Gelao Tribe Tradition: ప్రపంచంలో అనేక దేశాలు.. ఆయా దేశాల్లో విభిన్న సంస్కృతులు ఉంటాయి. అయితే.. కొన్ని తెలగలకు చెందిన సంస్కృతులు, ఆచారాలు విభిన్నంగా ఉంటాయి. పెళ్లికి ముందు వధువు పళ్లు రాలగొట్టే సంప్రదాయాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? లేదా విన్నారా? అలాంటి ఓ ఆచారానికి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చైనాలోని గెలావో (Gelao) అనే గిరిజన సమూహంలో ఒకప్పుడు చాలా విచిత్రమైన, కఠినమైన సంప్రదాయం ఉండేది. పెళ్లి కావాలంటే వధువుకు పై దంతాల్లో ఒకటి లేదా రెండు తీయాల్సి వచ్చేది. అలా చేయకపోతే వరుడి కుటుంబానికి అపశకునం జరుగుతుందని నమ్మేవారు. కొన్ని సందర్భాల్లో తీసేసిన పళ్ళ స్థానంలో అలంకరణ కోసం కుక్క పళ్ళను సైతం పెట్టుకునే వారు..
చైనా మార్నింగ్ పోస్ట్‌లోని కథనం ప్రకారం.. గెలావో అనేది చైనా, వియత్నాం దేశాల్లో నివసించే ఒక జాతి. 2021 నాటికి చైనాలో వీరి జనాభా సుమారు 6.77 లక్షలకు పైగా ఉంది. వీరు ఎక్కువగా దక్షిణ చైనాలోని గుయిజౌ ప్రావిన్స్ పశ్చిమ భాగంలో ఉన్న గెలావో స్వయంప్రభుత్వ ప్రాంతాల్లో నివసిస్తారు. సంప్రదాయంగా వీరు వ్యవసాయంపై ఆధారపడతారు. ఎక్కువగా ప్రాంతాల్లో బియ్యం సాగు చేస్తారు.. కొండ ప్రాంతాల్లో ఇతర ధాన్యాలను పండిస్తారు. ఈ తెగలో పెళ్లి ముందు పళ్ళు తీయించే ఈ సంప్రదాయం తరతరాలుగా కొనసాగింది. దీనికి సంబంధించిన ప్రాచీన రాతపూర్వక ఆధారాలు {దక్షిణ సాంగ్ రాజవంశ కాలం (1127–1279)} సైతం ఉన్నాయి.
READ MORE: TPCC Mahesh Goud : బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం కొనసాగుతుంది
గెలావో యువతి సుమారు 20 ఏళ్ల వయసుకు వస్తే పెళ్లి చేసేవాళ్లు. వివాహానికి సిద్ధమయ్యే సమయంలో వధువు ముందు పళ్ళలో ఒకటి లేదా రెండు బలవంతంగా తొలగించేవాళ్లు. దీనికి వెనుక ఒక జానపద కథ సైతం ఉంది. చాలా కాలం క్రితం ఒక గెలావో యువతి తన పెళ్లికి ముందు గ్రామానికి వచ్చే సమయంలో కొండపై నుంచి పడిపోయిందట. అయినా ఆమె బతికింది. కానీ.. ఆమె తన ముందు రెండు పళ్ళను కోల్పోయిందట. ఆమె ధైర్యం, త్యాగాన్ని గౌరవిస్తూ, ఆ తర్వాత పెళ్లి చేసుకునే గెలావో యువతులు పళ్ళు తీసేయించుకోవడం సంప్రదాయంగా మారిందని చెబుతారు. ఈ పళ్ళు తీసే ప్రక్రియను సైతం ప్రత్యేక పద్ధతిలో జరిగేది. ముందుగా ఒక కుండ నిండా మద్యం సిద్ధం చేసేవారు. ఆ తర్వాత అమ్మాయి మామ (తల్లి అన్న)ను గౌరవంగా ఇంటికి ఆహ్వానించేవారు. చిన్న సుత్తితో మేనమామ తన కోడలి పళ్ళను కొట్టి తీసేసే వాడు. ఒకవేళ మామ లేకపోతే.. తల్లి వైపు బంధువుల్లో అదే తరం చెందిన మరొక పురుషుడు ఈ పని చేసేవాడు. పళ్ళు తీసిన తర్వాత గాయాలు త్వరగా మానేందుకు ఒక ప్రత్యేక ఔషధ పొడిని చిగుళ్లపై రాసేవారు. ఒకవేళ గెలావో యువతి ఈ సంప్రదాయం చేయించుకోకపోతే, ఆమెను సమాజంలో ఎగతాళి చేయడం, అవమానించడం జరిగేది.
READ MORE: UP: 13 ఏళ్ల కొడుకుని వదిలి లివ్-ఇన్ రిలేషన్‌లో మహిళ.. తల నరికి చంపిన ప్రియుడు..
ఈ పళ్ళు తీయించే ఆచారానికి వేర్వేరు కారణాలు చెప్పుకుంటారు. కొందరి అభిప్రాయం ప్రకారం.. గెలావో ప్రజలు నివసించే ప్రాంతాల్లో విషపదార్థాలు ఎక్కువగా ఉండేవి. అనుకోకుండా వాటిని తిన్నప్పుడు లేదా సేవించినప్పుడు మహిళల దవడలు బిగుసుకుపోయేవట. ఈ సమస్యలను తగ్గించడానికి కొన్ని మొక్కలతో మందును తయారు చేసి నోటిలో వేసేవారట. కానీ.. రెండు దవడలు బిగుసుకుపోవడంతో సాధ్యం కాలేదట. అందుకే.. ముందు పళ్ళు లేకపోతే ఔషధ మొక్కలతో చేసిన మందులు తేలికగా నోటిలో వేయవచ్చని నమ్మకం ఉండేది. పై ముందు పళ్ళు ఉంటే భర్త కుటుంబానికి దురదృష్టం వస్తుందని, సంతానం కలగదని మరికొందరు నమ్మేవారు. కుటుంబ అభివృద్ధికి అడ్డుకాకుండా ఉండేందుకు పళ్ళను తీసేయాల్సిందే అనుకునేవారు. 1957లో గుయిజౌ ప్రావిన్షియల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎథ్నిక్ స్టడీస్ చేసిన పరిశోధన ప్రకారం.. ఈ కఠినమైన సంప్రదాయం గుయిజౌ ప్రావిన్స్‌లోని పుడింగ్, ఝిజిన్, రెన్‌హువై వంటి ప్రాంతాల్లో క్వింగ్ రాజవంశం చివరి కాలం (1644–1912) వరకు కొనసాగింది. ఆ తర్వాత నెమ్మదిగా ఈ ఆచారం తగ్గిపోయింది.