉమా అనే 30 ఏళ్ల మహిళను ఆమె బాయ్‌ఫ్రెండ్ బిలాల్ అనే ట్యాక్సీ డ్రైవర్ హత్య చేశాడు. మరో మహిళను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఉమాతో ఉన్న సంబంధాన్ని ముగించాలనుకుని ఈ నేరానికి పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు. ఉమా తల లేని మృతదేహం హర్యానాలోని కలేసర్ నేషనల్ పార్క్ సమీపంలో లభ్యమైంది. దీంతో రెండు రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు కారణమైన నిందితుడిని ఆదివారం పట్టుకున్నారు.
READ MORE: Delhi: ఇకపై ఢిల్లీలో ‘తందూరీ రోటీ’ బంద్.. ఎందుకో తెలుసా!
దర్యాప్తులో సంచలన నిజాలు బయటకు వచ్చాయి. డిసెంబర్ 6 సాయంత్రం బిలాల్ స్విఫ్ట్ కారులో సహారన్‌పూర్ నుంచి ఉమాను తీసుకెళ్లాడు. దాదాపు ఆరు గంటల పాటు కారులో తిరిగిన తర్వాత, కలేసర్ అడవికి దగ్గరలో ఉన్న లాల్ ధాంగ్ లోయ ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశాడు. తలను నరికి అక్కడే తలను దాచిపెట్టి పరారయ్యాడు. పోలీసులు వారి స్టైల్‌లో విచారణ చేపట్టగా ఉమా తలను దాచిన ప్రదేశాన్ని నిందితుడు చూపించాడు. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకునే పనిలో ఉన్నారు.
READ MORE: IPL 2026 Auction: అబుదాబిలో ఐపీఎల్ 2026 వేలం.. లైవ్ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలో తెలుసా?
కాగా.. విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. ఉమా సుమారు 15 ఏళ్ల క్రితం తన పెళ్లికి ఒక రోజు ముందు ఇంటి నుంచి ఓ వ్యక్తితో వెళ్లిపోయింది. ఇద్దరూ పెళ్లి సైతం చేసుకున్నారు. వారికి 13 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత పలు కారణాలతో ఈ దంపతులు విడిపోయారు. సుమారు ఏడాది నర్రా క్రితం ఆమె భర్తకు విడాకులు ఇచ్చింది. తన కుమారుడు తండ్రితోనే ఉన్నాడు. వ్యక్తిగత జీవితంలో సమస్యల కారణంగా ఆమె సహారన్‌పూర్‌లో ఒంటరిగా జీవించడం ప్రారంభించింది. గత రెండు సంవత్సరాలుగా ఉమా బిలాల్‌తో లివ్-ఇన్ రిలేషన్‌లో ఉందని పోలీసులు తెలిపారు. ఉమా ఖర్చులన్నీ బిలాల్ చూసుకునేవాడని, కానీ అతడి కుటుంబానికి ఈ సంబంధం గురించి తెలియదని దర్యాప్తులో తేలింది. మరో మహిళను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఉమాను తన జీవితంలో నుంచి తొలగించేందుకు బిలాల్ ముందే ఈ హత్యను ప్లాన్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు సమాచారం ఇచ్చిన తర్వాతే ఈ వివాహేతర బంధం, హత్య విషయం తమకు తెలిసిందని కుటుంబ సభ్యులు తెలిపారు.