Ram Vilas Das Vedanti: రామజన్మభూమి ఉద్యమానికి కీలక నిర్మాత, ఉద్యమ ప్రధాన సూత్రధారి అయోధ్య మాజీ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ రామ్ విలాస్ దాస్ వేదాంతి(75) సోమవారం ఉదయం మధ్యప్రదేశ్‌లో కన్నుమూశారు. ఆయన మరణ వార్త అయోధ్యను, సాధువులను, రాజకీయ వేత్తలను దిగ్భ్రాంతికి గురిచేసింది. జాతీయ మీడియా సంస్థల నివేదికల ప్రకారం.. డాక్టర్ రామ్ విలాస్ దాస్ వేదాంతి డిసెంబర్ 10న ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్‌లోని రేవాకు వచ్చారు. రామకథ నిర్వహించారు. ఇంతలో బుధవారం ఆయన ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. స్థానికులు వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు మెరుగైన చికిత్స అందించడానికి ప్రయత్నించారు. కానీ చికిత్స పొందుతూ మృతి చెందారు.
డాక్టర్ వేదాంతిని రామజన్మభూమి ఉద్యమానికి ఊపిరిపోసిన ప్రముఖ వ్యక్తులలో ఒకరు. ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి చేసి, హిందువులను జాగృతి చేయడంలో కీలక పాత్ర పోషించారు. గతంలో అయోధ్య పార్లమెంటు సభ్యుడిగా పని చేసిన ఆయన.. పార్లమెంటు నుంచి అయోధ్య వీధుల వరకు రామాలయ నిర్మాణం కోసం గట్టిగా వాదించారు. కాగా.. ఈ మరణ వార్తపై సీఎం యోగి ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. “శ్రీరామ జన్మభూమి ఉద్యమానికి మూలస్తంభం, మాజీ ఎంపీ, అయోధ్య ధామ్‌లోని వశిష్ఠ ఆశ్రమానికి చెందిన గౌరవనీయ సాధువు డాక్టర్ రామ్ విలాస్ వేదాంతి జీ మహారాజ్ మరణం ఆధ్యాత్మిక ప్రపంచానికి, సనాతన సంస్కృతికి తీరని లోటు. ఆయనకు వినయపూర్వకమైన నివాళులు. వేదాంతి మరణం ఒక శకానికి ముగింపు. మతం, సమాజం, జాతి సేవకు అంకితమైన వేదాంత త్యాగ జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం. మరణించిన ఆత్మకు ఆయన పవిత్ర పాదపద్మములలో స్థానం కల్పించాలని ప్రార్థిస్తున్నాను.” అని పేర్కొన్నారు. అనంతరం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రిజేష్ పాఠక్ సహా పలువురు ప్రముఖ నాయకులు వేదాంతి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
READ MORE: Varanasi : ‘వారణాసి’లోకి పవర్‌ఫుల్ యాక్టర్ ఎంట్రీ.. వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్!