E20 Petrol: దేశవ్యాప్తంగా 20% ఇథనాల్ కలిగిన E20 పెట్రోల్ వాహన యజమానులకు తలనొప్పిగా మారుతోంది. ప్రభుత్వం దీనిని గ్రీన్ ఎనర్జీ వైపు చారిత్రాత్మక అడుగుగా అభివర్ణిస్తుండగా.. సాధారణ ప్రజలు మాత్రం దీన్ని తిరస్కరిస్తున్నారు. దేశవ్యాప్తంగా జరిగిన ఓ సర్వే ప్రకారం.. ఈ కొత్త మిశ్రమ ఇంధనం వాహన మైలేజీని తగ్గించి ఖర్చులను పెంచిందని చెబుతున్నారు.
Liver Health: కాలేయం శరీరంలోని ఒక ముఖ్యమైన అవయవం. ఇది రక్తాన్ని ఫిల్టర్ చేయడం, ఆహారాన్ని జీర్ణం చేయడం, నిర్విషీకరణతో సహా సుమారు 500 విధులను నిర్వహిస్తుంది. అందువల్ల, కాలేయ ఆరోగ్యం గురించి ఎల్లప్పుడూ శ్రద్ధ వహించాలని చెబుతారు. అయితే, ఈ రోజుల్లో చాలా మంది కాలేయ సమస్యలతో బాధపడుతున్నారు.
Taliban Claim Victory Over Pakistan; పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో తాలిబన్లు తమను తాము విజేతలుగా ప్రకటించుకున్నారు. ఆఫ్ఘన్ లోని అనేక నగరాల్లో సాధారణ ప్రజలు తాలిబన్ యోధులతో కలిసి సంబరాలు చేసుకుంటున్నారు. ఆఫ్ఘన్ గడ్డపై పాకిస్థానీయుల చర్యలను తాము సహించలేమని సాధారణ ఆఫ్ఘన్ పౌరులు పేర్కొన్నారు. ఖోస్ట్, నంగర్హార్, పాకితా, పంజ్‌షీర్, కాబూల్‌లలో సంబరాలు మిన్నంటాయి.
Rajmata Vijaya Raje Scindia: భారతీయ జనతా పార్టీ (బిజెపి) వ్యవస్థాపక సభ్యురాలు, జనసంఘ్ ప్రముఖ నాయకురాలు రాజమాత విజయరాజే సింధియా జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆమెకు నివాళులు అర్పించారు. సామాజిక సేవ పట్ల ఆమె అంకితభావం, భారతీయ సంస్కృతిపై ఆమెకున్న విశ్వాసం ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటుందని అన్నారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు.
Pak- Afghan war: ఆఫ్ఘన్ భూభాగంలో పాకిస్థాన్ వైమానిక దాడులకు తాము ప్రతీకారం తీర్చుకున్నట్లు తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వెల్లడించారు. ఈ ప్రతీకార దాడుల్లో కనీసం 58 మంది పాకిస్థాన్ సైనికులు మరణించారని, 30 మంది గాయపడ్డారని స్పష్టం చేశారు. పాకిస్థాన్‌కి చెందిన 25 ఆర్మీ పోస్టులను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఇటీవల పాకిస్థాన్ తమ దేశ రాజధాని కాబుల్‌తోపాటు ఓ మార్కెట్‌పై బాంబు దాడులు చేసిందని ఇందుకు ప్రతీకారంగా ఈ దాడులు జరిపినట్లు తెలిపారు.
PM Modi Invited to Peace Summit by Trump: ప్రధాని మోడీకి ట్రంప్ నుంచి ఆహ్వానం లభించింది.. అక్టోబర్ 13, సోమవారం షర్మెల్ షేక్‌లో జరగనున్న శాంతి శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దేల్ ఫత్తా అల్-సిసి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆహ్వానం అందినట్లు సమాచారం. శనివారం చివరి నిమిషంలో ఈ ఆహ్వానం అందిందని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది.
China: డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేసేలా నిర్ణయం తీసుకున్నారు. చైనా నుంచి దిగుమతి చేసుకునే అన్ని వస్తువులపై 100% సుంకాన్ని ప్రకటించారు. నవంబర్ 1, 2025 నుంచి ఈ కొత్త సుంకాలు అమల్లోకి వస్తాయని తెలిపారు. ఈ నిర్ణయంతో యూఎస్-చైనా మధ్య పెద్ద వాణిజ్య యుద్ధం జరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే.. ఈ ప్రకటనపై డ్రాగెన్ స్పందించింది. ట్రంప్ సుంకాలను ఏకపక్షంగా అభివర్ణిస్తూ, ప్రతీకార చర్యలకు బలమైన హెచ్చరిక జారీ చేసింది.
Roman Reigns: క్రికెట్ మైదానంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బ్యాట్‌తో ఫోర్లు, సిక్సర్లు కొట్టడం మీరు చూసే ఉంటారు. కానీ WWE (వరల్డ్ వైడ్ ఎంటర్టైన్మెంట్) రింగ్‌లో క్రికెట్ బ్యాట్‌తో కొట్టడాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? తాజాగా ఇలాంటి దృశ్యం కనిపించింది. రెజ్లర్ రోమన్ రెయిన్స్ తన ప్రత్యర్థిని క్రికెట్ బ్యాట్‌తో కొట్టాడు.
Pak- Afghan war: పాకిస్థాన్ - ఆఫ్ఘనిస్థన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. పాకిస్థాన్ ఆఫ్ఘనిస్థన్లోని తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) పై దాడి ప్రారంభించింది. ఈ దాడి ఇప్పుడు రెండు దేశాలలో అశాంతిని రేకెత్తించింది. ఖైబర్ పఖ్తున్ఖ్వా, బలూచిస్థాన్‌లోని అనేక ప్రాంతాలలో ఆఫ్ఘన్ దళాలు కాల్పులు జరిపాయి. రెండు వైపుల నుంచి ఫిరంగి దాడులు జరిగాయి. ఆఫ్ఘనిస్థన్లోని టోలో న్యూస్.. 12 మంది పాకిస్థాన్ సైనికులు మరణించారని చెబుతోంది.
Bihar: ఇది కలియుగం. ప్రియుడి కోసం ప్రియురాలు.. లవర్ కోసం ప్రియుడు కట్టుకున్న వాళ్లను మట్టుబెడుతున్నారు. అలాంటి మరో ఘటన తాజాగా బీహార్‌లో వెలుగులోకి వచ్చింది. అల్రెడీ రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఓ వ్యక్తి.. మూడో సారి పెళ్లి పీటలు ఎక్కాలని నిర్ణయించుకున్నాడు. దీంతో రెండో భార్యను మట్టుబెట్టాడు.