-
AIIMS Study: వాయు కాలుష్యంతో కడుపులోని బిడ్డ ఎదుగుదలకు బ్రేక్.. ఎయిమ్స్ పరిశోధనలో షాకింగ్ విషయాలు!
AIIMS Study: వాయు కాలుష్యం (Air Pollution) వల్ల కేవలం ఊపిరితిత్తులు, గుండె జబ్బులు మాత్రమే వస్తాయని అనుకుంటే పొరపాటే. గర్భవతులు కలుషిత గాలిని పీల్చడం వల్ల కడుపులోని బిడ్డకు ఊహించని ముప్పు పొంచి ఉందని ‘ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ (AIIMS Delhi) పరిశోధకుల తాజా అధ్యయనంలో తేలింది. గాలిలోని హానికరమైన సూక్ష్మ ధూళి కణాలు పిండానికి రక్షణగా ఉండే మావి (Placenta - గర్భాశయంలో బిడ్డకు రక్తాన్ని, పోషకాలను అందించే భాగం)ను దెబ్బతీస్తాయని, దీనివల్ల కడుపులోనే శిశువు ఎదుగుదల… -
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
Global Birth Rates: సాధారణంగా ఒక ప్రాంతంలో ఆర్థిక పరిస్థితులు మెరుగై, జీవన ప్రమాణాలు పెరిగినప్పుడు అక్కడ జననాల రేటు (Birth Rates) తగ్గడం చరిత్రలో చూశాం. కానీ, గత రెండు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఒక విచిత్రమైన మార్పు కనిపిస్తోంది. దేశాల ఆర్థిక, సామాజిక పరిస్థితులతో సంబంధం లేకుండా 2007 నుంచి ప్రపంచమంతటా జననాల రేటు ఒకేలా పడిపోతూ వస్తోంది. అసలు ఇలా ఎందుకు జరుగుతోందని పరిశోధకులు తలలు బద్దలు కొట్టుకోగా, చివరకు ఓ ఆసక్తికరమైన నిజం వెలుగులోకి వచ్చింది. మన చేతిలో ఉండే… -
TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్‌తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
TMC Rebellion: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీకి రాజకీయంగా మరో ఊహించని షాక్ తగిలింది. మొన్నటికి మొన్న రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయగా, ఇప్పుడు ఆ సెగ ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్‌కు తాకింది. టీఎంసీకి చెందిన 28 మంది లోక్‌సభ ఎంపీలలో ఏకంగా 20 మంది ఎంపీలు పార్టీ నాయకత్వంపై తిరుగుబావుటా ఎగురవేశారు. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ (NDA) కూటమికి మద్దతు ఇవ్వాలని వారు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో విపక్షాల… -
Trump-Netanyahu: యుద్ధం ముగించాలని ట్రంప్.. మరింత తీవ్రం చేయాలని నెతన్యాహు? అసలు కారణం ఇదే!
Trump-Netanyahu: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెన్జమిన్ నెతన్యాహు మధ్య దోస్తీ చెడుతోంది. ఒకప్పుడు అత్యంత సన్నిహిత మిత్రులుగా పేరున్న ఈ ఇద్దరు అగ్రనేతల మధ్య ఇప్పుడు విభేదాల సెగలు కనిపిస్తున్నాయి. ఇరాన్ కేంద్రంగా సాగుతున్న యుద్ధ వ్యవహారంలో ఒకరికొకరు తోడుగా ఉంటారని అంతా భావించినా, క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడుల విషయంలో ట్రంప్ చేసిన హెచ్చరికలను నెతన్యాహు బేఖాతరు చేయడం అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బెరూట్పై దాడులు చేయవద్దని… -
H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్.. ట్రంప్ విధించిన భారీ రుసుము చెల్లదన్న న్యాయస్థానం!
H-1B Visa: అమెరికాలో విదేశీ ఐటీ నిపుణులు, ముఖ్యంగా భారతీయులు ఎంతగానో ఎదురుచూసే హెచ్-1బీ (H-1B) వీసాల విషయంలో ట్రంప్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కొత్త హెచ్-1బీ వీసాల జారీపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ఏకంగా 1,00,000 డాలర్ల (దాదాపు రూ. 84 లక్షలు) భారీ రుసుమును మసాచుసెట్స్‌లోని బోస్టన్ ఫెడరల్ కోర్టు కొట్టివేసింది. ఈ నిబంధనను సవాలు చేస్తూ 20 రాష్ట్రాల డెమోక్రాటిక్ అటార్నీ జనరల్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి లియో సోరోకిన్… -
Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
Manav Suthar: భారత క్రికెట్లో మరో యువ కెరటం మెరిసింది. ముల్లాంపూర్ వేదికగా శనివారం (జూన్ 6) నుంచి ఆఫ్ఘనిస్తాన్‌తో ప్రారంభమైన ఏకైక టెస్టు మ్యాచ్‌లో యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేశాడు. కెప్టెన్ శుభమన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా మేనేజ్మెంట్ ఈ మ్యాచ్ కోసం తీసుకున్న అతిపెద్ద నిర్ణయం ఇదేనని చెప్పాలి. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన డెబ్యూ క్యాప్‌ను అందుకున్న 23 ఏళ్ల మానవ్ సుతార్, భారతదేశం తరఫున టెస్టుల్లో… -
CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
Chief Minister Revanth Reddy: తనను మభ్యపెట్టడం అంత ఈజీ కాదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పరిపాలనలో కామన్ సెన్స్ అనేదే ముఖ్యమని.. కామన్ సెన్స్‌తో సమస్యలు పరిష్కారం చేసేవే ఎక్కువ అని తెలిపారు. తాజాగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను కేసీఆర్ మీడియా పీపుల్స్‌ను కూడా మీడియా సమావేశానికి పిలుస్తానన్నారు. వాళ్ళ మైండ్ సెంట్ ఏంటో తెలుసుకుంటానని చెప్పారు. తనకు వేరే ఏ పని లేదని.. 16 నుంచి 18 గంటలు పని చేస్తానన్నారు. తాను ఫుట్‌బాల్ ఆడతానని.. అందుకే మెస్సీని… -
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
Malkajgiri: మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేపాలీ గ్యాంగ్ హల్చల్ చేసిన విషయం తెలిసిందే. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూరులో రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీధర్ మోహన్ ఇంట్లో ఈ గ్యాంగ్ దోపిడీకి పాల్పడింది. తాజాగా ఈ దోపిడి కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో పరారీలో నేపాలీ గ్యాంగ్‌ను ఎట్టకేలకు పట్టుకున్నారు. గత నెల 12వ తేదీన రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీధర్ మోహన్ ఇంట్లో పనిచేస్తున్న నేపాల్‌కు చెందిన మమత, రాజేశ్ అనే పనివాళ్లు తమ సహచరులతో కలిసి దోపిడీకి పాల్పడ్డారని… -
Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై “సింగం” ఫార్ములా బ్లాక్‌బస్టర్!!
Tamil Nadu: తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ఒరవడిని కలిగి ఉంటాయి. దశాబ్దాలుగా అక్కడ ద్రావిడ సిద్ధాంతాలు, డీఎంకే (DMK)-ఏఐఏడీఎంకే (AIADMK) ద్వంద్వ పోరాటాలే శాసించాయి. అయితే 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ ఆరు దశాబ్దాల రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేశాయి. కేవలం రెండేళ్ల క్రితం ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీని స్థాపించిన ప్రముఖ నటుడు విజయ్.. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే స్థాయికి ఎదిగారు. మొత్తం 234 స్థానాలకు గాను ఒంటరిగానే 108 స్థానాలను కైవసం చేసుకుని… -
Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
Delhi: ఢిల్లీలోని మాలవీయ నగర్ హోటల్లో సంభవించిన ఘోర అగ్నిప్రమాద ఉదంతం దేశరాజధానిని తీవ్రంగా కలచివేసింది. 21 మంది ప్రాణాలను బలితీసుకుని, మరో 28 మందిని ఆసుపత్రి పాలు చేసిన ఈ దారుణ ఘటనపై ఢిల్లీ పోలీసులు తమ దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఈ ప్రమాదానికి కారణమైన వారిని పట్టుకునే క్రమంలో తాజాగా శనివారం నాడు హోటల్ వంటమనిషి కేశవ్ నేగి (65)ని పోలీసులు అరెస్ట్ చేశారు. దిల్షాద్ గార్డెన్‌కు చెందిన ఈయన నిర్లక్ష్యం వల్లే […]
తాజావార్తలు
-
Sydney Sweeney: స్పోర్ట్స్ యాడ్‌పై తీవ్ర విమర్శలు.. అథ్లెట్ల ఫొటోలు షేర్ చేసి సిడ్నీ స్వీనీ ఇచ్చిన కౌంటర్ వైరల్!
-
Petrol and Diesel Price Hike: పాక్‌లో మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. లీటర్ రూ.409
-
Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
-
CM Revanth Reddy: తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Mukesh Kumar: టీమిండియా పేసర్‌కు బంపర్ ఆఫర్.. ఇదే మొదటిసారి!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!