Hardik Pandya: ఈ రోజు టీం ఇండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా పుట్టిన రోజు. అక్టోబర్ 11, 1993న గుజరాత్లో జన్మించాడు. భారత క్రికెట్లో కపిల్‌దేవ్ తర్వాత ఆ స్థాయి ఆల్‌రౌండర్ ఎవరు..? ఈ ప్రశ్నకి సుదీర్ఘకాలం తర్వాత హార్దిక్ పాండ్యా ఓ సమాధానంలా నిలిచాడు. టీమిండియాలోకి అరంగేట్రం చేసిన తొలినాళ్లలోనే తన పేస్ బౌలింగ్‌తో పాటు పవర్ హిట్టింగ్‌తోనూ స్టార్ ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా ఎదిగాడు. కానీ.. ఈ మూడేళ్ల క్రికెట్ కెరీర్లో ఆట కంటే ఆటేతర కారణాలతో హార్దిక్…
Afghanistan: అక్టోబర్ 9న, పాకిస్థాన్ ఆఫ్ఘన్ రాజధాని కాబూల్, ఇతర నగరాలపై వైమానిక దాడులు ప్రారంభించింది. ఈ దాడులు తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) లక్ష్యాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ అంశంపై తాలిబాన్ ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కానీ ఈ దాడిపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాలిబాన్లకు వాయు రక్షణ ఉందా..? అమెరికా వదిలిపెట్టిన ఆయుధాలతో వారు ఏమి చేస్తున్నారు..? తాలిబన్ల దగ్గర ఫైటర్ జెట్లు, క్షిపణులు ఉన్నాయా..? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం..
Anjan Kumar Yadav: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరును ఏఐసీసీ బుధవారం రాత్రి ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. మొత్తం నలుగురు అభ్యర్థుల పేర్లను ఏఐసీసీకి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సిఫార్సు చేయగా నవీన్ యాదవ్‌ను ఎంపిక చేసింది. ఈ అంశంలో సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ అలిగిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ చర్యలతో మనస్తాపం చెందినట్లు సీనియర్ నేత అంజన్ కుమార్…
Ponnam Prabhakar: జూబ్లీహిల్స్ లో అంజన్ కుమార్ యాదవ్ పోటీ చేయాలని భావించారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ అధిష్టానం టికెట్ వేరే వాళ్ళకి కేటాయించిందన్నారు.. ఏఐసీసీ ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్, వివేక్, తాను వారి ఇంటికి వచ్చి మాట్లాడినట్లు తెలిపారు. అంజన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత అన్నారు.. రెండు సార్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ,రెండుసార్లు పార్లమెంట్ సభ్యుడుగా పని చేశారని గుర్తు చేశారు.. కరోనా సమయంలో ఎన్నో సేవ కార్యక్రమాలు చేసి…
Vemulawada Temple: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులకు నాసిరకం లడ్డూల అమ్మకాలు కొనసాగించడంతో పలు విమర్శలకు తావిస్తోంది. రెండు రోజుల క్రితం తయారుచేసిన లడ్డూల్లో తేమ అరకపోవడం, బూజు పట్టిన లడ్డూలనే అమ్ముతున్నారు. పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదం తీసుకున్న తర్వాత వాటి నుంచి వాసన రావడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Ramchander Rao: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పై బీజేపీ ముఖ్య నేతల సమావేశం జరిగింది.. బీజేపీ అభ్యర్థిపై చర్చించారు. మూడు పేర్లను సెంట్రల్ పార్టీకు పంపించనున్నారు. ఈ సమావేశంలో కిషన్ రెడ్డి, రామ చందర్ రావు, అభయ్ పాటిల్, చంద్రశేఖర్ తివారీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ చందర్ రావు మాట్లాడారు. జూబ్లీహిల్స్ గెలిచి నరేంద్ర మోడీకి గిఫ్ట్ ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసింది.. బీసీలతో రాజకీయాలు చేసిందని విమర్శించారు. […]
Hyderabad: లాలాగూడలో వాలీబాల్ కోచ్ వేధింపులకు విద్యార్థిని బలైంది.. వాలిబాల్ కోచ్ వేధింపులు తాళలేక డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తార్నాక రైల్వే డిగ్రీ కళాశాలలో సెకండ్ ఇయర్ విద్యార్థినిపై కోచ్ వేధింపులకు గురి చేశాడు.. తనను ప్రేమించాలని మౌలిక అనే విద్యార్థిని కోచ్ అంబాజీ వేధించాడు. మనస్తాపానికి గురైన మౌనిక ఉరేసుకుంది. ప్రమోద్ కుమార్ హరితలకు దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు అమ్మయిలు ఒక అబ్బాయి. ప్రమోద్ రైల్వే రిటైర్డ్ ఉద్యోగి కాగా.. మదర్ హౌస్ వైఫ్. మృతురాలు మౌలిక రెండో సంతానం.…
Hyderabad: హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. గంజాయి మత్తులో ఓ దుండగుడు 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దంపతులు హైదరాబాద్–సైదాబాద్ పరిధిలోని సింగరేణి కాలనీలో కూతురు(8), కుమారుడు(7) లతో నివసిస్తూ, కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. దంపతులిద్దరు కూలీ పనులకు వెళ్లిన సమయంలో ఇద్దరు చిన్నారులను ఇంటికి పిలిచాడు ఓ యువకుడు. సోదరుడి ముందే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. బాలిక అనారోగ్యానికి గురవ్వగా, తల్లిదండ్రులు చిన్నారి తమ్ముడిని నిలదీశారు. దీంతో ఆ బాలుడు జరిగిన…
Hydra: హైడ్రా బంజారాహిల్స్‌లో ఆక్రమణలను తొలగించింది. 5 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకుంది. రూ.750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడింది. 5 ఎకరాలలో జలమండలికి 1.20 ఎకరాలను గతంలో కేటాయించింది ప్రభుత్వం. 1.20 ఎకరాలతో పాటు మొత్తం 5 ఎకరాల భూమి తనదంటూ పార్థసారథి అనే వ్యక్తి కోర్టుకెక్కాడు. చుట్టూ ఫెన్సింగ్ వేసి బౌన్సర్లతో పాటు కుక్కలతో కాపలా పెట్టాడు. కోర్టులో వివాదం ఉండగా మొత్తం 5 ఎకరాల భూమిని తన ఆధీనంలోకి తీసుకొని అందులో షెడ్డులు నిర్మించుకొని పహరా కాస్తున్నాడు. ప్రభుత్వ…
Naveen Yadav: కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ లో 47 ఏళ్లలో ఎవరూ లోకల్ అభ్యర్థికి టికెట్ ఇవ్వలేదన్నారు.. ఈ ప్రాంతం నుంచి పోటీ చేసిన పీజేఆర్ ప్రజల్లో ఉంటూ గొప్ప నేతగా ఎదిగారన్నారు.. అయితే పీజేఆర్ కూడా నాన్ లోకల్ అంటూ జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘పీజేఆర్’గా పేదల గుండెల్లో నిలిచిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే పి. జనార్దన్‌రెడ్డి 2007లో పదవిలో ఉండగానే గుండెపోటుతో కుప్పకూలి కన్నుమూశారు. ఖైరతాబాద్ స్థానం నుంచి…